For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి 4గురిలో ముగ్గురు కొత్త ఉద్యోగం వైపు, వీటిలో అవకాశాలు జంప్!

|

ఈ సంవత్సరం జాబ్ మార్కెట్ మరింత పోటీగా మారనుందట. దేశంలోని ప్రతి నలుగురు నిపుణుల్లో కొత్త ఉద్యోగాల వేటలో ఉంటారని లింక్డిన్ జాబ్ సీకర్స్ రీసెర్చ్ వెల్లడించింది. వచ్చే పన్నెండు నెలల కాలంలో మెజార్టీ నిపుణులు ప్రస్తుత ఉద్యోగాలను మార్చే అవకాశం ఉందని, దీంతో వారి చూపు కొత్త కొలువులపై పడిందని లింక్డిన్ పేర్కొంది. ఈ సర్వేలో 1,016 మంది పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న వారిలో ప్రతి నలుగురిలో ముగ్గురు ఈ ఏడాది కొత్త ఉద్యోగం కోసం వేట ఉంటుందని తెలిపారు.

కెరియర్ అవకాశాలుగా..

కెరియర్ అవకాశాలుగా..

జాబ్స్ ఆన్ ది రైజ్ 2021 ఇండియా జాబితాలో టాప్ 15 కెరియర్ అవకాశాలుగా ఫ్రీలాన్స్ కంటెంట్ క్రియేటర్స్, సోషల్ మీడియా-డిజిటల్ మార్కెటింగ్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్ హెల్త్ కేర్, హెచ్ఆర్ వంటివి ఉన్నాయి.

ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 64 శాతం మంది తమ భవిష్యత్తుపై ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఐదుగురిలో ఇద్దరు నెట్ వర్కింగ్ ఈవెంట్స్‌కు హాజరవ్వాలని యోచిస్తున్నారు. 37 శాతం మంది ఆన్‌లైన్ లెర్నింగ్‌లో పెట్టుబడులకు ఆసక్తితో ఉన్నారు.

జాబ్ మార్కెట్లో భారీ మార్పులు

జాబ్ మార్కెట్లో భారీ మార్పులు

2021లో జాబ్ మార్కెట్ మరింత పోటీని కలిగిఉంటుందని, దీంతో భారతీయ నిపుణుల్లో వత్తిపరమైన అనిశ్చితి, ఆందోళన ఉందని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఉద్యోగాల భర్తీలో నియామక దశలు ఎక్కువగా ఉన్నాయని దేశంలోని ఉద్యోగార్థుల్లో మూడింట ఒకవంతుకు పైగా ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో జాబ్ మార్కెట్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయని, ఈ ఏడాది అవి కొనసాగుతున్నాయని తెలిపింది.

ఇవి జంప్

ఇవి జంప్

2021 టాప్ 15 కెరీర్ ట్రెండ్స్‌లో ఫ్రీలాన్సర్ క్రియేటర్స్, సోషల్ మీడియా అండ్ డిజిటల్ మార్కెటింగ్ రోల్స్, ఫైనాన్స్ రోల్స్, ఎడ్యుకేషన్ రోల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, హెల్త్ కేర్, హ్యూమన్ రిసోర్సెస్ వంటివి ఉన్నాయి. 2021లో ఫ్రీలాన్సర్ క్రియేటర్స్, మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా అండ్ డిజిటల్ మార్కెటింగ్‌లో మంచి అవకాశాలు ఉంటాయని ఈ సర్వేలో ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. అలాగే సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఆకట్టుకుంటున్నట్లు వెల్లడైంది. గత ఏడాది దెబ్బతిన్న రంగాలు ఈ ఏడాది భారీగా ఎగిసిపడవచ్చుననే అంచనాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్‌, ఈ-కామర్స్, ఫైనాన్స్ రంగాలు ఆకర్షణీయంగా మారుతాయని భావిస్తున్నారు.

English summary

ప్రతి 4గురిలో ముగ్గురు కొత్త ఉద్యోగం వైపు, వీటిలో అవకాశాలు జంప్! | 3 in 4 Indian professionals to actively look for new job in 2021

The job market is set to become more competitive this year as three in four Indian professionals are likely to consider changing jobs or actively look for a new roles in the next 12 months, according to LinkedIn Job Seeker research.
Story first published: Thursday, February 4, 2021, 14:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X