కరోనా మహమ్మారి-లాక్ డౌన్ కారణంగా ఏప్రిల్ నెలలో దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) మంగళవారం వెల్లడించింది. 20 ఏళ్ల నుండి 30 ఏళ్ల మధ్య యువకులు 27 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని పేర్కొంది. CMIE వీక్లీ రిపోర్ట్ ప్రకారం మే 10వ తేదీతో ముగిసిన వారంలో నిరుద్యోగిత రేటు 27.1 శాతం నుండి 24 శాతానికి తగ్గింది.

పెరుగుతున్న కార్మిక భాగస్వామ్యం, ఉపాధి కల్పన రేటు
గత కొద్ది వారాలుగా దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేయడంతో కార్మిక భాగస్వామ్యం 36.2 శాతం నుండి 37.6 శాతానికి పెరిగింది. ఉపాధి కల్పన రేటు 36.4 శాతం నుండి 28.6 శాతానికి పెరిగిందని ఈ నివేదిక తెలిపింది. CMIE నివేదిక ప్రకారం 20 ఏళ్ల నుండి 24 ఏళ్ల మధ్య 11 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు. 2019-20లో దేశంలోని ఉద్యోగుల సంఖ్యలో వీరి వాటా 8.5 శాతంగా ఉంది. 2019-20లో మొత్తం 34.2 మిలియన్ల మంది యువత పని చేయగా, ఏప్రిల్ 2020 నాటికి ఈ సంఖ్య 20.9కి తగ్గింది.

కొత్త వర్క్ ఫోర్స్‌తో మళ్లీ పోటీ
ఈ డేటా ప్రకారం 25-29 ఏళ్ల మధ్య యువకులు 14 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. 2019-20లో ఉద్యోగుల సంఖ్యలో వీరి వాటా 11.1 శాతం ఉంది. ఇందులో 11.5 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు. 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉద్యోగాలు కోల్పోయిన వారిపై భారీ ప్రభావం ఉంటుందని, 27 మిలియన్ల మంది కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేసింది. ఎందుకంటే కొత్తగా వచ్చే వర్క్ ఫోర్స్‌తో వారు మళ్లీ పోటీ పడాల్సి ఉంటుందని తెలిపింది.

ఉద్యోగాల కోత..
30 ఏళ్ల వయస్సు కలిగిన వారు 33 మిలియన్ల మంది ఏప్రిల్ నెలలో ఉద్యోగాలు కోల్పోయారు. ఇందులో 86 శాతం ఉద్యోగాలు కోల్పోయింది పురుషులు. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో యువతే ఎక్కువగా ఉంది. మొత్తంగా 40 ఏళ్ల వరకు ఉన్నవారు 44 శాతం మంది గత ఆర్థిక సంవత్సరం నాటికి ఉద్యోగం చేస్తుండగా 52 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు. 40 ఏళ్లకు పైగా ఉన్న వారు 56 శాతం ఉండగా 48 శాతం ఉద్యోగాలు కోల్పోయారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications