For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్యాక్స్: ఆరేళ్లలో తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్లిన ఆదాయమెంత?

|

బెంగళూరు: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ ఇటీవలి డేటా ప్రకారం మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వస్తున్న డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ 61 శాతంగా ఉంది. గుజరాత్, తమిళనాడు కూడా కలిస్తే ఈ ఐదు రాష్ట్రాల నుంచే 72 శాతం రెవెన్యూ వస్తోంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు ఏడు రాష్ట్రాలను దక్షిణ భారత రాష్ట్రాలుగా చెబుతారు. మహారాష్ట్రను అటు నార్త్‌కు, ఇటు సౌత్‌కు మధ్యగా ఉంటుంది. దీనిని కూడా సౌత్ కిందకు తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ 62శాతం వరకు ఉంది.

ఆదాయపు పన్ను: దక్షిణాది రాష్ట్రాల నుంచే మన దేశానికి 62% ఆదాయం!ఆదాయపు పన్ను: దక్షిణాది రాష్ట్రాల నుంచే మన దేశానికి 62% ఆదాయం!

మహారాష్ట్రను కలుపుకుంటే దక్షిణాది నుంచి అధికం

మహారాష్ట్రను కలుపుకుంటే దక్షిణాది నుంచి అధికం

ఇందులో దేశ ఆర్థిక రాజధాని ముంబై కలిగిన మహారాష్ట్ర నుంచే మూడొంతులు ఉండటం గమనార్హం. గత ఆరేళ్ల కాలంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి దాదాపు రూ.12 లక్షల కోట్ల రెవెన్యూ ఉంటే కేవలం మహారాష్ట్ర నుంచి దాదాపు రూ.20 లక్షల కోట్ల రెవెన్యూ ఉంది. మహారాష్ట్రను కలుపుకుంటే 8 దక్షిణాది రాష్ట్రాల నుంచే యాభై శాతానికి పైగా ఉండటం గమనార్హం.

దక్షిణాది నుంచి ఏ రాష్ట్రం నుంచి ఎంత అంటే..

దక్షిణాది నుంచి ఏ రాష్ట్రం నుంచి ఎంత అంటే..

- తమిళనాడు - రూ.3.39 లక్షల కోట్లు

- కేరళ - రూ.0.80 లక్షల కోట్లు

- కర్ణాటక - రూ.4.99 లక్షల కోట్లు

- తెలంగాణ - రూ.0.23 లక్షల కోట్లు

- ఆంధ్రప్రదేశ్ - రూ.2.20 లక్షల కోట్లు

- చత్తీస్‌గఢ్ - రూ.0.21 లక్షల కోట్లు

- ఒడిశా - రూ.0.59 లక్షల కోట్లు

- మహారాష్ట్ర - రూ.19.17 లక్షల కోట్లు

మొత్తంగా డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ రూపంలో ఎనిమిది దక్షిణాది రాష్ట్రాల నుంచి రూ.31.58 లక్షల కోట్లుగా ఉంది.

మహారాష్ట్ర టాప్

మహారాష్ట్ర టాప్

2013-14 వరకు 2018-19 వరకు ఆరు ఆర్థిక సంవత్సరాలకు ప్రత్యక్ష పన్ను ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలు ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల నుంచి 54 శాతంగా ఉండటం గమనార్హం. అయితే ఇందులోను దేశ ఆర్థిక రాజధాను ముంబై కలిగిన మహారాష్ట్ర నుంచే అధికం. మహారాష్ట్ర నుంచే రూ.19.17 లక్షల కోట్ల డైరెక్ట్ ట్యాక్స్ వచ్చింది. ఈ ఆరేళ్లలో మహారాష్ట్ర వాటా 37.85 శాతం కావడం గమనార్హం.

మూడు రాష్ట్రాల నుంచి 54 శాతం

మూడు రాష్ట్రాల నుంచి 54 శాతం

మహారాష్ట్ర తర్వాత వరుసగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. కేరళ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు 1 లక్ష కోట్ల కంటే దిగువన ఉన్నాయి. ఆరేళ్లలో మహారాష్ట్ర వాటా 37.85 శాతమైతే కర్ణాటక వాటా 9.8 శాతం, తమిళనాడు వాటా 6.7 శాతంగా ఉన్నాయి. ఈ మూడు కలిపి 54.3 శాతంగా ఉన్నాయి.

అయిదేళ్లలో రూ.50.67 లక్షల కోట్ల డైరెక్ట్ రెవెన్యూ ఆదాయం

అయిదేళ్లలో రూ.50.67 లక్షల కోట్ల డైరెక్ట్ రెవెన్యూ ఆదాయం

గత ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన మొత్తం డైరెక్ట్ ట్యాక్స్ ఆదాయం రూ.50.67 లక్షల కోట్లు. ఇందులో మహారాష్ట్ర కలుపుకుంటే దక్షిణాది నుంచి రూ.31.58 లక్షల కోట్లు. అంటే 62 శాతం వాటా ఉంది.

English summary

ట్యాక్స్: ఆరేళ్లలో తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్లిన ఆదాయమెంత? | Direct tax data: Wealth from South Indian states

8 South indian states alone pay 62 percent of total central government direct tax revenue. In total tax revenue to the central governemnt, the direct tax is giving more than 50 percent of tax revenue.
Story first published: Monday, October 28, 2019, 14:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X