For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనీస్ యాప్స్ ఔట్, స్నాప్‌డీల్‌కు గుడ్‌న్యూస్? ఇండియన్ ఈ-కామర్స్ కంపెనీలకు ట్రాఫిక్ జూమ్

|

గాల్వాన్ లోయ వ్యవహారం తర్వాత ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం భారత ఈ కామర్స్ కంపెనీలకు కలిసొచ్చేలా కనిపిస్తోంది. ముఖ్యంగా గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న స్నాప్ డీల్ వంటి ఈ కామర్స్ కంపెనీకి ఇది బాగా ఉపయోగపడనున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్నాప్ డీల్ సహా మరిన్ని ద్వితీయ శ్రేణి ఈ కామర్స్ కంపెనీలకు పెరుగుతున్న ఆన్లైన్ ట్రాఫిక్ దీనినే రుజువు చేస్తోంది.

భారత ప్రభుత్వం తొలుత 59 చైనా కు చెందిన మొబైల్ ఆప్స్ ను నిషేధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ మరో 200 కు పైగా చైనా ఆప్స్ పై కొరఢా ఝుళిపించింది. దీంతో చాలా వరకు చైనీస్ మొబైల్ ఆప్స్ తో నెలకొన్న పోటీ ఒక్కసారిగా తగ్గిపోయింది. ఆ మేరకు వినియోగదారులు ప్రత్యామ్నాయాల కొరకు అన్వేషిస్తూ... ఇండియన్ ఈ కామర్స్ కంపెనీల వైపు మొగ్గు చూపుతున్నారు.

అడ్డుపడిన వ్యాక్సీన్: రూ.3,000 తగ్గిన బంగారం ధర, భారీగా తగ్గిన వెండి ధర!

స్నాప్ డీల్ కు పెరిగిన ట్రాఫిక్...

స్నాప్ డీల్ కు పెరిగిన ట్రాఫిక్...

జపాన్ కు చెందిన ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంకు గతంలో స్నాప్ డీల్ లో భారీ పెట్టుబడి పెట్టింది. ఒకప్పుడు ఇండియా లో ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ ల మధ్య పోటీ విపరీతంగా ఉండేది. కానీ, అమెజాన్ ఎంట్రీ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. స్నాప్ డీల్ కు బ్రాండ్ అంబాసడర్ గా పనిచేసిన అమీర్ ఖాన్ చేసిన కొన్ని వ్యాఖ్యల నేపథ్యంలో వినియోగదారులు స్నాప్ డీల్ ఆప్ ను డిలీట్ చేయటం ప్రారంభించారు.

దీంతో కంపెనీ ఒక్కసారిగా సంక్షోభంలో కూరుకు పోయింది. ఆ తర్వాత ఇక కోలుకోలేదు. ఐతే, నిధుల సమీకరణ కష్టతరం ఐన కారణంగా స్నాప్ డీల్ అధిక విలువైన వస్తువుల విక్రయం నుంచి తప్పుకుని, కేవలం రూ 1,000 లోపు లభించే చౌక ఉత్పత్తులను విక్రయించే దిశగా మారిపోయింది. ఇందులో కొంత వరకు నిలదొక్కుకోగలిగింది. కానీ, ప్రస్తుతం చైనా ఆప్స్ నిషేధం తర్వాత మాత్రం స్నాప్ డీల్ కు వేగంగా ఆర్డర్లు పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.

అవి అవుట్...

అవి అవుట్...

చైనా కు చెందిన క్లబ్ ఫ్యాక్టరీ, షెయిన్, రోంవె వంటి చైనా కు చెందిన ఈ కామర్స్ పోర్టల్స్ కార్యకలాపాలు నిలిపివేశాయి. క్లబ్ ఫ్యాక్టరీ సగటున రోజుకు సుమారు 30,000 ఆర్డర్ల ను ప్రాసెస్ చేసేది. అదే సమయంలో షెయిన్, రోంవె లు సంయుక్తంగా రోజుకు మరో 15,000 ఆర్డర్ల నుంచి 20,000 ఆర్డర్ల వరకు ప్రాసెస్ చేసేవి.

అయితే ప్రస్తుతం ఇవి కార్యకలాపాలు నిలిపివేయడంతో ఆ మేరకు వినియోగదారులు ప్రత్యామ్నాయ పోర్టల్స్ వైపు మళ్లుతున్నారు. ఈ చైనీస్ కంపెనీలు ఇప్పటి వరకు భారత్ లో నిలదొక్కుకునేందుకు సుమారు 200 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టాయి. అంటే సుమారు రూ 1,500 కోట్లు ఇండియన్ మార్కెట్ పై వెచ్చించాయి. చవకైన వస్తువుల విక్రయం కోసం వినియోగదారులను ఆకర్షించేందుకు, డెలివరీ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకోవటం కోసం ఈ మేరకు ఖర్చు చేశాయి. కానీ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా వాటిపై పిడుగు పడినట్లయింది.

అవి కూడా లాభపడుతున్నాయి...

అవి కూడా లాభపడుతున్నాయి...

చైనీస్ ఆప్స్ కార్యకలాపాలు నిలిపివేయడంతో ఇండియా లో స్నాప్ డీల్ తో పాటు మరిన్ని ఈ కామర్స్ సంస్థలు కూడా లాభపడుతున్నాయి. అందులో ముఖ్యంగా సోషల్ కామర్స్ విభాగంలో పనిచేస్తున్న మీషో సహా గ్లో రోడ్ వంటి సంస్థలు కూడా మెరుగైన ఆన్లైన్ ట్రాఫిక్ ను ఆకట్టుకోగలుగుతున్నాయి. ఇక మీదట ద్వితీయ శ్రేణి ఈ కామర్స్ కంపెనీలకు మెరుగైన సంఖ్యలో వినియోగదారులు లభించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం స్నాప్ డీల్ సగటున రోజుకు సుమారు 1,50,000 ఆర్డర్లు ప్రాసెస్ చేస్తుండగా... చైనీస్ ఆప్స్ నుంచి కనీసం 40-50% ట్రాఫిక్ ను ఆకట్టుకోగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో మిగిలిన ట్రాఫిక్ ను ఇతర సంస్థలు ఆకర్షించగలవని అంచనా వేస్తున్నారు. సో, ఏది ఏమైనా మన దేశ పౌరులు మన కంపెనీల వద్ద వస్తువులు కొనుగోలు చేస్తే అది మన దేశానికి సేవ చేస్తున్నట్లే అవుతుంది. మీరేమంటారు?

English summary

Advantage Snapdeal as Chinese e tailers pack their bags

With Chinese e-commerce platforms such as Shein, Club Factory and Romwe out of the picture due to the recent ban on 59 Chinese apps, homegrown e-commerce companies such as Snapdeal targeting the value-conscious customer could be in the gain.
Story first published: Wednesday, August 12, 2020, 20:27 [IST]
Company Search