For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక ఇంటికే మెడిసిన్స్.. అమెజాన్ ఫార్మసీ సేవలు స్టార్ట్.. తొలుత అమెరికాలో...

|

ఆన్‌‌లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ కొత్త సర్వీసు ప్రారంభిస్తోంది. అమెజాన్ ఫార్మసీ పేరుతో మెడిసిన్స్‌‌ను కూడా హోం డెలివరీ చేయనుంది. ఆర్డర్‌‌కు తొలుత ప్రిస్క్రిప్షన్ సబ్మిట్ చేయడం తప్పనిసరి అని పేర్కొన్నది. ఏదైనా మందులతో అలర్జీ లాంటి సమస్యలు ఏర్పడితే వాటినీ పేర్కొనాలని సూచించింది. డాక్టర్లు మాత్రం ప్రిస్క్రిప్షన్స్‌ను‌ నేరుగా అమెజాన్ ఫార్మసీకి పంపించే వెసులుబాటు కల్పించింది.

తొలుత అమెరికాలో గల 45 రాష్ట్రాల్లో అమెజాన్ ఫార్మసీ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. తర్వాత ఇతర దేశాల్లో అందుబాటులోకి రానున్నది. ఇండియా సహా ఇతర దేశాల్లో వలను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారనే అంశంపై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. పేషెంట్లు ప్రిస్క్రిప్షన్స్‌‌ను రీటెయిలర్స్ నుంచి కూడా ట్రాన్స్‌‌ఫర్ చేసే అవకాశం ఉంది.

amazon launches amazon pharmacy to deliver medicines at home

మందుల మీద అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌‌కు ప్రత్యేక డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు ప్రైమ్ మెంబర్స్‌‌ మందులు ఆర్డర్ చేసిన రెండ్రోజుల్లోనే డెలివరీ అందుతాయి. ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా మెడిసిన్స్‌‌ను ఆర్డర్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇన్సూరెన్స్ ఉంటే పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇన్సూరెన్స్ ప్లాన్‌‌తో పేమెంట్ చేసుకునే అవకాశం కల్పించారు.

English summary

ఇక ఇంటికే మెడిసిన్స్.. అమెజాన్ ఫార్మసీ సేవలు స్టార్ట్.. తొలుత అమెరికాలో... | amazon launches amazon pharmacy to deliver medicines at home

amazon launches amazon pharmacy to deliver medicines at home in america. soon available in india and other countries
Story first published: Wednesday, November 18, 2020, 15:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X