For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Adani shares: విలువైన కంపెనీల జాబితా నుంచి 3 అదానీ స్టాక్ ఔట్.. గ్రూప్ విలువ ఫసక్..

|

Adani shares: అంచెలంచెలుగా ఎదిగిన అదానీ గ్రూప్ ఒక్క నివేదికతో అగాధంలోకి జారుకుంటోంది. అదానీ సామ్రాజ్యం ఎదగటానికి ఏళ్ల సమయం పట్టినప్పటికీ.. కుప్పకూలటానికి మాత్రం రోజుల సమయం మాత్రమే పట్టిందని చెప్పుకోవాలి. తాజాగా పతనం విషయంలో అదానీ గ్రూప్ కంపెనీలు మరో చెత్త రికార్డును సృష్టించాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.

 మార్కెట్ విలువ ఫసక్..

మార్కెట్ విలువ ఫసక్..

తాజాగా అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్ షేర్లు అత్యంత విలువైన జాబితా నుంచి నిష్క్రమించాయి. దీంతో అదానీ గ్రూప్ మెుత్తం మార్కెట్ క్యాప్ HDFC బ్యాంక్ మార్కెట్ విలువ కంటే తక్కువకు పడిపోయింది. దాదాపు 10 కంపెనీలు కలిగి ఉన్న గౌతమ్ అదానీ మార్కెట్ విలువ ఏకంగా ఒక్క బ్యాంక్ కంటే తక్కువ స్థాయికి చేరుకుంది.

 మార్కెట్ ర్యాంక్స్..

మార్కెట్ ర్యాంక్స్..

96,657 కోట్ల మార్కెట్ క్యాప్‌తో అదానీ టోటల్ గ్యాస్ 49వ స్థానంలో నిలిచింది. అదానీ ట్రాన్స్‌మిషన్ రూ.92,613.78 కోట్ల విలువతో 53వ స్థానానికి, అదానీ గ్రీన్ రూ.89,917.60 కోట్ల విలువతో 54వ స్థానంలో నిలిచింది. రూ.1,78,798 కోట్ల మార్కెట్ విలువతో అదానీ ఎంటర్‌ప్రైజెస్ BSEలో 27వ అత్యంత విలువైన స్టాక్‌గా నిలిచింది. అదానీ పోర్ట్స్ & సెజ్ రూ.1,26,001 కోట్లతో 37వ స్థానంలో ఉంది. దీంతో మెుత్తంగా అదానీ కంపెనీల పతనం వల్ల దాదాపు 62 శాతం మార్కెట్ విలువను కోల్పోయాయి.

SEBI దర్యాప్తు..

SEBI దర్యాప్తు..

అదానీ కంపెనీల విషయంలో పారదర్శకంగా దర్యాప్తు జరిపి అసలు ఏం జరుగుతుందనే వాస్తవాలను దేశ ప్రజల ముందు ఉంచాలని రాజకీయ ఒత్తిళ్లు బీజేపీ ప్రభుత్వంపై పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్పీడు పెంచిన మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ తాజాగా అదానీ కంపెనీల రుణాలు, సెక్యూరిటీల రేటింగ్‌ వివరాలు అందించాలని కోరింది. అన్ని అత్యుత్తమ రేటింగ్‌లు, ఔట్‌లుక్ అండ్ బిజినెస్ గ్రూప్‌లోని అధికారులతో జరిపే చర్యల అప్‌డేట్‌ల సమాచారాన్ని పంచుకోవాలని స్పష్టం చేసింది.

English summary

Adani shares: విలువైన కంపెనీల జాబితా నుంచి 3 అదానీ స్టాక్ ఔట్.. గ్రూప్ విలువ ఫసక్.. | Adani stocks Exit Most valued list amid Market Cap falls than HDFC, SEBI asks rating details

Adani stocks Exit Most valued list amid Market Cap falls than HDFC, SEBI asks rating details
Story first published: Wednesday, February 22, 2023, 11:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X