For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bonus Shares: ఇన్వెస్టర్లకు డబుల్ బొనాంజా.. ఒక్కో షేరుకు 9 ఉచిత షేర్లు.. మిస్ కాకండి..!

|

Bonus Shares: ఇటీవల చాలా కంపెనీలు బోనస్ షేర్లను అందిస్తున్నాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే స్టాక్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైనది. ఇన్వెస్టర్లకు ఉచిత షేర్లను అందించటంతో పాటు మంచి రాబడులను సైతం అందించిన మైక్రో స్టాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిజంగా ఈ మల్టీబ్యాగర్ స్టాక్ కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు పండగనే చెప్పుకోవాలి.

కంపెనీ పేరు..

కంపెనీ పేరు..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది మైక్రోక్యాప్ కంపెనీ అయిన ఆల్‌స్టోన్ టెక్స్‌టైల్స్ గురించే. ఈ స్టాక్ మల్టీబ్యాగర్ రాబడులను అందించటంతో పాటు తాజాగా బోనస్ షేర్లను సైతం అందిస్తోంది. నిరంతరం పెరుగుతూ ముందుకు సాగుతున్న స్టాక్ అప్పర్ సర్క్యూట్‌లను తాకుతోంది. రానున్న కాలంలో ఇన్వెస్టర్లకు ఈ షేర్ పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందించే అవకాశం ఉందని అంచనా వేయబడింది.

ఒక్కో షేర్ 100 షేర్లుగా..

ఒక్కో షేర్ 100 షేర్లుగా..

కంపెనీ తన ఇన్వెస్టర్లకు 9:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను అందించాలని నిర్ణయించింది. అంటే ఇన్వెస్టర్లు కలిగి ఉన్న ఒక్కో షేరుకు 9 బోనస్ షేర్లు పొందుతారు. దీనికి తోడు 1:10 నిష్పత్తిలో స్టాక్ స్ప్లిట్ చేయాలని ప్రకటించింది. అంటే ఒక్కో షేర్ 10 షేర్లుగా విభజించబడుతుంది. దీంతో షేర్ ఫేస్ వ్యాల్యూ ఒక్కోదానికి రూ.1గా మారుతుంది. అంటే ఈ ప్రక్రియ మెుత్తం పూర్తైతే ఒక్కో షేరు 100 షేర్లుగా మారతాయి. కంపెనీ డిసెంబర్ 3, 2022ని రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది.

షేర్ ధర హిస్టరీ..

షేర్ ధర హిస్టరీ..

బోనస్ షేర్ల ప్రకటనతో కంపెనీ షేర్లు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. కేవలం ఒక్క నెల కాలంలో ఆల్‌స్టోన్ టెక్స్‌టైల్స్ స్టాక్ ధర రూ.89 నుంచి రూ.235కు పెరిగింది. ఏడాది ప్రాతిపదికన స్టాక్ 1,400% మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. శుక్రవారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో లాకై రూ.235.50 వద్ద ముగిసింది. ఇది స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర. ఇదే క్రమంలో స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.15గా ఉంది.

కంపెనీ వ్యాపారం..

కంపెనీ వ్యాపారం..

Alstone Textiles (India) Limited కంపెనీ పేరు గతంలో షాలినీ హోల్డింగ్స్ లిమిటెడ్. ఈ కంపెనీ 1985లో స్థాపించబడింది. కంపెనీ పేరు మార్పు 2015లో జరిగింది. మొదట్లో కంపెనీ కాటన్, ఊలు, ఆర్ట్ సిల్క్, నేచురల్ సిల్క్, రెడీమేడ్ గార్మెంట్స్, హోజరీ, సింథటిక్స్ ఫైబర్, ఫ్యాబ్రిక్ అండ్ మిక్స్‌డ్ ఫ్యాబ్రిక్స్‌ ఉత్పత్తులను తయారు చేసేది. కంపెనీని వేగంగా అభివృద్ధి బాటలో నడిపించేందుకు యాజమాన్యం సిద్ధమైంది.

English summary

Bonus Shares: ఇన్వెస్టర్లకు డబుల్ బొనాంజా.. ఒక్కో షేరుకు 9 ఉచిత షేర్లు.. మిస్ కాకండి..! | Alstone Textiles (India) Limited stock announced stock split with bonus shares

Alstone Textiles (India) Limited stock announced stock split with bonus shares
Story first published: Saturday, November 12, 2022, 15:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X