2019-20 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికి 62.38 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయి. ఈ మేరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లెక్కలు వెల్లడిస్తున్నాయి. సరాసరిగా నెలకు 5.14 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయి. ఈపీఎఫ్ఓ ప్రకారం నవంబర్ నాటికి నెట్ ఎప్లాయిమెంట్ జనరేషన్ 11.62 లక్షలుగా ఉంది.
ఈపీఎఫ్ఓ జాబితా ప్రకారం 2019 అక్టోబర్‌లో 6.48 లక్షల మంది ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్‌లు యాడ్ అయ్యారు. అంతకుముందు ఏడాది ఇదే నెలలో ఇది 4.03 లక్షలుగా ఉంది. అయితే ఈ డేటా తాత్కాలికమైనది. ఈపీఎఫ్ఓ డేటాను సవరించుకుంటుంది. దాదాపు సంఖ్య తగ్గుతుంది.

27 నెలల్లో 1.39 కోట్ల కొత్త ఉద్యోగాలు
సెప్టెంబర్ 2017 నుంచి నవంబర్ 2019 మధ్య 1.39 కోట్ల మంది కొత్త సబ్‌స్క్రైబర్లు సోషల్ సెక్యూరిటీ స్కీంకు యాడ్ అయ్యారు. అంటే ఈ 27 నెలల్లో సంఘటిత రంగంలో ఈ మేరకు కొత్త ఉద్యోగాలు వచ్చాయి. సెప్టెంబర్ 2017 నుంచి మార్చి 2018 మధ్య 15.53 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. 2019 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 61.12 లక్షల ఉద్యోగాలు కొత్తగా వచ్చాయి. 2020 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికి 62.38 లక్షల ఉద్యోగాలు వచ్చాయి.

ఏ వయస్సు వారు ఎంతమంది?
నవంబర్ 2019లో 22-25 ఏళ్ల మధ్య వయస్సు గల వారికి గరిష్టంగా 3.09 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. 18-21 ఏళ్ల మధ్య వయస్సు వారికి 2.98 లక్షల కొత్త ఉద్యోగాలు, 29-35 ఏళ్ల మధ్య వయస్సు గల వారికి 2.08 లక్షల ఉద్యోగాలు, 35 ఏళ్ల పైవారికి 1.9 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. 26-28 ఏళ్ల మధ్య మొత్తంగా 1.47 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. 18 ఏళ్ళ గ్రూప్ వారికి 8,023 ఉద్యోగాలు వచ్చాయి.

16 లక్షల ఉద్యోగాలు తక్కువ..
2019-20లో అత్యధికంగా నవంబర్ నెలలో 11.6 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయి. మే నెలలో అతి తక్కువగా 4.73 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఆర్థిక మందగమనం కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 16 లక్షల తక్కువ ఉద్యోగాలు ఉన్నట్లు ఇటీవల ఎస్బీఐ ఎకోవ్రాప్ నివేదిక తెలిపింది.

ఏ నెలలో ఎన్ని ఉద్యోగాలు
2017-18 ఆర్థిక సంవత్సరంలో (ఆ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నుంచి) 15,52,940 కొత్త ఉద్యోగాలు, 2018-19 ఆర్థిక సంవత్సరంలో (పూర్తి ఏడాది) 61,12,223 ఉద్యోగాలు వచ్చాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నెలలో 6,44,283, మే నెలలో 4,73,164, జూన్‌లో 7,96,406, జూలైలో 8,77,758, ఆగస్ట్‌లో 7,67,974, సెప్టెంబర్‍లో 8,67,849, అక్టోబర్ నెలలో 6,47,764, నవంబర్ నెలలో 11,62,863 కొత్త ఉద్యోగాలు వచ్చాయి. మొత్తంగా ఈ 27 నెలల్లో 1.69 కోట్ల కొత్త ఉద్యోగాలు వచ్చాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications