For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC: ఎల్ఐసీ షేర్లు కొని బాధపడుతున్నారా.. అయితే మీకు ఇది శుభవార్తే..!

|

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) షేర్లను ఐపీఓలో చాలా మంది కొనుగోలు చేశారు. కానీ కంపెనీ షేర్లు అప్పటి నుంచి నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులకు కాస్త ఉపశమనం కల్పించాలని కంపెనీ భావిస్తోంది. పాలసీ హోల్డర్ల నిధుల నుంచి దాదాపు $22 బిలియన్లను డివిడెండ్ల రూపం చెల్లించడానికి లేదా బోనస్ షేర్లను జారీ చేయడానికి కేటాయించాలని యోచిస్తోందని సమాచారం. ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా సంస్థ మేలో భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అయింది.

35% కంటే ఎక్కువ

35% కంటే ఎక్కువ

అయితే దాని స్టాక్ అప్పటి నుంచి 35% కంటే ఎక్కువ పడిపోయింది. దీంతో పెట్టుబడిదారుల సంపదలో దాదాపు 2.23 ట్రిలియన్ రూపాయలను కోల్పోయారు. LIC ఇప్పుడు తన షేరు ధరను పునరుద్ధరించే చర్యలను పరిశీలిస్తోందని పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. కంపెనీ 1.8 ట్రిలియన్ భారతీయ రూపాయలను ($21.83 బిలియన్లు) తన నాన్-పార్టిసిపేటింగ్ ఫండ్‌లో ఉన్న 11.57 ట్రిలియన్ రూపాయలలో ఆరవ వంతును తన వాటాదారుల నిధికి బదిలీ చేయాలని యోచిస్తోందని ఒక అధికారి తెలిపారు.

రెండు రకాల పాలసీలు

రెండు రకాల పాలసీలు

లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రధానంగా రెండు రకాల పాలసీలను విక్రయిస్తాయి. మొదటిది కస్టమర్‌లతో లాభాలను పంచుకునే 'పార్టిసిపేటింగ్ పాలసీలు'రెండోది 'నాన్-పార్టిసిపేటింగ్,' లేదా 'నాన్-పార్టీ,' పాలసీలు. ఇవి స్థిర రాబడిని ఇస్తాయి. LIC.. సేకరించిన ప్రీమియాన్ని నాన్-పార్టిసిటింగ్ ఫండ్‌లో ఉంచుతుంది. వాటిలో కొంత భాగాన్ని వాటాదారుల ఫండ్‌లోకి బదిలీ చేయడం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడానికి ఒక మార్గం, ఇది భవిష్యత్తులో అధిక డివిడెండ్ చెల్లింపులకు సూచికగా ఉంటుందని చెబుతున్నారు.

డివిడెండ్‌

డివిడెండ్‌

ఈ బదిలీ ముగిసినట్లయితే, ఎల్‌ఐసీ నికర విలువను దాని ప్రస్తుత విలువ 105 బిలియన్ రూపాయల నుంచి 18 రెట్లు పెంచుతుందని, ఎస్‌బీఐ లైఫ్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌తో సహా బీమా సంస్థలలో నికర విలువ చార్ట్‌లో అగ్రస్థానంలో ఉంటుందని అధికారులు తెలిపారు. ఇయితే దీనిపై ఎల్‌ఐసీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించలేదు. భవిష్యత్తులో డివిడెండ్‌ను బదిలీ చేయడానికి లేదా బోనస్ షేర్‌లను జారీ చేయడానికి ఎల్‌ఐసీ ఈ మొత్తాన్ని ఉపయోగిస్తుందని న్యాయ సంస్థ DSK లీగల్ భాగస్వామి హర్విందర్ సింగ్ అన్నారు.

రూ.949

రూ.949

లిస్టింగ్ సమయంలో LIC షేర్ల ధర రూ.949గా ఉండేది.. కానీ ప్రస్తుతం 600 రూపాయల కంటే తక్కువ ట్రేడవుతోంది. Refinitiv డేటా ప్రకారం, స్టాక్‌ను కవర్ చేసే తొమ్మిది బ్రోకరేజ్‌లలో ఏడు 'కొనుగోలు' లేదా 'బలమైన కొనుగోలు' రేటింగ్‌ను ఇచ్చాయి.

English summary

LIC: ఎల్ఐసీ షేర్లు కొని బాధపడుతున్నారా.. అయితే మీకు ఇది శుభవార్తే..! | According to reliable sources, LIC is planning to declare dividend or bonus shares

LIC is now considering steps to revive its share price, said a government officia
Story first published: Saturday, October 29, 2022, 11:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X