For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలయన్స్‌తో డీల్, ఫ్యూచర్ రిటైల్‌కు ఢిల్లీ హైకోర్టు ఊరట, అమెజాన్‌కు షాక్

|

న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్‌తో ఫ్యూచర్ గ్రూప్ కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల ఒప్పందంపై యథాతథస్థితి కొనసాగించాలని ఫ్యూచర్ గ్రూప్, ఇతర చట్టబద్ద సంస్థలకు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. చట్టాలకు అనుగుణంగా ఈ ఒప్పంద ప్రక్రియ ముందుకు వెళ్లేందుకు నేషనల్ కంపెనీస్ లా ట్రైబ్యునల్ (NCLT), కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI), సెబీ లాంటి చట్టబద్ద సంస్థలు నిర్ణయాలు తీసుకోకుండా ఆపలేమని కోర్టు స్పష్టం చేసింది.

ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి నేతృత్వంలోని బెంచ్ అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు అనుకూలంగా ఫిబ్రవరి 2వ తేదీన ఇచ్చిన యథాతథ స్థితి ఉత్తర్వులకు అదే కోర్టు డివిజినల్ బెంచ్ నిన్న (సోమవారం) స్టే ఇచ్చింది. అదే సమయంలో ఈ తీర్పును వారం రోజులు పాటు వాయిదా వేయాలని అమెజాన్ చేసిన విజ్ఞప్తిని కూడా తిరస్కరించింది.

వాట్సాప్‌కు పోటీ? కేంద్ర ప్రభుత్వం కొత్త మెసేజ్ యాప్వాట్సాప్‌కు పోటీ? కేంద్ర ప్రభుత్వం కొత్త మెసేజ్ యాప్

26వ తేదీ లోపు తెలపాలి

26వ తేదీ లోపు తెలపాలి

చీఫ్ జస్టిస్ డీఎన్ పాటిల్, జస్టిస్ జ్యోతిసింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ రూలింగ్ ఇస్తూ ఈ కేసులో పలు అంశాలకు సంబంధించి ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ అప్పీల్ వాదనలను పరిగణనలోకి తీసుకున్నది. ఆయా అంశాలపై ఫిబ్రవరి 26వ తేదీలోపు వైఖరి తెలియజేయాలని అమెజాన్‌కు నోటీసులు జారీ చేసింది. అనంతరం దీనికి సంబంధించి రోజూవారీ విచారణను చేపడతామని తెలిపింది. అయితే ఈ విషయంలో ఉత్తర్వుల అమలుకు వారం గడువు ఇవ్వాలని, తద్వారా తదుపరి తీసుకోవాల్సిన న్యాయపర అంశాలను అన్వేషిస్తామని అమెజాన్ కోరగా, బెంచ్‌ తిరస్కరించింది.

అమెజాన్ వాదన

అమెజాన్ వాదన

ఫ్యూచర్ గ్రూప్‌లో కీలకమైన ఫ్యూచర్ రిటైల్‌లో ఫ్యూచర్ కూపన్స్ ప్రయివేటు లిమిటెడ్‌కు 7.3 శాతం వాటా ఉంది. అమెజాన్ 2019 ఆగస్ట్ నెలలో ఫ్యూచర్ కూపన్స్‌లో 49 శాతం వాటాను కొనుగోలు చేసింది. దీంతో అమెజాన్‌కు ఫ్యూచర్ రిటైల్‌లో సాంకేతికంగా వాటాలు దక్కాయి. ఫ్యూచర్ కూపన్స్‌తో డీల్ కుదుర్చుకున్న సమయంలోనే మూడేళ్ల నుండి పదేళ్ల వ్యవధిలో ఫ్యూచర్ రిటైల్ కొనుగోలుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్ వాదన.త ఈ నేపథ్యంలో ఫ్యూచర్ రిటైల్-రిలయన్స్ డీల్ కుదిరింది. అయితే ఈ డీల్ సరికాదని అమెజాన్ పేర్కొంటోంది.

తీర్పు అమలు చేయాలని...

తీర్పు అమలు చేయాలని...

రిలయన్స్-ఫ్యూచర్ డీల్ పైన సింగపూర్ ఇంటర్నేషనల్ అర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని అమెజాన్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు, ఫ్యూచర్-రిలయన్స్ డీల్‌కు సెబి, స్టాక్ ఎక్స్చేంజీలు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చాయి. వీటి ప్రకారం ఈ ఒప్పందానికి ఫ్యూచర్ గ్రూప్ ఇటు షేర్ హోల్డర్లతో పాటు అటు NCLT అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కోర్టులో కొనసాగుతున్న వివాదాలపై తుది తీర్పుకు లోబడి తమ అనుమతులు వర్తిస్తాయని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ చెబుతున్నాయి.

English summary

రిలయన్స్‌తో డీల్, ఫ్యూచర్ రిటైల్‌కు ఢిల్లీ హైకోర్టు ఊరట, అమెజాన్‌కు షాక్ | Advantage Future Group as HC lifts stay on RIL deal

The Delhi high court on Monday quashed an order that halted Future Group’s ₹24,713 crore deal to sell its assets to Reliance Industries Ltd, dealing a blow to Amazon.com Inc.’s efforts to block the sale.
Story first published: Tuesday, February 9, 2021, 10:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X