For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు, 4% పెరిగిన DA, రూ.10,000 వరకు పెంపు

|

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులు, పెన్షనర్లకు 4 శాతం డీఏ పెంపుకు శుక్రవారం (13 మార్చి 2020) కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెంచిన డీఏను ఈ నెల నుండి చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.

70 రోజుల్లోనే ముఖేష్ అంబానీ సంపద రూ.1.11 లక్షల కోట్లు ఢమాల్70 రోజుల్లోనే ముఖేష్ అంబానీ సంపద రూ.1.11 లక్షల కోట్లు ఢమాల్

రూ.720 నుండి రూ.10,000 వరకు పెరుగుతుంది

రూ.720 నుండి రూ.10,000 వరకు పెరుగుతుంది

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా డీఏ (డియర్‌నెస్ అలవెన్స్) పెంపును చేపడుతున్నట్లు తెలిపింది. నాలుగు శాతం డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు వేతనం నెలకు కేడర్‌ను బట్టి రూ.720 నుండి రూ.10,000 వరకు వస్తుంది.

గత ఏడాది 12 నుండి 17 శాతానికి పెంపు

గత ఏడాది 12 నుండి 17 శాతానికి పెంపు

గత ఏడాది అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వర్తింపచేసే డీఏను మూలవేతనంలో 12 శాతం నుండి 17 శాతానికి పెంచింది. ఇది గత ఏడాది జూలై 1 నుండి అమలులోకి వచ్చింది. డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 90 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది.

ప్రతి ఏడాది జనవరి, మార్చి...

ప్రతి ఏడాది జనవరి, మార్చి...

ప్రతి ఏడాది జనవరి 1వ తేదీ నుండి జూలై 1వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA), డియర్‌నెస్ రిలీఫ్ (DR) మంజూరు చేస్తారు. వీటిని సాధారణంగా వరుసగా మార్చి, సెప్టెంబర్ నెలల్లోపు చెల్లిస్తారు.

English summary

ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు, 4% పెరిగిన DA, రూ.10,000 వరకు పెంపు | 4 percent increase in Dearness Allowance for employees and pensioners

Union Cabinet on Friday (March 13, 2020) approved a 4% increase in Dearness Allowance for employees and pensioners of the Central government.
Story first published: Friday, March 13, 2020, 15:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X