For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి నెల అవసరంలేదు: చిన్న ట్యాక్స్‌పేయర్స్‌కు భారీ ఊరట

|

చిన్న ట్యాక్స్ పేయర్స్‌కు జీఎస్టీ కౌన్సిల్ శుభవార్త చెప్పింది. స్మాల్ ట్యాక్స్ పేయర్స్ నెలవారీ ప్రాతిపదికన కాకుండా త్రైమాసిక ప్రాతిపదికన రిటర్న్స్ సమర్పించవచ్చునని తెలిపింది. ఈ మేరకు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది. ఇది చిన్న వ్యాపారులకు చాలా పెద్ద ఊరట. 2021 జనవరి 1వ తేదీ నుంచి చిన్నతరహా పన్ను చెల్లింపుదారులు నెలనెలా రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది.

RBI new rules: డెబిట్, క్రెడిట్ కార్డు కొత్త నిబంధనలు తెలుసా?RBI new rules: డెబిట్, క్రెడిట్ కార్డు కొత్త నిబంధనలు తెలుసా?

అయితే పన్ను చెల్లింపులు చలాన్ ద్వారా నెలనెలా చేసుకోవాలని ఆర్థిక కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే తెలిపారు. వార్షిక టర్నోవర్ రూ.5 కోట్ల కంటే తక్కువగా ఉన్న ట్యాక్స్ పేయర్స్ వచ్చే జనవరి 1 నుంచి జీఎస్టీఆర్ 3బీ, జీఎస్టీఆర్ 1 నెలసరి రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని, త్రైమాసిక రిటర్న్స్ మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు.

42nd GST Council Meet: Quarterly returns for small taxpayers

దీంతో 24 రిటర్న్స్ నుంచి 8 రిటర్న్స్‌కు భారం తగ్గినట్లయింది. అలాగే తొలి రెండు నెలల కోసం ఆటో-జనరేటెడ్ చలాన్ వినియోగం ద్వారా చివరి క్వార్టర్‌లో నికర నగదు పన్ను బకాయిలో 35 శాతాన్ని చెల్లించే అవకాశాన్ని కల్పించారు.

English summary

ప్రతి నెల అవసరంలేదు: చిన్న ట్యాక్స్‌పేయర్స్‌కు భారీ ఊరట | 42nd GST Council Meet: Quarterly returns for small taxpayers

GST Council's decision to make returns for small taxpayers on a quarterly basis rather than monthly basis will be a major relief. Number of returns comes down from 24 monthly returns to 8 returns, from January 1, 2021.
Story first published: Tuesday, October 6, 2020, 10:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X