For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా షాక్: నిరుద్యోగ బెనిఫిట్స్ కోసం 3.3 మిలియన్ల అమెరికన్లు దరఖాస్తు

|

కరోనా మహమ్మారి అమెరికా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం 2 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. ఇక్కడ గత వారం 3.3 మిలియన్ల మంది అమెరికన్లు నిరుద్యోగ ప్రయోజనాల కింద దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ అత్యధిక నిరుద్యోగ రికార్డ్ 1982లో ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూలిపోతోంది. ప్రజలు బయటకు వెళ్ళలేని పరిస్థితులు.

ఈ నేపథ్యంలో 1982లోని రికార్డ్ కంటే ఐదు రెట్ల మంది అమెరికన్లు నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కరోనా వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ సహాయం కోసం వీరంతా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మరో యాంగిల్ కూడా ఉంది.

 3.3 million Americans apply for unemployment

రికార్డ్ స్థాయిలో నిరుద్యోగ ప్రయోజనాల కింద దరఖాస్తు చేసుకున్నారంటే కరోనా కారణంగా స్థానిక కంపెనీల్లోని ఉద్యోగాల కోతకు నిదర్శనంగా కనిపిస్తోందని అంటున్నారు. కంపెనీలు ఉద్యోగాల కోత విధించాయి. అది ఈ దరఖాస్తుల ద్వారా వెల్లడవుతోంది.

నిరుద్యోగత దేశానికి ఆందోళన కలిగించే అంశమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మే నెల నాటికి ఈ నిరుద్యోగిత రేటు 13 శాతానికి చేరుకోవచ్చునని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2009లో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఆ సమయంలో నిరుద్యోగ రేటు 10 శాతంగా ఉంది. నాటి కంటే ఇప్పుడు చాలా తీవ్రంగా ఉందని చెబుతున్నారు.

English summary

కరోనా షాక్: నిరుద్యోగ బెనిఫిట్స్ కోసం 3.3 మిలియన్ల అమెరికన్లు దరఖాస్తు | 3.3 million Americans apply for unemployment

Nearly 3.3 million Americans applied for unemployment benefits last week - almost five times the previous record set in 1982 - amid a widespread economic shutdown caused by the coronavirus, according to the Associated Press news agency.
Story first published: Friday, March 27, 2020, 11:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X