For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీఎం కిసాన్ లబ్ధిదారులకు ఊరట, ఈకేవైసీ గడువు పొడిగింపు

|

అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం ఊరటను కల్పించింది. రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని అందిస్తుంది. 5 ఎకరాల లోపు భూమి కలిగిన వారికి నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడి సాయంగా రూ.6000 అందిస్తోంది. రూ.2000 చొప్పున మూడు పర్యాయాలు, ఏడాదిలో మొత్తం రూ.6000 పంట సాయాన్ని అందిస్తోంది. అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి లబ్దిదారులు ఈ-కేవైసీ అప్ డేట్ చేసుకోవాలని కేంద్రం ఇటీవల తెలిపింది. ఈ గడువును మే 22వ తేదీ నాటికి పొడిగిస్తున్నట్లు తెలిపింది.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేంద్ర ప్రభుత్వ పథకం. 100 శాతం కేంద్రం నిధులు అందిస్తోంది. పీఎం కిసాన్ నిధి కింద వచ్చే డబ్బులు నేరుగా రైతుల అకౌంట్‌లలో పడతాయి. పీఎం కిసాన్ పోర్టల్ ప్రకారం ఈకేవైసీ తప్పనిసరి. అవసరమైన సమాచారం కోసం సమీపంలోని సీఎస్‌సీ కేంద్రాన్ని సందర్శించాలి. బయోమీటర్ అథెంటికేషన్ కోసం సీఎస్‌సీ కేంద్రానికి వెళ్లాలి.

Aadhar Based eKYC Via OTP Authentication Suspended for PM Kisan

అయితే ఓటీపీ ఆధారిత ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ అథెంటికేషన్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు పీఎం కిసాన్ వెబ్ సైట్ పేర్కొంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధిదారులు సమీప కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కి వెళ్లి ఆఫ్‌లైన్‌లో ఈ-కేవైసీని అప్ డేట్ చేసుకోవాలని తెలిపింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11వ ఇన్‌స్టాల్‌మెంట్ లబ్ధిదారులు ఈకేవైసీని పూర్తి చేయాలి.

English summary

పీఎం కిసాన్ లబ్ధిదారులకు ఊరట, ఈకేవైసీ గడువు పొడిగింపు | Aadhar Based eKYC Via OTP Authentication Suspended for PM Kisan

Last week the government had extended the deadline to complete eKYC under the PM Kisan Nidhi to 22 May 2022. But, the e-KYC option is no longer functional/operational on the official website of PM Kisan after the extension.
Story first published: Thursday, April 7, 2022, 8:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X