For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అదాని చేతికి మరో భారీ ప్రాజెక్ట్: కర్నూలు, గుంటూరు ఆ కంపెనీకి

|

ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని చేతికి మరో భారీ ప్రాజెక్ట్ అందింది. ప్రభుత్వ రంగంలో ఉన్న చమురు కంపెనీల కంటే ఎక్కువగా ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకోగలిగింది. ఆటోమొబైల్ సెగ్మెంట్ కోసం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో రిటైల్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అవుట్‌లెట్లను నెలకొల్పడం, ఆయా నగరాల్లో పైప్‌లైన్ల ద్వారా వంటగ్యాస్‌ను సరఫరా చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ ఇది. ఇందులో 14 నగరాల్లో సీఎన్జీ అవుట్‌లెట్లు, పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్‌ను సరఫరా చేయడానికి లైసెన్స్‌ను పొందింది గౌతమ్ అదాని గ్రూప్ కంపెనీ.

Manyavar: పబ్లిక్ ఇష్యూకు మరో ఫ్యాషన్ బిగ్‌షాట్: బ్లాక్‌బస్టర్ ఎంట్రీ అవుతుందా?Manyavar: పబ్లిక్ ఇష్యూకు మరో ఫ్యాషన్ బిగ్‌షాట్: బ్లాక్‌బస్టర్ ఎంట్రీ అవుతుందా?

అదాని టోటల్‌కు..

అదాని టోటల్‌కు..

ఆ కంపెనీ పేరు అదాని టోటల్. అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఇదీ ఒకటి. ఇది జాయింట్ వెంచర్‌గా ఏర్పడింది. అదాని- ఫ్రాన్స్‌కు చెందిన టాప్ ఎనర్జీ కంపెనీ టోటల్.. సంయుక్తంగా దీన్ని నెలకొల్పాయి. అదాని టోటల్ గ్యాస్ లిమిటెడ్‌గా ఆవిర్భవించాయి. దేశవ్యాప్తంగా 65 నగరాల్లో సీఎన్జీ అవుట్‌లెట్లు, పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్‌ను సరఫరా చేయడానికి పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ నిర్వహించిన బిడ్డింగ్స్‌లల్లో ఈ కంపెనీ పాల్గొంది.

తొమ్మిది నగరాలు విత్ హెల్డ్‌లో

తొమ్మిది నగరాలు విత్ హెల్డ్‌లో

ఇందులో 56 నగరాల కేటాయింపులను ప్రకటించింది రెగ్యులేటరీ బోర్డు. మిగిలిన తొమ్మిది నగరాలు.. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌కు చెందినవి కావడంతో వాటిని విత్ హెల్డ్‌లో ఉంచింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండటం వల్ల ఆ నగరాలను ఇంకా ఎవరికీ కేటాయించలేదు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ తొలగిపోయిన తరువాత ఆయా నగరాల పేర్లను వెల్లడిస్తామని రెగ్యులేటరీ బోర్డు వెల్లడించింది.

 14 సిటీలు అదాని చేతికి..

14 సిటీలు అదాని చేతికి..

కాగా- ఈ 52 నగరాల్లో అత్యధికంగా 14 నగరాల (జాగ్రఫికల్ ఏరియాస్)కు సంబంధించిన లైసెన్స్‌ను సాధించగలిగింది. హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) 13 నగరాలకు చెందిన లైసెన్స్‌ పొందింది. ప్రభుత్వరంగంలో కొనసాగుతున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌.. ఎనిమిది నగరాలను దక్కించుకుంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌కు నాలుగు జాగ్రఫికల్ ఏరియాస్ లభించాయి. హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్, థింక్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక్కొక్క నగరాన్ని పొంద గలిగాయి.

కర్నూలు, గుంటూరులకు..

కర్నూలు, గుంటూరులకు..

అస్సాం, ఛత్తీస్‌గఢ్‌లల్లో నాలుగు నగరాలు మహారాష్ట్రలోని అమరావతి, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లల్లో రెండేసి సిటీల చొప్పున నగరాలు అదాని చేతికి చేరాయి. ఏపీలోని కర్నూలు, గుంటూరు, హైపొటెన్షియల్ జాగ్రఫికల్ ఏరియా జమ్మూ, తమిళనాడులోని మధురై, మహారాష్ట్రలోని బీడ్, జల్గావ్, రాజస్థాన్‌లోని కికర్, తమిళనాడులోని ధర్మపురి, మధురై, కన్యాకుమారి, పశ్చిమ బెంగాల్‌లోని మేదినిపూర్‌ నగరాలకు ఐఓసీ గ్యాస్ సరఫరా చేస్తుంది.

English summary

అదాని చేతికి మరో భారీ ప్రాజెక్ట్: కర్నూలు, గుంటూరు ఆ కంపెనీకి | Adani Total Joint venture has won licences to retail gas in 14 Indian cities

Adani Total Gas Ltd won city gas rights in 14 out of the 52 geographical areas (GAs) for which Petroleum and Natural Gas Regulatory Board (PNGRB) declared results.
Story first published: Saturday, January 29, 2022, 14:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X