అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం (జనవరి 9) ఆంధ్రప్రదేశ్‌లో అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లాలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం అమ్మఒడిని ప్రారంభించారు. జిల్లాల్లో మంత్రులు ప్రారంభించారు. అర్హులైన తల్లులను పాఠశాలలకు ఆహ్వానించి ఈ పథకాన్ని ప్రారంభించారు. పిల్లలను స్కూల్‌కు పంపించే పేద తల్లులకు ఈ కానుక అందుతుంది.

తల్లి పేరు మీద డబ్బులు
అమ్మఒడి పథకం కింద ప్రతి తల్లికి ఏడాదికి రూ.15,000 అందుతుంది. ఒకటి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులకు.. వారి తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తారు. ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ స్కూల్స్‌లో చదివే విద్యార్థులకు ప్రయోజనం.

ఎంత కేటాయింపు, ఎంతమంది లబ్ధిదారులు...
అమ్మఒడి పథకానికి ప్రభుత్వం రూ.6,456 కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేద కుటుంబం వారికి ప్రయోజనం చేకూరుతుంది. అమ్మఒడి ద్వారా 82 లక్షల మంది విద్యార్థులకు బెనిఫిట్ కలుగుతుంది. 43 లక్షల మంది తల్లుల అకౌంట్లలో డబ్బులు పడతాయి.

ప్రతి జిల్లాలోను లక్షలాది మంది..
ఈ పథకం కింద లబ్ధి పొందే వారిలో దాదాపు ప్రతి జిల్లాలో రెండు లక్షల మంది నుంచి మూడు లక్షలకు పైగా ఉన్నారు. 7,231 మంది అనాథ పిల్లలు లబ్ధి పొందుతున్నారు.

జాబితాలో పేరు లేకపోయినా...
జాబితాలో తల్లులు లేదా సంరక్షకుల పేర్లు లేకపోయినా ఆందోళన అవసరం లేదు. వారు సంబంధిత ధృవీకరణ పత్రాలతో గ్రామ లేదా వార్డు సచివాలయాల దృష్టికి, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోల దృష్టికి తీసుకు వెళ్తే వారు పరిశీలించి అర్హులైతే అమ్మఒడి అందేలా చేస్తారు. సకాలంలో ధృవపత్రాలు అందచేయని పక్షంలో తమ పత్రాలను గ్రామ లేదా వార్డు సచివాలయాలు, ఎంఈవోల దృష్టికి తీసుకు వెళ్లాలని విద్యాశాఖ పేర్కొంది.

నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి రూ.15వేలు బదలీ చేస్తున్నా...
గురువారం చిత్తూరు జిల్లాలో జగన్ అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. అంతకుముందు బుధవారం ఆయన తల్లులకు లేఖలు రాశారు. అమ్మఒడి ఆర్థిక సాయం అందుకోనున్న తల్లులకు అభినందనలు. పేదింటి తల్లులు తమ బిడ్డల్ని చదివించుకునేందుకు పడుతున్న బాధలు పాదయాత్రలో చూశాను. అందుకే మేనిఫెస్టోలో అమ్మఒడి పెట్టి, ఇప్పుడు అమలు చేస్తున్నాం. నేరుగా మీ బ్యాంకు ఖాతాలో రూ.15వేలు బదలీ చేస్తున్నా. ఈ సొమ్ముతో మీ పిల్లల్ని బాగా చదివించండి. మీ లాంటి 43 లక్షల మంది తల్లులకు రూ.6,500 కోట్ల మేర ఆర్థిక సాయం అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని జగన్ లేఖలో పేర్కొన్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications