For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐపీవో యత్నాల్లో హైదరాబాద్ ఫార్మా కంపెనీ: చైనీస్ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో తలనొప్పి!

|

హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లాండ్ ఫార్మా కు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ కంపెనీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) కు రావాలని ప్రయత్నిస్తోంది. ఈ మేరకు సెబీ కి దరఖాస్తు కూడా చేసుకుంది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవటం ద్వారా సుమారు రూ 3,000 కోట్ల నిధులు సమీకరించాలన్నది కంపెనీ వ్యూహం. అయితే, దేశంలో అకస్మాత్తుగా జరిగిన కొన్ని పరిణామాలతో గ్లాండ్ ఫార్మా కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. అసలు విషయం ఏమిటంటే ఈ కంపెనీ లో మెజారిటీ వాటా ఒక చైనీస్ కంపెనీ చేతిలో ఉండటమే. గాల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక పరిణామాల తర్వాత భారత్ లో 59 చైనా కు చెందిన మొబైల్ ఆప్స్ ను నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనీస్ పెట్టుబడులు కరిగిన ఒక భారత కంపెనీకి పబ్లిక్ ఇష్యూ కు వెళ్లేందుకు సెబీ అనుమతి ఇస్తుందా లేదా అనేది అతి పెద్ద ప్రశ్నగా మారింది.

ఇదే భారీ పెట్టుబడి ...

ఇదే భారీ పెట్టుబడి ...

ఇప్పటి వరకు ఒక భారత కంపెనీలో చైనా కు చెందిన ఒక కంపెనీ పెట్టిన అతిపెద్ద పెట్టుబడి ఇదే కావటం విశేషం. చైనా కు చెందిన ఫోసున్ ఫార్మా అనే సంస్థ 2017 లో గ్లాండ్ ఫార్మా లో 1.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ 7,700 కోట్లు) పెట్టుబడి పెట్టింది. దీంతో గ్లాండ్ ఫార్మాలో 74% వాటా ఫోసున్ ఫార్మా చేతికి చిక్కింది. వాస్తవానికి గ్లాండ్ ఫార్మా లో 86% వాటాను కొనుగోలు చేయాలని భావించినా .. అది సాధ్యం కాలేదు. ఈ మేరకు ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. షాంఘై ఫోసున్ ఫార్మాస్యూటికల్ గ్రూప్ అనే చైనీస్ కంపెనీ సింగపూర్ లోని తన అనుబంధ సంస్థ ఐన ఫోసున్ సింగపూర్ ద్వారా ఈ పెట్టుబడి పెట్టినట్లు టైమ్స్ పత్రిక వెల్లడించింది.

రూ 3,000 కోట్ల సమీకరణ...

రూ 3,000 కోట్ల సమీకరణ...

ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ ద్వారా గ్లాండ్ ఫార్మా సుమారు రూ 3,000 కోట్ల నిధులు సమీకరించాలని యోచిస్తోంది. ఇందుకోసం మొత్తంగా 3.48 కోట్ల షేర్ల ను విక్రయించనుంది. ఇందులో ఫోసున్ ఫార్మా వాటా నుంచి 1.93 కోట్ల షేర్ల ను కూడా విక్రయించనున్నారు. ఐతే ప్రాథమిక పబ్లిక్ ఇష్యూ ద్వారా మాత్రమే రూ 1,250 కోట్ల నిధులు మాత్రమే సమీకరించనున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగి ఐపీవో విజయవంతమైతే... గ్లాండ్ ఫార్మా లో పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25% కి పెరగనుంది. అయితే, ఇక్కడే అసలు సమస్య ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్ - చైనా ల మధ్య అంత గొప్ప సంబంధాలు లేవు. గాల్వాన్ లోయ సంఘటన లో 20 మంది మన సైనికులు వీర మరణం పొందటంతో భారత్ ... చైనా పై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే.

40ఏళ్ళ ప్రస్థానం..

40ఏళ్ళ ప్రస్థానం..

గ్లాండ్ ఫార్మా ను పీవీఎన్ రాజు 1978 లో స్థాపించారు. తొలుత ఇది ఒక చిన్న కాంట్రాక్టు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గా ప్రారంభమైంది. క్రమంగా ఎదుగుతూ ప్రస్తుతం ఇంజెక్టయిల్స్ విభాగంలో ప్రముఖ కంపెనీ గా ఆవిర్భవించింది. హైదరాబాద్ కేంద్రం గా కార్యకలాపాలు సాగించే గ్లాండ్ ఫార్మా కు అమెరికా, యూరోప్, కెనడా, ఆస్ట్రేలియా వంటి పెద్ద దేశాలకు ఔషధాలను ఎగుమతి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 60 దేశాలకు ఈ కంపెనీ ఉత్పత్తులు ఎగుమతి అవుతుండటం విశేషం. ఇదిలా ఉండగా... ప్రస్తుతం పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను సాధారణ కార్పొరేట్ వర్కింగ్ కాపిటల్ అవసరాలు, ఆర్ అండ్ డీ సహా విస్తరణ కోసం వినియోగంచే అవకాశం ఉందని చెబుతున్నారు.

English summary

ఐపీవో యత్నాల్లో హైదరాబాద్ ఫార్మా కంపెనీ: చైనీస్ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో తలనొప్పి! | 74 percent Chinese owned Hyderabad pharma firm files for IPO

The DRHP filing comes less than a month after the Galwan Valley clash between Indian and Chinese troops left 20 Indian soldiers dead and resulted in the Indian government banning 59 Chinese apps.
Story first published: Sunday, July 12, 2020, 17:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X