For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంబానీ, అదానీ, రాధాకిషన్... ఏడాదిలో వీరి సంపద రూ.4.7 లక్షల కోట్లు పెరిగింది

|

2020 క్యాలెండర్ ఏడాదిలో ఏడుగురు భారతీయ కుబేరుల సంపద 64 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. మన దేశంలో మార్చి 23న సెన్సెక్స్, నిఫ్టీ పతనమైంది. ఆ తర్వాత మార్కెట్లు క్రమంగా కోలుకున్నాయి. మార్చి 23న సెన్సెక్స్ 26వేల స్థాయి నుండి ఇప్పుడు 46 వేల పైకి చేరుకుంది. నిఫ్టీ 7వేల లోపు నుండి ఇప్పుడు 13,000 మార్క్ క్రాస్ చేసింది. ఈ కాలంలో బిలియనీర్ల సంపద కూడా పెరిగింది.

టాటా మోటార్స్ ఖర్చులు తగ్గించుకునే వ్యూహం, ఉద్యోగులకు 3వసారి ఆఫర్టాటా మోటార్స్ ఖర్చులు తగ్గించుకునే వ్యూహం, ఉద్యోగులకు 3వసారి ఆఫర్

వీరి సంపద భారీగా పెరిగింది

వీరి సంపద భారీగా పెరిగింది

ఏడుగురు బిలియనీర్ల సంపద డిసెంబర్ 11, శుక్రవారం నాటికి దాదాపు 200 బిలియన్లు (194.39 బిలియన్లు)గా నమోదయింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ సూచీ ప్రకారం ఈ ఏడాది 50 శాతం వరకు ఆదాయం పెరిగింది. ఒక బిలియన్ అంటే రూ.7,300 కోట్లకు పైన. 7గురి కుబేరుల సంపద 64 బిలియన్ డాలర్లు పెరిగింది అంటే దాదాపు 4.7 లక్షల కోట్లకు పైన. అదానీ గ్రూప్ గౌతమ్ అదానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైరస్ పూనావాలా, హెచ్‌సీఎల్ టెక్ శివనాడార్, విప్రో అజీమ్ ప్రేమ్‌జీల సంపద భారీగా ఎగిసింది. డీమార్ట్ అధినేత రాధాకిషన్ ధమానీ, సన్ ఫార్మా దిలీప్ శాంఘ్వీ ఆస్తులు కూడా పెరిగాయి.

ఎవరి సంపద ఎంత పెరిగిందంటే

ఎవరి సంపద ఎంత పెరిగిందంటే

2020లో గౌతమ్ అదానీ సంపద అందరికంటే ఎక్కువగా పెరిగింది. 2019 చివరి నాటికి 11.3 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయన సంపద ఇప్పుడు 21.1 బిలియన్ డాలర్లు పెరిగి, 32.4 బిలియన్ డాలర్లకు పెరిగింది.

ముఖేష్ అంబానీ సంపద 18.1 బిలియన్ డాలర్లు పెరిగి గత ఏడాది 58.6 బిలియన్ డాలర్ల నుండి 76.7 బిలియన్ డాలర్లకు పెరిగింది.

సైరస్ పూనావాలా ఆస్తులు 6.97 బిలియన్ డాలర్లు పెరిగి 15.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

శివ్ నాడర్, అజీమ్ ప్రేమ్‌జీ సంపద ఇద్దరిదీ కలిసి 12 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇందులో శివ్ నాడర్ సంపద ఈ ఏడాది 6.29 బిలియన్ డాలర్లు పెరిగి 22 బిలియన్ డాలర్లకు, ప్రేమ్‌జీ ఆస్తి 5.26 బిలియన్ డాలర్లు పెరిగి 23.6 బిలియన్ డాలర్లుకు చేరుకుంది.

డీమార్ట్ అధినేత రాధాకిషన్ ధమానీ సంపద 4.71 బిలియన్ డాలర్లు పెరిగి 14. బిలియన్ డాలర్లకు, దిలీప్ సింఘ్వీ ఆస్తి 2.23 బిలియన్ డాలర్లు పెరిగి 9.69 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

ఎవరి సంపద ఎంత శాతం పెరిగింది?

ఎవరి సంపద ఎంత శాతం పెరిగింది?

అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ 525 శాతం జంప్ చేయడంతో గౌతమ్ అదానీ సంపద భారీగా పెరిగింది. అదానీ గ్రీన్ మార్కెట్ క్యాప్ రూ.1.63 లక్షల కోట్లకు చేరుకుంది. డిసెంబర్ 31, 2019 నుండి ఇప్పటి వరకు రూ.26,040 కోట్లు పెరిగింది.

అదానీ గ్యాస్ షేర్లు 120 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్స్ 116 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్ స్టాక్స్ 28 శాతం, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ 27 శాతం, అధానీ పవర్ స్టాక్స్ 27.91 శాతం లాభపడింది.

ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ స్టాక్ గత శుక్రవారం రూ.13.56 లక్షల కోట్లుగా ఉంది. గత ఏడాదిడిసెంబర్ 31న రూ.9.59 లక్షల కోట్లు కాగా, ఈ కాలంలో 33 శాతం పెరిగింది.

English summary

అంబానీ, అదానీ, రాధాకిషన్... ఏడాదిలో వీరి సంపద రూ.4.7 లక్షల కోట్లు పెరిగింది | 7 billionaires who added 64 billion dollars to their wealth in the Covid year

Seven Indian billionaires have seen a whopping $64 billion jump in their fortunes in 2020 so far, as the economy began to look up from a Covid-led recession and stocks hit record highs.
Story first published: Monday, December 14, 2020, 17:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X