For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్: ఈసారైనా నలుపు తెలుపు అవుతుందా?

|

దేశంలో నల్లధనం అన్న మాటే లేకుండా చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అనేకసార్లు ప్రకటించారు. తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ దాగున్న నల్లధనమైనా ఇండియాకి రప్పిస్తామన్నారు. అంతే కాదు, ఒక్కో భారతీయుడి ఖాతాలో సుమారు రూ 15 లక్షలు జమ చేస్తామని చెప్పారు. అదే ఊపులో 2016 నవంబర్ 8న దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పటివరకు అమల్లో ఉన్న రూ 1,000, రూ 500 నోట్లను చిత్తు కాగితాలతో పోల్చుతూ ప్రధాని మోడీ తెగ సంబరపడిపోయారు.

ఇక కలుగులో దాగున్న నల్లధనమంతా బయటకు వస్తుంది చూడండి అని ప్రజలకు చెప్పారు. ప్రజలు కూడా అది నిజమే కావొచ్చని విశ్వసించారు. ఎప్పుడెప్పుడు నల్లధనం బయటకు వస్తుందా... మన ఖాతాలో రూ 15 లక్షలు జమ అవుతాయా అని కలలు కన్నారు. బ్యాంకులు, ఏటీఎం ల వద్ద బారులు తీరినా విసుగు చెందలేదు. ఓపిగ్గా ఓ ఏడాది చూశారు... రెండేళ్లు చూశారు... మూడేళ్లు అయిపోయింది. ఫలితం మాత్రం శూన్యం!

బడ్జెట్ రోజు మార్కెట్లు ఎందుకు పతనమయ్యాయంటే: నిర్మల షాకింగ్ సమాధానం

ఎన్ని వచ్చినా ఏం లాభం?

ఎన్ని వచ్చినా ఏం లాభం?

తానొకటి తలిస్తే... దైవం మరోటి తలచిందని సామెత. నోట్ల రద్దు విషయంలోనూ ప్రధాని మోడీకి ఇలాగే చుక్కెదురైంది. నల్లధనం బయటకు రాకపోగా... ప్రభుత్వం తెచ్చిన రూ 2,000 నోటుతో మరింత భద్రంగా ఉందని చెబుతున్నారు విశ్లేషకులు. ఇదిలా ఉంచితే, డెమోనిటజషన్ సమయంలో ప్రభుత్వం ఒక అమ్నెస్టీ పథకాన్ని ప్రవేశపెట్టింది. అంటే ఎవరివద్ద నైనా లెక్కల్లో చూపని సొమ్ము ఉంటే ఈ పథకం ద్వారా దానిని బహిర్గతం చేసి, సంబంధిత పన్ను చెల్లించి ఇక వైట్ మనీ చేసుకోవటం అన్నమాట. కానీ దానికి అనుకున్నంత స్పందన రాలేదు. ఒక వైపు దేశం ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతున్న తరుణంలో, మరోవైపు పన్నుల వసూళ్లు భారీగా పడిపోతున్న సమయాన, ప్రభుత్వం మరోసారి ఇలాంటి పథకాన్ని ముందుకు తెచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2020 లో కూడా మరో అమ్నెస్టీ పథకాన్ని ప్రకటించింది. ఇప్పటికే దేశంలో అనేక సార్లు ఇలాంటి పథకాలు పెట్టారు. స్పందన మాత్రం అంతంతే.

పన్ను తగ్గితేనే...

పన్ను తగ్గితేనే...

డెమోనిటజషన్ తర్వాత దేశంలో చాలా మందికి ఇన్కమ్ టాక్స్ (ఐటీ) నోటీసులు వచ్చాయి. అందులో కొన్ని పరిష్కారం కాగా... మరికొన్ని కేసులు ట్రిబ్యునల్స్ కు వెళ్లాయి. అయితే, ప్రస్తుత బడ్జెట్ లో ఆర్థిక మంత్రి 'వివాద్ సే విశ్వాస్' పేరుతో వాటికి పరిష్కారం చూపే ప్రయత్నం చేశారు. ఐటీ శాఖ నోటీసులు అందుకున్న వారు మొత్తం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. వాటిపై అదనపు పెనాల్టీలు, వడ్డీ ల బాదుడు ఉండదు. ఈ విషయాన్నీ స్వయంగా కేంద్ర రెవిన్యూ శాఖ సెక్రటరీ అజయ్ భూషణ్ పాండే వెల్లడించారు. కానీ కేవలం పెనాల్టీలు రద్దు చేస్తే పన్నులు కడతారు అనుకుంటే పొరపాటేనని విశ్లేషకులు అభ్రిప్రాయపడుతున్నారు. ఎందుకంటే, ప్రస్తుతం దేశంలో ఆదయ పన్ను రేట్లు అధికంగా ఉన్నాయి కాబట్టి, అంత మొత్తంలో పన్ను చెల్లించలేకే నల్లధనం వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటప్పుడు మళ్ళీ అంతే పన్ను చెల్లించి ఎవరైనా ఎందుకు కొరివితో తలగోక్కుంటారు అని ప్రశ్నిస్తున్నారు. దానికి బదులు పన్నులనే స్థిరీకరించి తక్కువ చేసినప్పుడే నల్లధనానికి అడ్డుకట్ట వేయగలమని చెబుతున్నారు.

ఊహించిన దానికంటే అధికం...

ఊహించిన దానికంటే అధికం...

ఎవరి అంచనాలు వారికున్నా ... ఇండియాలో నల్లధనం ఎవరూ ఊహించనంత పేరుకుపోయి ఉందని ఆర్థిక నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తారు. చాలా మంది ఆర్థిక వేత్తలైతే ప్రస్తుతం మన జీడీపీ కి సమాంతరంగా అంతే విలువైన నల్లధన వ్యవస్థ కొనసాగుతుందని చెబుతున్నారు. ఇది సుమారు రూ 25 లక్షల కోట్ల నుంచి రూ 60 లక్షల కోట్ల మేరకు ఉంటుందని పేర్కొంటున్నారు. దానిని కూకటి వేళ్ళతో పెకిలించటం ఎవరి తరమూ కాదని, కేవలం తక్కువ పన్నులు ఉంటేనే ప్రజలు స్వచ్చందంగా పన్నులు చెల్లించి అన్నీ అధికారిక లావాదేవీలు నిర్వహిస్తారని అంటున్నారు. అది కాకుండా డిజిటల్ పేమెంట్ల వ్యవస్థను ఎంత బలోపేతం చేసినా... మరో చోట దానికి ఎలా చిల్లు పెట్టాలో మన వారికి వెన్నతో పెట్టిన విద్యేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికా, చైనా, రష్యా ఇలా దేశం ఏదైనా నల్లధనం ఉండి తీరుతుందని, అలాంటిది భారత్ వంటి దేశాల్లో దానిని రూపు మాపటం అనుకున్నంత తేలిక కాదని చెబుతున్నారు.

English summary

amnesty scheme for converting unaccounted money into white

Economists expect a lukewarm response to the recently announced amnesty scheme for converting un-accounted money into white by paying in full taxes. The experts feel that the people who hoard huge sums in black may not come forward to these sort of un-attractive deals as they believe it was hoarded due to prevailing huge taxes in the country. Instead, the experts suggest that the government should reduce taxes to a level where every one should feel they are affordable.
Story first published: Tuesday, February 4, 2020, 20:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X