రానున్న అయిదేళ్లలో భారత్‌ను ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తయారు చేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రూ.45,000 కోట్ల ఫండ్‌ను సిద్ధం చేస్తోంది. ఆపిల్, శాంసంగ్, హువావే, ఒప్పో, వివో వంటి పెద్ద సంస్థలతో పాటు ఫాక్స్‌కాన్, విస్ట్రాన్ వంటి కాంట్రాక్ట్ తయారీదారులతో భారత్‌ను గ్లోబల్ సప్లై చైన్‌గా మార్చేందుకు ఈ నిధిని కేటాయిస్తోంది.

ఈ నిధులు ఎలా ఇస్తారంటే
రూ.45,000 కోట్ల ఫండ్‌లో రూ.41,000 కోట్లు కంపెనీలకు... ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (PLI) ప్రమాణాల ఆధారంగా కేటాయిస్తారు. మిగిలిన రూ.4,000 కోట్ల మొత్తాన్ని ప్రతిపాదిత మూలధన రాయితీ లేదా రీయింబర్సుమెంట్స్ పథకం కింద ఇస్తారు. ప్రతిపాదిత పథకాన్ని మోడిఫైడ్ స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజీ స్కీం (M-SIPS)తో భర్తీ చేస్తారు.

ఉద్యోగాలు, ఎగుమతులు...
ఈ స్కీం ద్వారా 2,00,000 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే రూ.5 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు ఉంటాయని భావిస్తోంది. అయిదేళ్లలో ప్రత్యక్ష పన్నుల ఆధాయం రూ.5,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తోంది.

వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌కు అనుగుణంగా..
ఈ కొత్త విధానం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO)కు మరింత అనుగుణంగా సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ నిధులను స్థానిక మార్కెట్‌కు అనుగుణంగా డివైస్‌లు తయారు చేసేవారు ఈ నిధులను ఉపయోగించకుండా కట్టుదిట్టమైన ప్రమాణాలు ఉండనున్నాయని తెలుస్తోంది.

వీటి మార్కెట్ ఎంతంటే
ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఫాక్స్‌కాన్‌తో పాటు శాంసంగ్, హువావే, వివో, ఒప్పో కలిసి ప్రపంచ మొబైల్ మార్కెట్లో 500 బిలియన్ డాలర్ల వ్యాల్యూను కలిగి ఉన్నాయి. మొబైల్ ఫోన్ మార్కెట్లు ఇది 80 శాతం కంటే ఎక్కువ మార్కెట్‌ను కలిగి ఉన్నాయి.
More From GoodReturns

ఇరాన్ యుధ్ధం.. హార్ముజ్ జలసంధిని దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు.. ఎలా సాధ్యమయిందంటే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications