For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలయన్స్ డిజిటల్‌లో వన్ ప్లస్ సూపర్ ఆఫర్, రూ.7,000 క్యాష్ బ్యాక్

|

చైనాకు చెందిన వన్ ప్లస్.. రిటైలర్ రిలయన్స్ డిజిటల్‌తో కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న టీవీ మార్కెట్‌పై వన్ ప్లస్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా స్మార్ట్ టీవీలను తీసుకు వచ్చింది. ఈ మేరకు వన్ ప్లస్ స్మార్ట్ టీవీలను శనివారం (అక్టోబర్ 19) రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో ఆవిష్కరించింది. వన్ ప్లస్ టీవీ 55Q1, వన్ ప్లస్ టీవీ 55Q1 ప్రో అనే రెండు టీవీలను విక్రయిస్తోంది. 100 నగరాల్లోని రిలయన్స్ డిజిటల్, జియో స్టోర్‌లలో ఇది లభిస్తోంది. ప్రపంచంలోని లేటెస్ట్ టెక్నాలజీని భారత వినియోగదారులకు అందించేందుకు తాము బ్రిడ్జిగా ఉంటామని రిలయన్స్ డిజిటల్ తెలిపింది.

ఇల్లు కొనాలా.. బంపరాఫర్: పండుగ బొనాంజా రూ.12,00,000 వరకు ఆదాఇల్లు కొనాలా.. బంపరాఫర్: పండుగ బొనాంజా రూ.12,00,000 వరకు ఆదా

రూ.7,000 వరకు క్యాష్ బ్యాక్

రూ.7,000 వరకు క్యాష్ బ్యాక్

వన్ ప్లస్ టీవీలను కొనుగోలు చేసిన కస్టమర్లకు, HDFC కార్డులపై రూ.7,000 వరకు క్యాష్ బ్యాక్ నో కాస్ట్‌ ఈఎంఐ, ఎక్స్‌టెండెడ్ వారంటీతో పాటు మల్టీ బ్యాంక్ క్యాష్ బ్యాక్ వంటి ప్రత్యేకమైన ఆఫర్స్‌ను రిలయన్స్ డిజిటల్ అందిస్తోంది. రెండు వర్షన్లు దేశవ్యాప్తంగా ఉన్న 100కు పైగా నగరాల్లో రిలయన్స్ డిజిటల్, జియో స్టోర్స్‌లో లభిస్తాయి.

వన్ ప్లస్ టీవీలు...

వన్ ప్లస్ టీవీలు...

వన్ ప్లస్ తన టీవీలను అమెజాన్ ఇండియా ద్వారా గత నెల భారత్‌లోకి తీసుకు వచ్చింది. ఇప్పటి వరకు ఆన్ లైన్ ద్వారా విక్రయించిన ఈ టీవీలను, ఇప్పుడు ఆఫ్ లైన్‌లోను వస్తోంది. రిలయన్స్ డిజిటల్, వన్ ప్లస్ కలిసి గత ఏడాది కాలంగా పని చేస్తోంది.

కస్టమర్లకు ప్రత్యక్ష అనుభూతి

కస్టమర్లకు ప్రత్యక్ష అనుభూతి

రిలయన్స్ డిజిటల్ దేశవ్యాప్తంగా సక్సెస్ అయింది. 350 రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో వన్ ప్లస్ డివైస్‌లు విక్రయిస్తున్నారు. ఇప్పుడు వన్ ప్లస్ టెలివిజన్ ద్వారా ఈ భాగస్వామ్యం మరింత బలపడుతుందని చెబుతున్నారు. కస్టమర్లు వన్ ప్లస్ టీవీలను ప్రత్యక్షంగా చూసి, తెలుసుకునేందుకు ఆఫ్ లైన్ ప్లాట్ ఫామ్ బాగుంటుందని చెబుతున్నారు.

Read more about: festival tv reliance deepawali diwali
English summary

రిలయన్స్ డిజిటల్‌లో వన్ ప్లస్ సూపర్ ఆఫర్, రూ.7,000 క్యాష్ బ్యాక్ | OnePlus launches TV offline through Reliance Digital

The OnePlus television will now be available in offline stores, with the Chinese brand partnering with Reliance Retail to sell the models through Reliance Digital stores.
Story first published: Sunday, October 20, 2019, 12:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X