PPF: నెలకు రూ.12,500 పెట్టుబడి పెడితే.. రూ.2 కోట్లు మీ సొంతం..!
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది ప్రభుత్వ-మద్దతు గల పొదుపు పథకం. ఈ పథకంలో హామీతో కూడిన రాబడి వస్తుంది. PPF ఖాతాదారులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఆదాయపు పన్ను మినహాయింపును పొందేందుకు అర్హులు. అయితే, మినహాయింపు ఒక్క ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు మాత్రమే ఉంటుంది. పెట్టుబడిదారులకు అధిక రాబడిని అందించే అరుదైన ప్రమాద రహిత పెట్టుబడి ఎంపికలలో పీపీఎఫ్ ఒకటి.
7.10 శాతం వడ్డీ
ప్రస్తుతం PPF వడ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. PPF వడ్డీ రేటు త్రైమాసిక ప్రాతిపదికన మారే అవకాశం ఉంటుంది. PPF లో వచ్చే 35 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలనుకుంటే.. ఒక ఇన్వెస్టర్ ఒకరి PPF ఖాతాలో నెలకు రూ.12,500 పెట్టుబడి పెడితే అతను 35 సంవత్సరాల్లో రూ.2.27 కోట్లు పొందే అవకాశం ఉంటుంది.

రూ.2,26,97,857
PPF ఖాతా మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు ఉంటుంది. PPF ఖాతాను పొడిగించడానికి ఫారమ్ 16-Hని సమర్పించవచ్చు. ఇలా ఐద సంవత్సరాల పాటు పొట్టుబడిని పొడిగించవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు పెట్టుబడికి మినహాయింపు ఉంది. సంవత్సరానికి 1.5 లక్షలు చొప్పున 35 సంవత్సరాలు పెట్టుపడి పెడితే 7.10 శాతం వడ్డితో రూ.2,26,97,857 పొందే అవకాశం ఉంటుంది.