For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనా ఆప్స్ పై నిషేధం: తర్వాత ఏమిటి? అది చేయగలమా!

|

అవును. అంతా ఊహించినట్లే చైనా కు కొత్త తరహాలో భారత్ చెక్ పెట్టింది. యుద్ధం అంటే సైనికులతో మాత్రమే చేయటం కాదు ... స్మార్ట్ ఫోన్లతో కూడా చేయవచ్చని నిరూపించింది. చైనా కు చెందిన టిక్ టాక్ సహా 59 మొబైల్ ఆప్స్ ను ఒక్కసారిగా ఇండియా లో నిషేధించే సరికి డ్రాగన్ దేశానికి ఏం చేయాలో పాలు పోలేదు. సైనిక పరంగా ఎంత పటిష్టంగా ఉన్నప్పటికీ డిజిటల్ యుద్ధంలో వార్ వన్ సైడ్ అయి పోయే సరికి కయ్యానికి కాలు దువ్విన చైనానే శాంతి ప్రవచనాలు పలకటం మొదలుపెట్టింది.

ఏదిఏమైనా కత్తి కంటే కలం గొప్పదంటారు. అలాగే ఇప్పుడు గన్ కన్నా మొబైల్ ఆప్ నే తోపు అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాటి రూపం ఏదైనా కోట్ల మంది ఆదరణ పొందాయంటే వాటికి కాసుల పంటే. అలాంటి మొబైల్ యాప్ లు ప్రపంచంలో కోట్లలో ఉన్నాయి. కానీ వాటిలో ప్రజాదరణ పొందేవి కొన్ని మాత్రమే. అందుకే టిక్ టాక్ ఆప్ ఒక్క భారత్ అనే కాకుండా ప్రపంచం మొత్తం ఒక ఊపు ఊపేసింది. కానీ అందులో ఉన్న సీక్రెట్ ఫీచర్ల ద్వారా అసలు ప్రమాదం పొంచి ఉండటంతో తప్పనిసరిగా సమయం చూసుకుని వాటిని భారత్ లో నిషేధించాల్సి వచ్చింది.

మరో అడుగు: చైనాకు హీరో సైకిల్స్ రూ.900 కోట్ల షాకిచ్చి, ఇక్కడి వారికి అండగా..

అమెరికా అలా...

అమెరికా అలా...

డోనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ ఐన తర్వాత అక్కడ పెను మార్పులు సంభవించాయి. అవి కొందరికి నచ్చినా నచ్చకపోయినా ఆయన అనుకున్నది అనుకున్నట్లు అమలు చేస్తున్నారు. మళ్ళీ అమెరికా ను 'గ్రేట్' చేయాలని సంకల్పించారు. ఈ వ్యూహంలో భాగంగా అమెరికా నుంచి వెళ్లిపోయిన తమ కంపెనీలను తిరిగి రప్పించటం, స్థానికులకే అత్యధిక ఉద్యోగాలు కల్పించటం, విదేశీయులకు పౌరసత్వం అత్యంత కఠినతరం చేయటం వంటి అంశాలు అందులో దాగి ఉన్నాయి. వాటన్నింటిని అమలు చేయటం ప్రారంభించారు కూడా. అవన్నీ వివిధ స్థాయిల్లో అమలు జరుగుతున్నాయి.

పైగా అమెరికా కు ఎలాగూ ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీ కంపెనీల దన్ను ఎలాగూ ఉండనే ఉంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఆపిల్ వంటి దిగ్గజాలకు కొదవే లేదు. కాబట్టి, కొంత ఆలస్యం అయినా గానీ అమెరికా తిరిగి తన గ్రేట్ ప్రస్థానాన్ని కొనసాగించనుంది. చైనా పై ఆధారపడటం తగ్గించుకుంటోంది.

అనుకరించటం మేలేనా ...

అనుకరించటం మేలేనా ...

భారతీయులు అన్నిటిని అనుకరించటంపై ఎక్కువ మక్కువ చూపుతారు. ఇప్పటి వరకు మనం టెక్నాలజీ విషయంలో ఇలాగే చేశాం. కానీ చైనా మాత్రం దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరించింది. అక్కడ అన్నిటికీ చైనా సొంత టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి. అమెరికా లో అమెజాన్ ఉంటే.. చైనా లో అలీబాబా ఉంది. అక్కడ పేస్ బుక్ వాట్సాప్ ఉంటె.. చైనా లో వి చాట్ ఉంది.

అందరికీ గూగుల్ ఉంటే.. చైనా కు మాత్రం జేడీ వంటి తిరుగులేని టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి. కాబట్టి, అమెరికా గ్రేట్ అనే పదానికి చాలా కాలంగా చైనా చెక్ పెడుతూ వస్తోంది. చివరికి అమెరికా లో 5 జి సేవలు అందించాలంటే కూడా చైనా కు చెందిన హువావే కంపెనీ పై ఆధారపడవలసి వచ్చింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ట్రంప్... అమెరికా లో అమెరికన్ కంపెనీలే కీలకమైన అన్ని రకాల సేవలు అందించాలని నిర్ణయానికి వచ్చారు. అలాగే అడుగులు వేస్తున్నారు. భారత్ లో కూడా అలాంటి పరిణామం చూడగలమా అన్నదే సందేహం.

కొత్తవి సృష్టించాలి...

కొత్తవి సృష్టించాలి...

ఇండియా లో మేధో సంపత్తికి కొదవలేదు. ఉరకలేసే యువశక్తి కి అంతు లేదు. కానీ, మనకు కాస్త ఓపిక లేదు అనే విషయాన్నీ అంగీకరించి తీరాలి. ఎందుకంటే ఒక కొత్త టెక్నాలజీ, లేదా ఉత్పత్తి సృష్టికి కాస్త సమయం పడుతుంది. అప్పటి దాకా ఓపిక పట్టాలి. కానీ ఇండియన్స్ కు అన్నీ ఇన్స్టంట్ గా జరిగిపోవాలనే తొందర వల్ల మన వద్ద ఇన్నోవేషన్స్ రావటం లేదు. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చైనా లాగా ప్రతి టెక్నాలజీ మనదైన సొంత ప్రత్యామ్నాయం ఉండి తీరాల్సిందే.

ఒకప్పుడు అమెజాన్ కు మన ఫ్లిప్ కార్ట్ ప్రత్యామ్నాయంగా నిలిచింది. కానీ దానిని మరో అమెరికా కంపెనీ వాల్మార్ట్ కొనుగోలు చేయటంతో మళ్ళీ మనకు కొరత ఏర్పడింది. సో, ఇప్పైటికైనా మన దేశపు ప్రత్యామ్నాయ మొబైల్ ఆప్స్ పుట్టుకు రావాలని కోరుకుందాం. మొన్న ప్రధాని ప్రకటించినట్లు ఔత్సాహికులు ముందుకొచ్చి సంచలనాలకు తెరలేపుతారో చూడాలి మరి.

English summary

59 apps ban: We need to develop our own technology

Although the decision to ban 59 mobile apps of China in India is great, but we need to develop our own technology giants to overcome the short-term and long term obligations of the country. Otherwise, India will remain a follower country than an innovating place. We have enough energy to create and innovate companies like Google, Facebook and so on, but only one thing needed is patience and dedication.
Story first published: Thursday, July 9, 2020, 15:24 [IST]
Company Search