2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు దారుణంగా పడిపోనుందని ఇండియా రేటింగ్స్, ఫిచ్ రేటింగ్స్ సహా వివిధ రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో గతంలో వేసిన అంచనా కంటే మరింత ప్రతికూలత నమోదు చేస్తుందని రేటింగ్ ఏజెన్సీలు వెల్లడిస్తున్నాయి. భారత జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10.5 శాతం మేర ప్రతికూలత నమోదు చేస్తుందని ఫిచ్ రేటింగ్ అంచనా వేసింది.
ఇది గతంలో మైనస్ 5 శాతం అంచనా వేసింది. అంతకుముందు 5.3 శాతం ప్రతికూలత అంచనా వేసిన ఇండియా రేటింగ్స్, ఇప్పుడు 11.8 శాతం ప్రతికూలత నమోదు చేస్తుందని అంచనా వేసింది. నోమురా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ భారత జీడీపీ వరుసగా మైనస్ 10.8 శాతం, మైనస్ 10.9 శాతం అంచనా వేశాయి. 2020 క్యాలెండర్ ఇయర్‌లో 5 శాతం ప్రతికూలత ఉండవచ్చునని, 2021 క్యాలెండర్ ఇయర్‌లో మాత్రం 9.5 శాతంగా ఉండవచ్చునని మోర్గాన్ స్టాన్లీ, ఈ ఆర్థిక సంవత్సరంలో మైనస్ 14.8 శాతం ప్రతికూలత ఉండవచ్చునని గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది.

భారత్, బ్రిటన్‌లలో మాంద్యం ఎక్కువ
ఫిచ్ రేటింగ్స్ 2020లో అమెరికా వృద్ధి 4.6 శాతం ప్రతికూలత (అంతకుముందు 5.6 శాతం) ఉంటుందని అంచనా వేసింది. యూరో ప్రాంతంలో 9 శాతం ప్రతికూలత, యూకే మైనస్ 11.5 శాతం, ఫ్రాన్స్ మైనస్ 9 శాతం, స్పెయిన్ మైనస్ 13.2 శాతం అంచనా వేసింది. కరోనా కారణంగా పూర్తి ఏడాదికి యూకే, ఇండియా, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ ఆర్థిక వ్యవస్థలపై ఎక్కువగా ప్రభావం పడనుంది. ఫిచ్ రేటింగ్స్ ప్రకారం భారత్, బ్రిటన్, స్పెయిన్ దేశాల్లో మాంద్యం తీవ్రంగా కనిపిస్తోంది.

అనేక సవాళ్లు
ఆర్థిక వ్యవస్థలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో జూలై-సెప్టెంబర్‌వలో వృద్ధి పుంజుకోవాల్సి ఉంది. అయితే రికవరీ సంకేతాలు మందగమనంగా ఉన్నట్లు ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో వృద్ధి పుంజుకోవడానికి అనేక సవాళ్లు కనిపిస్తున్నాయి. కరోనా కేసులు పెరగడంతో కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాలు తిరిగి లాక్ డౌన్ ప్రకటించాయని, దీంతో ఆర్థిక కార్యకలాపాలు, సెంటిమెంట్ బలహీనపడిందని తెలిపింది.

టెల్కోల గురించి...
ఏజీఆర్ బకాయిల చెల్లింపుల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన పదేళ్ల గడువు వొడాఫోన్ ఐడియా(VI)కి సరిపోకపోవచ్చునని, జియో, ఎయిర్‌టెల్‌లకు మాత్రం తమ మార్కెట్ వాటాను బలోపేతం చేసుకోవచ్చునని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. రానున్న 12 నెలల్లో కనీసం 20 శాతం మేర టారిఫ్ పెంచే అవకాశం ఉండవచ్చునని వెల్లడించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications