For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్‌లో అమెజాన్ విస్తరణ: ఉద్యోగాలు, 23వేలమంది వ్యాపారులకు ప్రయోజనం

|

అమెజాన్ ఇండియా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రెండు ఫుల్‌ఫిల్మెంట్ కేంద్రాలను ఓపెన్ చేసింది. రాబోవు పండుగ సీజన్, కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్ ఆర్డర్స్ పెద్ద ఎత్తున పెరగడంతో తన పంపిణీ సేవల సామర్థ్య విస్తరణలో భాగంగా రెండు కొత్త సరఫరా కేంద్రాలను ప్రారంభించినట్లు అమెజాన్ ఇండియా మంగళవారం వెల్లడించింది. దీంతో కస్టమర్ల ఆర్డర్స్ మేరకు వస్తువులను వేగంగా చేరవేయవచ్చునని తెలిపింది. కొత్తవాటితో కలిపి హైదరాబాద్ నగరంలో అమెజాన్ ఇండియాకు 4.5 మిలియన్ క్యూబిక్ అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు ఫుల్‌ఫిల్మెంట్ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుత విస్తరణ వల్ల కస్టమర్లకు మెరుగైన సేవలతో పాటు ఉద్యోగాలు వస్తాయి.

Ecom Express: విజయవాడ సహా మెట్రో నగరాల్లో 30,000 ఉద్యోగాలుEcom Express: విజయవాడ సహా మెట్రో నగరాల్లో 30,000 ఉద్యోగాలు

23వేలమంది వ్యాపారులకు ప్రయోజనం

23వేలమంది వ్యాపారులకు ప్రయోజనం

తెలంగాణలో అమెజాన్ ఇండియా 4.5 మిలియన్ క్యూబిక్ అడుగుల విస్తీర్ణం కలిగిన ఫుల్‌ఫిల్మెంట్ కేంద్రాలు, 23,000కు పైగా సెల్లర్స్‌ను కలిగి ఉంది. వీరికి ఈ నాలుగు ఫుల్‌ఫిల్మెంట్ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. భారత దేశంలో వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తామని, ఇందులో భాగంగా 10 కొత్త ఫుల్‌ఫిల్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే ఉన్న 7 కేంద్రాలను విస్తరిస్తామని అమెజాన్ ఇండియా ఇటీవల తెలిపింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో తాజా విస్తరణ చోటు చేసుకుంది. ఇదివరకు ఉన్న ఫుల్‌ఫిల్మెంట్ సామర్థ్యాన్ని లక్ష చదరపు అడుగులకు పైగా పెంచింది.

అందుబాటులో..

అందుబాటులో..

ఈ ఫుల్‌ఫిల్మెంట్ సెంటర్ ద్వారా ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, టీవీలతో పాటు పెద్ద ఉపకరణాల విభాగంలో మొత్తం ఫర్నిచర్ పరిధిని కలిగి ఉండి దాదాపు 1.2 లక్షల ఉత్పత్తుల్ని నిల్వ చేస్తుంది. తెలంగాణలోని ఇతర సరఫరా కేంద్రాల్లో స్మార్ట్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్ కేటగిరీ ఉత్పత్తుల కోసం వినియోగించనుంది. భారత్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి హైదరాబాద్ కేంద్రం నుండి అమెజాన్-తెలంగాణ అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యాయని, కస్టమర్లకు మరిన్ని సురక్షిత సౌకర్యాలు కల్పిస్తున్నందుకు ఆనందంగా ఉందని అమెజాన్ ఇండియా (ఫుల్‌ఫిల్మెంట్ సెంటర్స్ అండ్ సప్లై చైన్) ఎండీ ప్రకాశ్ కుమార్ దత్త అన్నారు.

ఉద్యోగ అవకాశాలు

ఉద్యోగ అవకాశాలు

తెలంగాణలో అమెజాన్ ఇండియా పెట్టుబడులు కొనసాగుతున్నాయని, రాష్ట్రంలో వ్యాపార అవకాశాలు, పారిశ్రామిక అనుకూల విధానాలు, విస్తృతస్రేణి మౌలిక సదుపాయాలకు ఇది నిదర్శనమని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. అమెజాన్ ఫుల్‌ఫిల్మెంట్ సెంటర్ల విస్తరణ, కొత్త వేర్‌హౌస్‌ల ఏర్పాటు చిన్న, మధ్యతరహా వ్యాపారులకు ఎంతో లాభమని చెప్పారు. స్థానిక, యువ ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

English summary

హైదరాబాద్‌లో అమెజాన్ విస్తరణ: ఉద్యోగాలు, 23వేలమంది వ్యాపారులకు ప్రయోజనం | Amazon opened two fulfillment centres in Hyderabad

This expansion will help sellers offer a wider selection and enable faster deliveries of customer orders within the region and neighbouring states ahead of the upcoming festive season, the e-commerce giant said.
Story first published: Wednesday, September 16, 2020, 9:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X