దావోస్: ప్రపంచవ్యాప్తంగా కేవలం 22 కుబేరుల వద్దనే.. ఆఫ్రికాలోని అందరు మహిళల సంపద కంటే ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 60 శాతం మంది జనాభా వద్ద ఉన్న సంపాదన కంటే ప్రపంచ బిలియనీర్ల వద్దే ఎక్కువగా ఉంది. ఈ మేరకు సోమవారం ఆక్స్‌ఫాం నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో కేవలం 1 శాతం మంది పదేళ్ల పాటు తమ సంపదపై 0.5 శాతం అధిక పన్ను చెల్లిస్తే వృద్ధులు, బాలల సంక్షేమం, విద్య, వైద్యం వంటి రంగాల్లో 117 మిలియన్ల ఉద్యోగాలు సృష్టించవచ్చు.
ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF) 50వ వార్షికోత్సవ సదస్సు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆక్స్‌ఫాం పలు కీలక అంశాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు విస్తరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. గత దశాబ్దకాలంలో బిలియనీర్ల సంఖ్య రెట్టింపయిందని తెలిపింది. గత ఏడాది కాలంగా వారి మొత్తం సంపదలో తగ్గుదల కనిపించినట్లు పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా 2,153 మంది బిలియనీర్ల వద్ద 4.6 బిలియన్ పేదవారి వద్ద ఉన్న ఆస్తి కంటే ఎక్కువ సంపద ఉంది. ప్రపంచవ్యాప్తంగా 42 శాతం మంది మహిళలు ఉద్యోగాలు పొందలేదు. సంరక్షణ బాధ్యతల కారణంగా వారు ఉద్యోగం చేయడం లేదు. అదే సమయంలో పురుషుల విషయానికి వస్తే ఇది 6 శాతంగా ఉంది.
పేదరికంలో మహిళలు, యువతులు దిగువన ఉన్నారు. వీరు ప్రతి రోజు 12.5 బిలియన్ గంటలు ఎలాంటి వేతనం లేకుండా పని చేస్తున్నారు. ఈ లెక్కన కనీసం ఏడాదికి 10.8 ట్రిలియన్ల డాలర్లు అవుతుంది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications