For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత వృద్ధి రేటును 5.1 శాతానికి తగ్గించిన ADB, మోడీ చర్యలతో...

|

ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ADB) వృద్ధి రేటును తగ్గించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును 5.1 శాతానికి పరిమితం చేసింది. అంతకుముందు వృద్ధి రేటును 6.5 శాతంగా అంచనా వేసింది. ఇప్పుడు దానిని 5.1 శాతానికి తగ్గించింది. దక్షిణాసియా దేశాల్లోనే అతి తక్కువ వృద్ధి రేటు అవుతుందని అంచనా వేసింది.

నోట్ల రద్దు వల్ల లాభాలిదిగో.. రూ.3,04,605 కోట్లు నగదును...నోట్ల రద్దు వల్ల లాభాలిదిగో.. రూ.3,04,605 కోట్లు నగదును...

ఆర్థిక మందగమనం, ఉద్యోగ కల్పనలో మందగమనం, తగ్గిన పంటల దిగుబడి, రుణలభ్యతలోని క్షీణత కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న నిరాశావహస్థితి సహా పలు కారణాలు ఉన్నాయని పేర్కొంది. అయితే ఇటీవల నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన విధానాల కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మాత్రం వృద్ధి రేటు 6.5 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది.

 ADB scales down Indias GDP growth forecast from 6.5% to 5.1% for FY20

2020-21 వృద్ధి రేటును అంతకుముందు ఏడీబీ 7.2 శాతంగా అంచా వేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దానిని తగ్గించింది. అదే సమయంలో మోడీ ప్రభుత్వం చర్యలతో కాస్త పుంజుకుంటుందని, 6.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ప్రయివేటు వినియోగం 4.1 శాతానికి, పెట్టుబడులు 2.5 శాతానికి క్షీణించడంతో భారత వృద్ధి 4.8 శాతానికి దిగజారిన విషయాన్ని ఏడీబీ గుర్తు చేసింది.

అదే సమయంలో చైనా వృద్ధి రేటును 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను అంతకుముందు 6.2 శాతంగా అంచనా వేసింది. ఇప్పుడు దానిని 6.1 శాతానికి పరిమితం చేసింది. వాణిజ్య ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మందగమనం నేపథ్యంలో వృద్ధి రేటు అంచనాలను తగ్గించింది.

English summary

భారత వృద్ధి రేటును 5.1 శాతానికి తగ్గించిన ADB, మోడీ చర్యలతో... | ADB scales down India's GDP growth forecast from 6.5% to 5.1% for FY20

The ADB said growth would pick up to 6.5 per cent in 2020-21 with "supportive" policies, but also said it would be lower than its earlier forecast of 7.2 per cent for the fiscal year.
Story first published: Thursday, December 12, 2019, 8:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X