For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Amazon Web Services: హైదరాబాద్‍లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీజియన్ ప్రారంభం..

|

క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫారమ్ సర్వీస్‌లో అగ్రగామిగా ఉన్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS)రెండవ మౌలిక సదుపాయాల రీజియన్ ను హైదరాబాద్ లో ప్రారంభించింది. రాబోయే ఎనిమిదేళ్లలో $4.4 బిలియన్ల (సుమారు రూ.36,000 కోట్లు) పెట్టుబడులు పెట్టనుంది. ఈ కంపెనీ తన మొదటి రీజయన్ 2016లో ముంబైలో ప్రారంభించింది. AWS రీజియన్ తన కస్టమర్‌లకు దేశంలో డేటాను సురక్షితంగా నిల్వ చేస్తుంది.

స్టార్టప్‌లు

డెవలపర్‌లు, స్టార్టప్‌లు, వ్యవస్థాపకులు, ఎంటర్‌ప్రైజెస్, ప్రభుత్వం, లాభాపేక్ష లేని సంస్థలు, దేశంలోని డేటా సెంటర్‌ల నుంచి తమ అప్లికేషన్‌లను అమలు చేయడానికి, తుది వినియోగదారులకు సేవలను అందించడానికి అమెజాన్ వెబ్ సర్వీసెస్ గొప్ప ఎంపికగా ఉంటుంది. "డేటా అనలిటిక్స్, సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో సహా ఆవిష్కరణలను నడపడానికి కస్టమర్‌లు అధునాతన AWS టెక్నాలజీలకు ప్రాప్యత కలిగి ఉంటారు" అని కంపెనీ ఎగ్జిక్యూటివ్ మంగళవారం తెలిపారు.

భారత్ డిజిటల్

హైదరాబాద్ రీజియన్ ప్రారంభం భారత్ డిజిటల్ పరివర్తనకు మద్దతు ఇస్తుంది. 2011లో మా మొదటి కార్యాలయాన్ని ప్రారంభించినప్పటి నుంచి దేశంలో మా దీర్ఘకాలిక పెట్టుబడి పెడుతున్నాం" అని అమెజాన్ డేటా సర్వీసెస్ ఇంక్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ కళ్యాణరామన్ చెప్పారు. భారతదేశంలో తమ డేటాసెంటర్‌లను విస్తరించడంలో AWS పెట్టుబడులు పెట్టడం స్వాగతించదగిన పరిణామం.

రాజీవ్ చంద్రశేఖర్

భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ఉత్ప్రేరకపరచడంలో ఖచ్చితంగా సహాయపడుతుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. "దేశంలో ప్రగతిశీల డేటాసెంటర్ హబ్‌గా తెలంగాణ స్థానాన్ని బలోపేతం చేసే వింధంగా హైదరాబాద్‌లోని AWS రీజియన్‌లో సుమారు రూ. 36,300 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న AWS స్వాగతిస్తున్నాము" అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

English summary

Amazon Web Services: హైదరాబాద్‍లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీజియన్ ప్రారంభం.. | Amazon Web Services (AWS) launched a second infrastructure region in Hyderabad

Amazon Web Services (AWS) has launched its second infrastructure region in Hyderabad. It will invest $4.4 billion (about Rs.36,000 crore) in the next eight years
Story first published: Tuesday, November 22, 2022, 16:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X