For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెజాన్ నష్టం రూ.5,685 కోట్లు, అమెజాన్‌పే నష్టం రూ.1,160 కోట్లు

|

అమెజాన్ ఇండియా నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,685 కోట్లుగా నమోదయ్యాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.6,287 కోట్ల నష్టం కాగా, ఈ ఏడాది 9.5 శాతం తగ్గింది. అదే సమయంలో ఆదాయం 55 శాతం వృద్ధితో రూ.7,778 కోట్లకు చేరుకుంది. ఈ మేరకు బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాం టోప్లర్ తెలిపింది. లాభాల్లో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ ఆదాయంలో మాత్రం ఊరట లభించింది.

దేశీయంగా గ్రూప్ సంస్థలతో కలిసి అమెజాన్ నష్టాలు 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.7,000 కోట్లుగా నమోదయ్యాయి. ఇక B2B విభాగమైన అమెజాన్ హోల్ సేల్ ఇండియా ఆదాయం 2018-19లో రూ.11,250 కోట్లుగా నమోదయింది. 2017-18 ఆదాయం కంటే 8 శాతం తక్కువ. నష్టం మాత్రం రూ.131.4 కోట్ల నుంచి రూ.141 కోట్లకు పెరిగింది.

ఆదాయపు పన్ను: దక్షిణాది రాష్ట్రాల నుంచే మన దేశానికి 62% ఆదాయంఆదాయపు పన్ను: దక్షిణాది రాష్ట్రాల నుంచే మన దేశానికి 62% ఆదాయం

 Amazon Indias e commerce arm narrows FY19 loss to ₹5,685 crore

అమెజాన్‌ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ విభాగ ఆదాయం 31 శాతం పెరిగి రూ.2,079 కోట్లుగా నమోదయింది. నికర నష్టం మాత్రం రూ.27.5 కోట్లుగా నమోదయింది. చెల్లింపుల విభాగం అమెజాన్ పే ఇండియా నష్టాలు రూ.334.20 కోట్ల నుంచి రూ.1.160.8 కోట్లకు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరానికి గాను యూనిట్ రెవెన్యూ అంతకుముందు ఏడాది కంటే రెండు రెట్లు పెరిగి రూ.834.5 కోట్లుగా ఉంది.

English summary

అమెజాన్ నష్టం రూ.5,685 కోట్లు, అమెజాన్‌పే నష్టం రూ.1,160 కోట్లు | Amazon India's e commerce arm narrows FY19 loss to ₹5,685 crore

Amazon Seller Services, the online marketplace arm of the e-commerce giant in India, has narrowed its loss to ₹5,685 crore for 2018-19.
Story first published: Tuesday, October 29, 2019, 9:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X