For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాప్ 100 లగ్జరీ జాబితాలో భారత్‌కు చెందిన టైటాన్, కళ్యాణ్ జ్యువెల్లర్స్ సహా 5 కంపెనీలు

|

ప్రపంచంలోని టాప్ 100 విలాస ఉత్పత్తుల కంపెనీల జాబితాలో భారత్‌కు చెందిన ఐదు బ్రాండ్స్ చోటు దక్కించుకున్నాయి. ఈ ఏడాదికి గాను డెలాయిట్ గ్లోబల్ విడుదల చేసిన లగ్జరీ బ్రాండ్స్ జాబితాలో టాటా గ్రూప్‌కు చెందిన టైటాన్ 22వ స్థానంలో నిలిచింది. క్రితంసారితో పోలిస్తే మూడు స్థానాలు ఎగబాకింది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఇరవై లగ్జరీ గూడ్స్ కంపెనీల్లో టైటాన్ ఒకటిగా నిలిచింది.

భారత్‌ను చోటు లభించిన మిగతా లగ్జరీ బ్రాండ్స్‌లో కళ్యాణ్ జ్యువెలర్స్ (37వ స్థానం), జోయ్-అలుక్కాస్ (46), పీసీ జువెలర్స్ (57), త్రిభువన్‌దాస్ భీంజీ జవేరీ లిమిటెడ్ (92) ఉన్నాయి. దేశీయ కంపెనీల్లో అన్నీ జెమ్స్ అండ్ జ్యువెల్లరీ రంగానికి చెందినవే. త్రిభువన్‌దాస్‌కు ఈ జాబితాలో చోటు లభించడం ఇదే మొదటిసారి. ఈ జాబితాలోని కంపెనీల మొత్తం ఆదాయం గత ఏడాదిలో 25,200 కోట్ల డాలర్లుగా నమోదయినట్లు వెల్లడించింది.

 5 Indian brands in top 100 global powers of luxury goods list

2019లో ఆర్జించిన 28,100 కోట్ల డాలర్లతో చూస్తే గణనీయంగా తగ్గినట్లు డెలాయిట్ పేర్కొంది. కరోనా సంక్షోభ ప్రభావమే ఇందుకు కారణమని తెలిపింది. LVMH ప్రపంచంలో అత్యంత విలాస బ్రాండ్‌గా నిలిచింది. కెరింగ్ ఎస్ఏ, ది ఎస్టీ లాడర్ కంపెనీస్ ఇంక్, కంపెనీ ఫైనాన్షియర్ రిచ్‌మోంట్ ఎస్ఏ, లోరియల్ లక్సీ టాప్-5 స్థానాల్లో నిలిచాయి.

English summary

టాప్ 100 లగ్జరీ జాబితాలో భారత్‌కు చెందిన టైటాన్, కళ్యాణ్ జ్యువెల్లర్స్ సహా 5 కంపెనీలు | 5 Indian brands in top 100 global powers of luxury goods list

Five Indian brands are in the top 100 global powers of luxury goods list, with the Tata Group's Titan moving up three places to rank 22nd, among the 20 fastest-growing luxury goods companies, according to a Deloitte report.
Story first published: Wednesday, December 15, 2021, 13:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X