For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ ఎయిర్ పోర్ట్ లలో బ్రాండింగ్ నిబంధనలను తుంగలో తొక్కిన అదానీ గ్రూప్స్ .. ఏఏఐ కమిటీల నివేదిక !!

|

విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క మూడు కమిటీలు అదానీ గ్రూప్స్ అహ్మదాబాద్, మంగళూరు మరియు లక్నో విమానాశ్రయాలలో నిర్వహణలో రాయితీ ఒప్పందాలలో సూచించిన బ్రాండింగ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించింది. దీంతో ఈ మూడు విమానాశ్రయాలను నిర్వహిస్తున్న అదానీ గ్రూప్ కంపెనీలు వారు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కుదుర్చుకున్న రాయితీ ఒప్పందాలకు అనుగుణంగా వాటిని తీసుకురావడానికి బ్రాండింగ్‌లు , డిస్ ప్లేలలో మార్పులు చేయడం ప్రారంభించారు.

గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్స్ ఎయిర్ పోర్ట్ నిర్వహణ రంగంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అదానీ గ్రూప్ దేశ వ్యాప్తంగా సుమారు ఎనిమిది ఇంటర్నేషనల్, రీజినల్ ఎయిర్ పోర్టులను నిర్వహిస్తోంది. అయితే విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా అహ్మదాబాద్ మంగళూరు లక్నో విమానాశ్రయాలలో బ్రాండింగ్ నిబంధనలను అదానీ గ్రూప్స్ కాల రాస్తుందని గుర్తించింది. ఈ మూడు విమానాశ్రయాల నిర్వహణ కోసం 2019 ఫిబ్రవరిలో అదానీ గ్రూప్ బిడ్లను గెలుచుకుంది. 2020 ఫిబ్రవరిలో ఏఏఐ తో ఒప్పందాన్ని చేసుకుంది.

Adani groups violate branding rules in airports .. AAI committees report !!

విమానాశ్రయాల అథారిటీ ఆఫ్ ఇండియా లోగోలను డిస్ ప్లే చేయడంలో నిబంధనల ప్రకారం వ్యవహరించలేదు. ఇక ఈ విషయాన్ని మూడు కమిటీలను ఏర్పాటు చేసి గుర్తించిన విమానాశ్రయ అధారిటీ ఆఫ్ ఇండియా దీనిపై అన్ని గ్రూపులు ప్రశ్నించింది. దీంతో ప్రస్తుతం అదాని గ్రూప్ విమానాశ్రయ అధారిటీ ఆఫ్ ఇండియా సూచనల మేరకు వారి నిబంధనల మేరకు 3 విమానాశ్రయాలలోనూ డిస్ ప్లే బోర్డులను మారుస్తామని ఓ ప్రకటనలో వెల్లడించారు.

అదానీ గ్రూప్ ప్రతినిధి మాట్లాడుతూ, తాము ఏఏఐతో భాగస్వామి కావడం గర్వంగా ఉందని, ప్రయాణీకులకు అత్యుత్తమ తరగతి విమానాశ్రయ మౌలిక సదుపాయాలను అందించడానికి కలిసి పనిచేయడం కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.

English summary

ఆ ఎయిర్ పోర్ట్ లలో బ్రాండింగ్ నిబంధనలను తుంగలో తొక్కిన అదానీ గ్రూప్స్ .. ఏఏఐ కమిటీల నివేదిక !! | Adani groups violate branding rules in airports .. AAI committees report !!

Three committees of the Airports Authority of India found that Adani Group had violated the branding rules stipulated in concession agreements in the management of Ahmedabad, Mangalore and Lucknow airports.
Story first published: Wednesday, July 21, 2021, 18:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X