కరోనా మహమ్మారి కారణంగా ఐటీ కంపెనీలు అన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ఐటీ దిగ్గజాలు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు కరోనా-లాక్ డౌన్ అనంతరం కూడా తమ ఉద్యోగుల్లో ఎక్కువ మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం ద్వారా ఖర్చులు తగ్గించుకోవచ్చునని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీసీఎస్ అనూహ్య నిర్ణయం తీసేసుకుంది.

20 శాతం నుండి 75 శాతానికి పెంపు
కరోనా తర్వాత ఉద్యోగులలో 75% మంది ఇంటి నుండి పని చేసేలా చర్యలు తీసుకుంటోంది. కంపెనీలో 4.5 లక్షల మంది ఉన్నారు. ఇందులో ఇండియాలో ఉద్యోగుల సంఖ్య 3.5 లక్షలమంది. ఇందులో సగటున ప్రతిరోజు 20 శాతం మంది ఇంటి నుండే విధులు నిర్వహిస్తారు. 2025 నాటికి దీనిని 75 శాతానికి పెంచాలని టీసీఎస్ లక్ష్యంగా పెట్టుకుంది.

100 శాతం పని రాబట్టాలంటే
100 శాతం పనితీరు రాబట్టాలంటే కార్యాలయాల్లో 25 శాతం కంటే ఎక్కువ ఉద్యోగులు అవసరమని తాము భావించడం లేదని ఇటీవల టీసీఎస్ సీవోవో సుబ్రమణియమ్ అన్నారు. కొత్త విధానంలో ప్రతి ఉద్యోగి కేవలం 25 శాతమే కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుందని, అన్ని గ్రూప్స్‌కు ఇది వర్తిస్తుందని చెప్పారు. లాక్ డౌన్ అనంతరం టీసీఎస్‌లోని 4.5 లక్షల మంది ఉద్యోగుల్లో 90 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు.

ఖర్చులు చాలా వరకు తగ్గుదల
ప్రస్తుత తరుణంలో టీసీఎస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం సెక్యూర్ బోర్డర్‌లెస్ వర్క్ స్పేస్ (SBWS)ను ఉపయోగించుకుంటోంది. టీసీఎస్ సీఈవో, ఎండీ రాజేష్ గోపినాథన్ ఇటీవల ఉద్యోగులకు ఓ లేఖ రాశారు. SBWS ద్వారా 35,000 మీటింగ్స్, 40,6000 కాల్స్, 340 లక్షల సందేశాలు ఈ డిజిటల్ సహకార ప్లాట్ ఫాం ద్వారా జరిగాయన్నారు. ఆఫీస్‌లో 25 శాతం సమయం మాత్రమే ఉండవచ్చునని, మేం బలంగా ముందుకు వచ్చామని, తమ విధానం గతం కన్నా ఎంతో మెరుగైనదిగా నిరూపితమైందని, ఉద్యోగులు ఇంటి నుండి పని చేయడం ద్వారా ఖర్చులు చాలా వరకు తగ్గుతాయన్నారు.

25 శాతం మంది ఉద్యోగులు తగ్గితే ఎంత ఆదా
అనరాక్ కన్సల్టింగ్ సీనియర్ డైరెక్టర్ అశుతోష్ లిమాయే ప్రకారం ఏదైనా ఆఫీస్‌లో 25 శాతం ఉద్యోగులు తగ్గితే (అంటే ఆ మేరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే) ఖర్చులు 15 శాతం వరకు తగ్గవచ్చునని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే కామన్ ఏరియా లేదా సౌకర్యాల పరంగా మరీ అంత తక్కువ కాకపోవచ్చునని చెబుతున్నారు.

టీసీఎస్ దారిలో ఇతర ఐటీ సంస్థలు
టీసీఎస్ ఈ మార్గాన్ని ఎంచుకుంటే ఇతర ఐటీ దిగ్గజాలు కూడా ఇదే మార్గంలో నడిచే అవకాశాలు పయనిస్తాయని ఐటీ నిపుణులు అంటున్నారు. ఇది ఐటీ సంస్థల ఆపరేటింగ్‌లో భారీ మార్పులకు కారణం కానుందని అంటున్నారు. టీసీఎస్ దారిలో విప్రో, ఇన్ఫోసిస్ పయనించవచ్చునని లేదంటే ఈ పోటీ ప్రపంచంలో హ్యూమన్ క్యాపిటల్ కోల్పోతారని, ఖర్చులు తగ్గించుకునే అవకాశం కోల్పోతారని అంటున్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications