కరోనా మహమ్మారి కారణంగా 2020 సంవత్సరంలో దాదాపు అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏవియేషన్, హాస్పిటాలిటీ రంగాలపై అయితే ప్రభావం దారుణంగా పడింది. గత ఏడాది అన్ని రంగాల్లో ఉద్యోగాలు పోయినప్పటికీ, ఏవియేషన్, హాస్పిటాలిటీపై అధిక ప్రభావం చూపి, ఎక్కువ ఉద్యోగాలు కోల్పోయింది ఈ రంగాల్లోనే. పలు దేశాలు ఆంక్షలు ఎత్తివేయడంతో క్రమంగా కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. విమాన సర్వీసులు దాదాపు 50 శాతం సీటింగ్‌తో పరిమితస్థాయిలో ఉన్నాయి. కానీ 2020లో తీవ్రంగా దెబ్బతిన్న ఏవియేషన్ రంగంపై 2021లోను అప్పుడే కోలుకునే అవకాశాలు లేవని ఏవియేషన్ నిపుణులు భావిస్తున్నారు.

ట్రాఫిక్ డిమాండ్
ఏవియేషన్ కన్సల్టెంట్ సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ (CAPA) విమాన రంగంలో రికవరీ గురించి అంచనాలు వెలువరించింది. 2021లోను డిమాండ్ రికవరీ అనిశ్చితిగానే ఉంటుందని పేర్కొంది. ప్రధానంగా అంతర్జాతీయ ట్రాఫిక్‌కు డిమాండ్ అంతవేగంగా ఉండదని అభిప్రాయపడింది. CAPA ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరంలో ఇంటర్నేషనల్ ట్రాఫిక్ 35-40 శాతం కోలుకోవచ్చు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో డొమెస్టిక్ ట్రాఫిక్ 70 శాతం నుండి 80 శాతం కోలుకోవచ్చునని వెల్లడించింది.

అప్పుడే కరోనా పూర్వస్థితికి
కరోనా వ్యాప్తికి ముందు డొమెస్టిక్ ట్రావెల్ సెగ్మెంట్(బిజినెస్, ఇనిసిట్యూషనల్, ఎంఐసీఈ, లీజర్, ఫారనర్స్ ట్రావెలింగ్) 55 శాతం వాటా ఉంది. అయితే ఇది కరోనా పూర్వస్థితికి అప్పుడే చేరుకునే అవకాశాలు తక్కువ అని అభిప్రాయపడింది. వైరస్ అంతం, వ్యాక్సీన్ వచ్చే వరకు పూర్తిస్థాయిలో వచ్చే వరకు ఇలాగే ఉండవచ్చునని తెలిపింది.

దీర్ఘకాలిక వ్యాపార నమూనా
ఏజెన్సీలను ఆధునీకరించవలసిన అవసరాన్ని ఇకపై విస్మరించలేమని కూడా సీఏపీఏ అభిప్రాయపడింది. పరిశ్రమ మార్కెట్ ఆధారితంగా ఉంటుందని తెలిపింది. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (AAI) దీర్ఘకాలిక వ్యాపార నమూనా అవసరమని, ఎందుకంటే అతిపెద్ద విమానాశ్రయాలు ప్రయివేటీకరించబడతాయని పేర్కొంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications