For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2020-2021 ఆర్ధిక వ్యవస్థ క్షీణత ... కేంద్ర సాయం అందకపోగా రాష్ట్రాలకు పెను భారం

|

కరోనా వైరస్ దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది . ఈ ప్రకృతి చర్యతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి పడిపోయిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. 41 జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో ఆమె దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2020- 2021 లో జీఎస్టీ ఆదాయాల లోటు 2.35 లక్షల కోట్ల మేర ఎదుర్కోవచ్చ ని అంచనా వేస్తున్న కేంద్రం రాష్ట్రాల నెత్తిన పెద్ద పిడుగుపాటు వార్తని వేసింది.

మైక్రోసాఫ్ట్ తో కలిసి వాల్ మార్ట్ కూడా ... యూఎస్ లో టిక్ టాక్ కొనుగోలు కోసం రంగంలోకిమైక్రోసాఫ్ట్ తో కలిసి వాల్ మార్ట్ కూడా ... యూఎస్ లో టిక్ టాక్ కొనుగోలు కోసం రంగంలోకి

రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిల విషయంలో కేంద్రం చెయ్యిచ్చినట్టే

రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిల విషయంలో కేంద్రం చెయ్యిచ్చినట్టే

కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో రాష్ట్రాలు ఆర్థికంగా కుదేలు అయ్యాయి .దీంతో జీఎస్టీ అమలు కారణంగా రాష్ట్రాలు ఎదుర్కొనే ఆర్థిక లోటుకు సంబంధించి తాము పరిహారం చెల్లిస్తామని చెప్పిన నిర్మలాసీతారామన్ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని , పరిహారం విషయంలో రాష్ట్రాలు రుణాల మీద ఆధారపడవచ్చని పేర్కొంది. దీంతో రాష్ట్రాల మీద ఆర్థిక భారం, ఒకవేళ రుణాలు తీసుకుంటే రుణ భారం కూడా పెరిగే ప్రమాదం కనిపిస్తుంది.

రూ.2.35 లక్షల కోట్ల మేర ఆర్ధిక లోటు అంచనా ... ఇది అసాధారణ స్థితి

రూ.2.35 లక్షల కోట్ల మేర ఆర్ధిక లోటు అంచనా ... ఇది అసాధారణ స్థితి

ముందు రాష్ట్ర ఆర్థిక లోటును భర్తీ చేస్తామని, పరిహారం తామే చెల్లిస్తామని చెప్పిన కేంద్రం, తరువాత కరోనా వైరస్ కారణంగా అసాధారణ స్థితి ఎదుర్కొంటున్నామని, ఇది ఆర్థిక వ్యవస్థ సంకోచానికి కూడా కారణం అవుతుందని నిర్మల సీతారామన్ ప్రకటించటం, పరిహారం చెల్లించలేమని చెప్పడం రాష్ట్రాలను తీవ్ర అసహనానికి గురిచేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు రూ.3 లక్షల కోట్ల మేర పరిహారంగా ఇవ్వాల్సి వస్తుందన్నది కేంద్రం అంచనా. అయితే అందులో రూ.65,000 కోట్లను వివిద రకాల సెస్సుల రూపంలో కేంద్రం రాబట్టుకోనుంది. దీంతో రూ.2.35 లక్షల కోట్ల మేర కేంద్రం లోటును ఎదుర్కోనుంది.

రెవెన్యూ నష్టాలను రుణాల ద్వారా రాష్ట్రాలు పూడ్చుకోవాలని కేంద్రం సలహా

రెవెన్యూ నష్టాలను రుణాల ద్వారా రాష్ట్రాలు పూడ్చుకోవాలని కేంద్రం సలహా

రూ.2.35 లక్షల కోట్ల మేర కేంద్రం లోటులో రూ.97,000 కోట్లు రాష్ట్రాలు జీఎస్‌టీకి మళ్లడం కారణంగా చెల్లించాల్సిన మొత్తమని, మిగిలిన మొత్తం కరోనా వైరస్‌ కారణంగా కలిగిన ఆర్థిక లోటు అని చెప్తున్నారు. ఇదే ఇప్పుడు రాష్ట్రాలకు తలనొప్పిగా మారింది. కేంద్రం సహాయం చేస్తుంది అనుకున్న సమయంలో జీఎస్‌టీ బకాయిలు వాయిదా వల్ల ఏర్పడిన రెవెన్యూ నష్టాలను రుణాల ద్వారా రాష్ట్రాలు పూడ్చుకోవాలని కేంద్రం చెప్పడం రాష్ట్రాలకు ఇబ్బందికర పరిణామం.

 కేంద్రం నిర్ణయంతో రాష్ట్రాలపై ఆర్ధిక భారం .. అన్ని రాష్ట్రాల అసంతృప్తి

కేంద్రం నిర్ణయంతో రాష్ట్రాలపై ఆర్ధిక భారం .. అన్ని రాష్ట్రాల అసంతృప్తి

ఆర్బీఐ విండో ద్వారా రుణాలు తీసుకోవడం అంటే కూడా మార్కెట్ బారోయింగ్ కిందే లెక్క అని, ఇది కేవలం పేరు మార్పు మాత్రమేనని , దీనివల్ల పూర్తి ఆర్థిక భారం మళ్లీ రాష్ట్రాలపైనే పడుతుందని అన్ని రాష్ట్రాలు అభిప్రాయపడుతున్నాయి. కేంద్రం ఎలాంటి ఆర్థిక భారానికి బాధ్యత తీసుకోకపోవడం సరికాదని రాష్ట్రాలు భావిస్తున్నాయి. కరోనా సమయంలో ఆదుకోవాల్సిన కేంద్ర ఈ తరహా నిర్ణయం తీసుకోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా కారణంగా ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తిన్నదని చెప్పటంపై ప్రతిపక్ష పరీట్లు సైతం విమర్శలు గుప్పిస్తున్నాయి.

English summary

2020-2021 ఆర్ధిక వ్యవస్థ క్షీణత ... కేంద్ర సాయం అందకపోగా రాష్ట్రాలకు పెను భారం | 2020-2021 Economic decline ... a big burden for the states without central support

After the 41st GST Council meeting nirmala said that The Center estimates that the states will face a deficit of Rs 2.35 lakh in the form of GST revenues in 2020-21.Nirmala Sitharaman said that the states were financially crippled during the corona virus lock-down. This puts the financial burden on the states and the risk of increasing the debt burden if borrowed.
Story first published: Saturday, August 29, 2020, 16:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X