For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవికి ముందే ఏసీల ధరలకు రెక్కలు: విక్రయాల్లో రెండంకెల వృద్ధిపై ధీమాలో తయారీ కంపెనీలు

|

వేసవి కాలం ప్రారంభం కావడానికి ముందే ఎయిర్ కండీషనర్ల ధరలను 5 నుండి 8 శాతం పెంచే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి ప్రముఖ ఏసీ తయారీదారులైన సంస్థలు. అంతేకాదు ఈ సంవత్సరం రెండంకెల వృద్ధి సాధిస్తామని కూడా ధీమాతో ఉన్నాయి. వోల్టాస్, డైకిన్, ఎల్‌జి, పానాసోనిక్, హైయర్, బ్లూ స్టార్ మరియు శామ్‌సంగ్ వంటి ప్రముఖ ఏసీ తయారీదారీ సంస్థలు ఈ ఏడాది ఏసీల విక్రయాలపై అధిక రెండంకెల వృద్ధిని సాధిస్తామని భావిస్తున్నారు.

కరోనా మహమ్మారి నేపధ్యంలో కొత్త ఫీచర్లతో ఏసీలు

కరోనా మహమ్మారి నేపధ్యంలో కొత్త ఫీచర్లతో ఏసీలు

ప్రస్తుత కరోనా మహమ్మారి నేపథ్యంలో సమాజంలో పెరిగిన ఆరోగ్యంపై శ్రద్ధ, చాలా మంది ఉద్యోగులు ఇప్పటికే ఇంటి నుండి పని చేయడం , ఈ వేసవి మరింత హాట్ గా ఉంటుందని వాతావరణ శాఖ సూచనలతో ఎయిర్ కండిషనర్ ల వినియోగం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ సీజన్లో, అనేక మంది తయారీదారులు తమ ఏసీల తయారీలో కొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి వచ్చారు. మహమ్మారి మధ్య తమ వినియోగదారులను వైరస్ నుండి రక్షించుకుంటామని , అమ్మకాలు పెంచడానికి వారు ఎలాంటి ఖర్చులేకుండా ఈఎంఐ సౌకర్యం, క్యాష్‌బ్యాక్ మరియు ఈజీ డెలివరీ సౌకర్యం కూడా అందిస్తున్నారు.

ఎయిర్ కండిషనర్లపై ఈ నెలలో 3 నుంచి 5 శాతం ధరలను పెంచనున్న డైకిన్

ఎయిర్ కండిషనర్లపై ఈ నెలలో 3 నుంచి 5 శాతం ధరలను పెంచనున్న డైకిన్

ఎక్కువగా ఏసీల తయారీ కోసం దిగుమతి చేసుకుంటున్న లోహాలు, కంప్రెసర్ ధరలు పెరగడంతో డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఈ నెలలో 3 నుంచి 5 శాతం ధరలను పెంచబోతోంది. ఇది అమ్మకాలపై కొంత ప్రభావం చూపుతుంది, కాని మార్కెట్లో ఉన్న డిమాండ్ మరియు ఈ సంవత్సరం వేసవికాలం మరింత వేడిగా ఉంటుందని ఐఎండీ నివేదిక ద్వారా కొంత ధరల పెరుగుదల ఉన్నప్పటికీ, డిమాండ్ కూడా ఉంటుందని తాము ఆశిస్తున్నామని డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ఎండి & సిఇఒ కన్వాల్ జీత్ జావా పేర్కొన్నారు.

విక్రయాల్లో రెండంకెల వృద్ధి అంచనాలో పానాసోనిక్

విక్రయాల్లో రెండంకెల వృద్ధి అంచనాలో పానాసోనిక్

అన్ని ప్రాంతాలలోనూ బలమైన అమ్మకాలు ఉన్న పానాసోనిక్, కూడా ధరల పెరుగుదలకు వెళుతోంది . ఈ సీజన్లో అధిక రెండంకెల వృద్ధిని ఆశిస్తుంది. తాము మార్కెట్ పోకడలను పరిశీలిస్తున్నామని ఎసిల ధరలను 6-8 శాతం పెంచాలని యోచిస్తున్నామని , దీనికి కారణం ఉత్పత్తి వ్యయం పెరగడం అని పానాసోనిక్ ఇండియా మరియు దక్షిణ ఆసియా అధ్యక్షుడు మరియు సిఈవో మనీష్ శర్మ అన్నారు. గత 3-4 నెలలుగా, మేము ఎయిర్ కండీషనర్లలో 25 శాతం వృద్ధిని సాధిస్తున్నామని చెప్పిన ఆయన ఈ సీజన్లో కూడా ఈ ధోరణి కొనసాగుతుందని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

టాటా వోల్టాస్ , బ్లూ స్టార్ లు సైతం ధరల పెంపు నిర్ణయం

టాటా వోల్టాస్ , బ్లూ స్టార్ లు సైతం ధరల పెంపు నిర్ణయం

ఏసీల తయారీదారులలో ప్రముఖ తయారీదారు అయిన టాటా గ్రూప్ సంస్థ వోల్టాస్ ఇప్పటికే ధరలను పెంచింది. తాము ఇప్పటికే ఏసీ కేటగిరీలో ధరలను పెంచామని, ఇటీవల ముడి పదార్థాల ధరల పెరుగుదల ఎక్కువగా ఉండడంతో తాము కూడా ధరలు పెంచాల్సి వచ్చిందని వోల్టాస్ మేనేజింగ్ డైరెక్టర్ & సిఇఒ ప్రదీప్ బక్షి అన్నారు.ఇప్పటికే జనవరిలో ధరలను 5 నుండి 8 శాతానికి పెంచిన బ్లూ స్టార్, ఏప్రిల్ నుండి మళ్ళీ 3 శాతం ధరలను పెంచుతూ పోతోంది. అయినప్పటికీ, 2019 తో పోల్చితే ఈ సీజన్‌లో సుమారు 30 శాతం వృద్ధిని కంపెనీ ఆశిస్తుందని బ్లూ స్టార్ మేనేజింగ్ డైరెక్టర్ బి తియగరాజన్ తెలిపారు.

ధరలను పెంచాలని భావిస్తున్న హైయర్ , ఎల్జీ కంపెనీలు

ధరలను పెంచాలని భావిస్తున్న హైయర్ , ఎల్జీ కంపెనీలు

రెసిడెన్షియల్ ఎసి విభాగంలో 8 శాతం కార్నర్ చేయడమే లక్ష్యంగా ఉన్న హైయర్, ముడి వస్తువుల ధరలు పెరగడంతో ధరల పెరుగుదల అనివార్యమని పేర్కొంది. కంపెనీలను బట్టి ధరల పెరుగుదల 7-8 శాతం ఉండాలని, ఈ నెలాఖరులోపు తాము కూడా ధరలను పెంచుతామని హైయర్ అప్లయెన్సెస్ ఇండియా అధ్యక్షుడు ఎరిక్ బ్రాగంజా అన్నారు.ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ ఇండియా విపి- గృహోపకరణాలు విజయ్ బాబు మాట్లాడుతూ, ఈ సీజన్‌లో, ఐఎమ్‌డి ప్రారంభ అంచనా ప్రకారం, దేశం వేసవిలో తీవ్రమైన వేసవిని కలిగి ఉండబోతోందని, దీంతో ఏసీ లకు విపరీతమైన డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు.

గత ఏడాదితో పోలిస్తే 15 శాతం పైగా వృద్ధి ఆశిస్తున్న శాంసంగ్

గత ఏడాదితో పోలిస్తే 15 శాతం పైగా వృద్ధి ఆశిస్తున్న శాంసంగ్

వర్క్ ఫ్రం హోం కూడా ఒక ప్రధాన కారకంగా ఉంటుందని అన్నారు. తాజా అంచనాల ప్రకారం 40 నుండి 45 శాతం వృద్ధిని ఆశిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. 51 మోడళ్లతో ఈ ఏడాది ప్రారంభంలో 2021 శ్రేణి ఎయిర్ కండీషనర్లను విడుదల చేసిన శామ్‌సంగ్ ఇప్పటివరకు మార్కెట్లలో బలమైన అమ్మకాలను చూసింది. ఎయిర్ కండిషనర్ పరిశ్రమ 2019 తో పోలిస్తే 15 శాతానికి పైగా వృద్ధిని కనబరుస్తుందని, మార్కెట్ అంచనాలను అధిగమించగలమని తాము విశ్వసిస్తున్నామని శామ్సంగ్ ఇండియా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్, హెచ్‌వి ఎసి డివిజన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ భూతాని అన్నారు.

ఉత్పాదక మెటీరియల్ ధర 10 నుండి 12 శాతం పెరిగిందన్న సియామా

ఉత్పాదక మెటీరియల్ ధర 10 నుండి 12 శాతం పెరిగిందన్న సియామా

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్స్ తయారీదారుల సంఘం (సియామా) ప్రకారం, ఇన్పుట్ మెటీరియల్ పెరుగుదల యొక్క మొత్తం ప్రభావం 10 నుండి 12 శాతం మధ్య ఉంటుంది. అయినప్పటికీ మొత్తం ధరల పెరుగుదల ఇంకా ప్రభావితం కాలేదు. ఇది దశలవారీగా జరుగుతోందని చెప్తున్నారు ఇప్పటికి, తాము బ్రాండ్ అంతటా 5 నుండి 6 శాతం వరకు ధరలను పెంచామని, ఏప్రిల్ నుండి మరో 5 నుండి 6 శాతం ధరల పెరుగుదల జరగాల్సి ఉందని అని సియామా అధ్యక్షుడు కమల్ నంది అన్నారు. ఏదేమైనప్పటికీ ఏసి ల కు ఉన్న డిమాండ్, ఏసీ లను తయారు చేసే ముడిసరుకుల ధరలు పెరగడంతో ఏసీల ధరలను అమాంతం పెంచేస్తున్నారు. ఏసీల విక్రయాలలో రెండంకెల వృద్ధిని సాధిస్తామని ప్రముఖ సంస్థలన్నీ ఆశావహ దృక్పథంతో ఎదురుచూస్తున్నాయి.

Read more about: lg blue star samsung
English summary

వేసవికి ముందే ఏసీల ధరలకు రెక్కలు: విక్రయాల్లో రెండంకెల వృద్ధిపై ధీమాలో తయారీ కంపెనీలు | AC prices increased before summer.. manufacturing companies expecting double-digit growth

Leading AC manufacturers are betting on high double-digit growth this year even as they are firming up plans to increase prices of residential air conditioners by 5 to 8 per cent before the crucial summer season starts.
Story first published: Monday, March 15, 2021, 18:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X