విమానయానరంగ దిగ్గజం ఎయిరిండియా 48 మంది పైలెట్లను తొలగిస్తూ అర్దరాత్రి నిర్ణయం తీసుకున్నది. కరోనా మహమ్మారి కారణంగా నష్టాల్లో ఉన్న ఎయిరిండియా ఈ పైలెట్లను తొలగించింది. ఉద్వాసనకు గురైన 48 మంది పైలెట్లు గత ఏడాది రాజీనామా చేస్తూ ఆరు నెలల నోటీసు ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. ఎయిర్ బస్ 320 విమానాలకు చెందిన పైలెట్లను తొలగించింది. అంతకుముందు రాజీనామాలు అంగీకరించినప్పటికీ, ఆ తర్వాత గురువారం రాత్రి హఠాత్తుగా వెనక్కి తీసుకుంది. వారిని వెంటనే తొలగిస్తున్నట్లు తెలిపింది.

ఉద్యోగం నుండి తొలగించినట్లు తెలియకుండానే.
కరోనా మహమ్మారి ప్రభావం కమర్షియల్ కార్యకలాపాలపై పడటం, ఆదాయ క్షీణతల వంటి వివిధ కారణాలతో వారిని తొలగిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఇందులో కొంతమంది పైలట్లకు శుక్రవారం ఉదయం కూడా తమను ఉద్యోగం నుండి తొలగించినట్లు తెలియకపోవడం గమనార్హం. అందులో కొంతమంది అప్పటికి విధుల్లో భాగంగా విమాన ప్రయాణంలో ఉన్నారు. ఆ సమయంలోనే వీరికి షాక్ తగిలింది.

అన్యాయంగా.. హఠాత్తుగా తొలగింపు
పైలెట్ల తొలగింపు ఉత్తర్వులను రద్దు చేయాలని ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్(ICPA) ఎయిరిండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బన్సాల్‌ను కోరింది. పైలట్లను అన్యాయంగా, హఠాత్తుగా తొలగించారని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. పైలట్లు 2019 జూలైలో రాజీనామా చేశారు. ఆ తర్వాత నిబంధనల మేరకు ఆరు నెలల లోపు ఉపసంహరించుకున్నారు. వాటిని యాజమాన్యం కూడా అంగీకరించింది. కానీ వారిని హఠాత్తుగా మొన్న రాత్రి నుండి తొలగించింది.

ఎయిరిండియాపై టాటా సన్స్ ఆసక్తి
ఎయిరిండియాను కొనుగోలు చేసే అంశంపై టాటా సన్స్ దృష్టి సారించినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఎయిరిండియాను వశం చేసుకోవడానికి ఈ నెల చివరి వరకు అధికారికంగా బిడ్స్ దాఖలు చేసే అవకాశముందని, ఇప్పటికే ఈ సంస్థకు సంబంధించిన వివిధ అంశాలను టాటా సన్స్ పరిశీలిస్తోందని తెలుస్తోంది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications