For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అవును.. అధిక పన్ను ఉండాలి, ఆదాయపు పన్ను పెంచండి: మోడీకి నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ

|

నోబెల్ గ్రహీత అభిజిత్ ముఖర్జీ ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల అభిజిత్‌కు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి సూచించిన న్యాయ్ స్కీం విఫలమైందని, సామాన్య భారతీయులకు ఆయన సూచనలు అనుగుణంగా లేవని చెప్పారు. ఇతర బీజేపీ నేతలు కూడా ఆయనను విమర్శించారు. అయితే మిలియన్ల కొద్ది భారతీయులు మీ పట్ల అభిమానంతో ఉన్నారని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అభిజిత్ విమర్శలను కేంద్రం గట్టిగా తిప్పికొడుతోంది. అదే సమయంలో ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా, అభిజిత్ బెనర్జీ భారత ఆర్థిక వ్యవస్థ, ట్యాక్స్ కట్, ఉద్యోగాలు తదితర అంశాలపై మాట్లాడారు.

ఆదాయ పన్ను శ్లాబుల తగ్గింపు దిశగా కేంద్రం కసరత్తు?ఆదాయ పన్ను శ్లాబుల తగ్గింపు దిశగా కేంద్రం కసరత్తు?

కార్పోరేట్ ట్యాక్స్ సరికాదు...

కార్పోరేట్ ట్యాక్స్ సరికాదు...

మోడీ ప్రభుత్వం ఇటీవల కార్పోరేట్ ట్యాక్స్‌ను తగ్గించిన విషయం తెలిసిందే. అయితే ఇది సరికాదని అభిజిత్ బెనర్జీ అంటున్నారు. ట్యాక్స్ కట్ వ్యాపారులకు కాదని, పేదలకు అనుకూలంగా పథకాలు ఉండాలని చెబుతున్నారు. అయితే కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో పాటు, ఆయా వస్తువుల ధరలు తగ్గుతాయని, ఇది అన్ని వర్గాలకు ప్రయోజనకరమని కొందరు చెబుతున్నారు.

వ్యాపారులపై అధిక పన్ను ఉండాలి

వ్యాపారులపై అధిక పన్ను ఉండాలి

అంతేకాదు, వ్యాపారులపై అధిక పన్ను విధించాలని అభిజిత్ బెనర్జీ అభిప్రాయ పడుతున్నారు. ఇలా చేయడం వల్ల సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వానికి ఎక్కువ ఫండ్స్ వస్తాయని, ఆర్థిక లోటును తగ్గించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. అదే సమయంలో రైతుల ఆదాయ పథకం వంటి సంక్షేమ చర్యలకు మరింత ఎక్కువ ఖర్చు చేయాలని సూచిస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలోనే రైతుల కోసం పీఎం కిసాన్ స్కీం తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.6,000 ఇస్తోంది.

మోడీ ప్రభుత్వ పథకాలు భేష్...

మోడీ ప్రభుత్వ పథకాలు భేష్...

ప్రజల ఆరోగ్యం కోసం బీమా చాలా ముఖ్యమని అభిజిత్ బెనర్జీ చెప్పారు. అలాగే, నరేంద్ర మోడీ తీసుకు వచ్చిన ఉజ్వల పథకం తక్కువ ఆదాయం కలిగిన మహిళలకు లేదా కుటుంబాలకు ప్రయోజనకరం అన్నారు. అలాగే, పీఎం కిసాన్ స్కీం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం కూడా మంచిదేనని, ఇది పేద రైతులకు ఉపయోగపడుతుందని అభిజిత్ అన్నారు.

కార్పోరేట్ తగ్గింపు కాదు కావాల్సింది...

కార్పోరేట్ తగ్గింపు కాదు కావాల్సింది...

అయితే ఇటీవల కార్పోరేట్ తగ్గింపు సరికాదని అభిజిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇంకా ఏమైనా చేయాలనుకుంటే ద్రవ్య లోటును భర్తీ చేసి, పేదలకు ఇవ్వాలని చెప్పారు. ధనవంతులకు ఇవ్వవలసిన అవసరం లేదని చెప్పారు. కంపెనీలకు ట్యాక్స్ కట్ విషయానికి వస్తే పన్ను కోతలు తక్కువగా ఉండాలని అభిప్రాయపడ్డారు. తద్వారా కంపెనీలకు ట్యాక్స్ కట్ ఊరట సరికాదని అభిప్రాయపడ్డారు. కాగా, కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు వల్ల వివిధ వస్తువుల ధరలు తగ్గుతాయని చెబుతున్నారు.

వారిపై పన్ను పెంచండి, కార్పోరేట్ ట్యాక్స్ అధికం చేయండి..

వారిపై పన్ను పెంచండి, కార్పోరేట్ ట్యాక్స్ అధికం చేయండి..

అభిజిత్ బెనర్జీ ఇంకా మాట్లాడుతూ... జనాభాలో మూడు శాతం మాత్రమే ట్యాక్స్ చెల్లిస్తారని, పేదల చేతుల్లో డబ్బులు ఉండేలా చేయాలనుకుంటే పర్సనల్ ఇన్‌కం ట్యాక్స్ తగ్గింపు ద్వారా చేయలేరని అభిజిత్ బెనర్జీ అన్నారు. మీరు వారికి డబ్బు ఇవ్వాలన్నారు. పీఎం కిసాన్ స్కీం కింద ఇచ్చే మొత్తాన్ని పెంచాలని సూచించారు. అదే సమయంలో ధనికులపై పన్నుని పెంచవచ్చునని చెప్పారు. కార్పోరేట్ పన్నును కూడా ఎక్కువగానే ఉంచవచ్చునని సూచించారు.

యస్.. కార్పోరేట్ పన్ను, ఇన్‌కం ట్యాక్స్ పెంచండి..

యస్.. కార్పోరేట్ పన్ను, ఇన్‌కం ట్యాక్స్ పెంచండి..

కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఎక్కువ కార్పోరేట్ ట్యాక్స్‌లు, ఎక్కువ ఇన్‌కం ట్యాక్స్ ఉండాలని కోరుకుంటున్నారా అని మీడియా ప్రశ్నించగా... అభిజిత్ బెనర్జీ అవునని స్పష్టం చేశారు. అధిక పన్నుల ద్వారా వచ్చిన వనరులను పీఎం కిసాన్ స్కీం, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఉపయోగించవచ్చునని చెబుతున్నారు. అయితే ఇలా అధిక ట్యాక్స్‌లు పెరిగితే కంపెనీలు లేదా సంస్థలపై భారం పడి వారు విక్రయించే వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. అప్పుడు అది ప్రజలందరికీ భారం అవుతుందనేది కొందరి వాదన.

కార్పోరేట్ తగ్గింపు ఆర్థిక వ్యవస్థకు ఎలా మంచిది?

కార్పోరేట్ తగ్గింపు ఆర్థిక వ్యవస్థకు ఎలా మంచిది?

అసలు కార్పోరేట్ పన్ను తగ్గింపు వల్ల ఆర్థిక వ్యవస్థకు ఎలా మంచిది అని అభిజిత్ బెనర్జీ ప్రశ్నించారు. వివిధ దేశాల్లో, ఆయా దేశాల్లోని రాష్ట్రాల్లో పలు రకాల కార్పోరేట్ పన్ను తగ్గింపులు ఉన్నాయని, అవి వేగంగా పెరుగుతున్నాయా అని ప్రశ్నించారు. డెన్మార్క్ దేశంలో ఎక్కువ ట్యాక్స్‌ల వల్ల ఆ దేశం ముందుకు వెళ్తోందని చెప్పారు. చాలా యూరోపియన్ దేశాల్లో పన్నులు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.

అందుకే భారత్‌లో స్లోడౌన్

అందుకే భారత్‌లో స్లోడౌన్

వారసత్వ పన్ను ఉంటే మంచిదని, కానీ అమలు చేయడం కష్టమని అభిజిత్ బెనర్జీ అన్నారు. భారత్‌లో స్లోడౌన్‌కు కారణాలు ఏమిటి అని అడగ్గా... జీఎస్టీ ప్రభావం, వ్యవసాయంలో ఒత్తిడి వంటి కారణాల వల్ల డిమాండ్ తగ్గిందన్నారు. తక్కువ ఆదాయం కలిగిన వారు కొనుగోలును తగ్గించారని చెప్పారు.

English summary

అవును.. అధిక పన్ను ఉండాలి, ఆదాయపు పన్ను పెంచండి: మోడీకి నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ | PM Modi Govt should reverse cuts on corporate taxes: Abhijit Banerjee

Abhijit Banerjee, who is the Ford Foundation International Professor of Economics at the Massachusetts Institute of Technology, endorses the Indian government’s pro-poor schemes, but not tax cuts for businesses.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X