For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎయిరిండియా కోసం అమెరికా సంస్థ ఆసక్తి, ఉద్యోగులతో కలిసి రేసులోకి..

|

న్యూఢిల్లీ: ఎయిరిండియా కొనుగోలుకు పలు సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. ఇప్పటికే టాటా గ్రూప్‌తో పాటు ఎయిరిండియా ఉద్యోగులు కూడా సంస్థ కొనుగోలు కోసం కంపెనీ కొనుగోలుకు ఆసక్తికర వ్యక్తీకరణ(EOI) బిడ్‌ను దాఖలు చేశారు. బిడ్ దాఖలుకు సోమవారం (డిసెంబర్ 14) సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారు. గడువులోగా పలువురు సంస్థలు EOI దాఖలు చేశాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం గత కొద్ది నెలలుగా ప్రయత్నాలు చేస్తోంది. టాటాతో పాటు ఇంటరప్స్ సంస్థ కూడా EOI దాఖలు చేసింది.

రైతు ఉద్యమం-MNP war: జియో సంచలన ఆరోపణ, ఎయిర్‌టెల్, VI ఏమన్నదంటే?రైతు ఉద్యమం-MNP war: జియో సంచలన ఆరోపణ, ఎయిర్‌టెల్, VI ఏమన్నదంటే?

ఇవి దక్కుతాయి..

ఇవి దక్కుతాయి..

ఎయిరిండియాలో ప్రభుత్వ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి, పలు EOIలు దాఖలయ్యాయని, ఈ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు రెండో దశకు చేరిందని పెట్టుబడులు, ప్రభుత్వ ఉపసంహరణ విభాగం (దీపమ్) కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్వీట్ చేశారు. ఎవరెవరు, ఎంత బిడ్ దాఖలు చేశారనే విషయాన్ని వెల్లడించాల్సి ఉంది.

బిడ్ దక్కించుకునే వారికి ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం వాటా దక్కుతుంది. దేశీయ విమానాశ్రయాల్లో 4,400 దేశీయ, 1800 అంతర్జాతీయ ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్స్ దక్కుతాయి. విదేశీ విమానాశ్రయాల్లో 900 స్లాట్స్ దక్కుతాయి. కార్గో, గ్రౌండ్, హ్యాండ్లింగ్ సేవలు అందించే ఏఐఎస్ఏటీఎస్‌లో 50 శాతం వాటా ఉంటుంది. జనవరి 6వ తేదీలోగా బిడ్స్ అర్హతపై ఆయా బిడ్డర్లకు ట్రాన్సాక్షన్స్ సలహాదారు సమాచారం అందించనున్నారని తెలుస్తోంది.

అమెరికా సంస్థ కూడా.. తెలుగువారే

అమెరికా సంస్థ కూడా.. తెలుగువారే

2019 మంది ఎయిరిండియా ఉద్యోగుల బృందం కూడా EOI దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరు కనీసం రూ.1 లక్ష ఇందుకు కేటాయించారు. ఉద్యోగులు ఏదైనా ఆర్థిక సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నారని తెలుస్తోంది. కాగా, బిడ్డింగ్‌లో ఉద్యోగులతో కలిసి అమెరికాకు చెందిన సంస్థతో కలిసి ఈ EOI దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఉద్యోగులు 51 శాతం వాటా, మిగతా వారు 49 శాతం వాటాను కొనేందుకు ఇంటరప్స్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఇంటరప్స్ సంస్థ చైర్మన్ తెలుగువారు లక్ష్మీప్రసాద్.

అప్పులు కూడా భరించాలి

అప్పులు కూడా భరించాలి

ప్రస్తుత ఎయిరిండియాను 1932లో టాటా ఎయిర్ లైన్స్ పేరిట టాటా గ్రూప్ నెలకొల్పింది. 1946లో ఎయిరిండియాగా మారింది. 1953లో ప్రభుత్వం సొంతం చేసుకుంది. ఇప్పుడు 67 సంవత్సరాల తర్వాత అదే ఎయిరిండియాను సొంతం చేసుకునేందుకు టాటా సంస్థ ముందుకు రావడం గమనార్హం. ఎయిరిండియా కొనుగోలు రేసులో నిలిచే కంపెనీ రూ.23,000 కోట్ల రుణాలను భరించవలసి ఉంటుంది. ఎయిరిండియా మొత్తం రుణాలలో మిగిలిన వాటాను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న SPVకి బదలీ చేయనున్నారు. ఎయిరిండియా ఎంటర్‌ప్రైజ్ వ్యాల్యూను మార్కెట్ క్యాపిటలైజేషన్, స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు, బ్యాలన్స్ షీట్లో ఉన్న నగదు తదితరాల ఆధారంగా నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది.

English summary

ఎయిరిండియా కోసం అమెరికా సంస్థ ఆసక్తి, ఉద్యోగులతో కలిసి రేసులోకి.. | Air India Sale Gets Multiple Bids: Tatas in Race for Stake

US-based Interups Inc. on Monday submitted an Expression of Interest (EOI) in picking up stakes in Air India after employees of the airline have formed a consortium with the US-based company to bid for the airline. The last date for submission of EOI submission to buy Air India ends today i.e. December 14.
Story first published: Tuesday, December 15, 2020, 12:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X