For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అనుకున్నదొక్కటి .... అయినది ఒక్కటి? తగ్గించిన పన్ను రేటు ప్రయోజనాలు బదిలీ చేసే కంపెనీలు తక్కువే!

|

ఒక్కోసారి మనం ఒకటి అనుకొని పని మొదలు పెడితే .. అది పూర్తయ్యే సరికి ఊహించిన దానికి విరుద్ధంగా జరిగితే... అనుకున్నదొక్కటి... అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా అంటూ నిట్టూరుస్తాం. ప్రస్తుతం ఈ సామెత కేంద్ర ప్రభుత్వానికి సరిగ్గా సరిపోయేలా ఉంది. ఎందుకంటే... ఇటీవలే మన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కార్పొరేట్ పన్ను రేటును భారీగా తగ్గించేశారు. 30% పన్ను రేటును 22% నికి కుదించి శభాష్ అనిపించుకున్నారు. దీంతో భారత్ లో పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుందని, తగ్గించిన పన్ను రేటు ప్రయోజనాలను వెంటనే కంపెనీలు తమ వినియోగదారులకు బదిలీ చేస్తాయని భావించారు.

IRCTC అకౌంట్ ద్వారా నెలలో 12 టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా?IRCTC అకౌంట్ ద్వారా నెలలో 12 టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా?

బదిలీ విషయం పక్కన పెడితే అసలు ఆ విధానంలోకి వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలోనే అధిక కంపెనీలు ఉన్నాయని ఒక పరిశోధనలో తేలింది. మూడో వంతు కంపెనీలు కొత్త విధానంలోకి మారే అంశాన్ని ఇంకా పరిశీలనలోకి తీసుకోలేదు. ప్రముఖ రేటింగ్స్ సంస్థ క్రిసిల్ నిర్వహించిన పరిశోధనలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీ టీ ఐ ) ఒక కథనాన్ని వెలువరించింది.

Cos tailoring land deals, machine transfers to claim lower tax rate

మారినా... అనుమానమే!
రేటింగ్స్ సంస్థ క్రిసిల్ సుమారు 850 కంపెనీలతో ఈ పరిశోధన నిర్వహించింది. ఇవన్నీ భారీ స్థాయి కంపెనీలే కావటం విశేషం. సర్వే లో పాల్గొన్న మొత్తం కంపెనీల్లో రెండో వంతు కంపెనీలు తాము కొత్త పన్ను రేటుకు బదిలీ అవుతామని స్పష్టం చేశాయి. కానీ వెంటనే భారీగా పెట్టుబడులు పెట్టె అవకాశం లేదని వెల్లడించాయి. దీంతో ఇతరత్వ పన్ను ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేసే విషయం అనుమానమే. అయితే, వీటికి తగు కారణాలను మాత్రం క్రిసిల్ పేర్కొనలేదు. సర్వే చేసిన కంపెనీలు అధిక భాగం ఎక్కువ పెట్టుబడులు పెట్టే విద్యుత్, చమురు, గ్యాస్ సంబంధితమైనవి కావటం గమనార్హం. ఆటోమొబైల్స్, కెమికల్స్, టెక్స్టైల్స్, జేమ్స్ అండ్ జ్యువలరీ, రిటైల్ రంగాలకు చెందిన అధిక కంపెనీలు కొత్త పన్ను విధానాన్ని అనుసరించేందుకు సిద్ధపడుతున్నాయి.

ప్రభుత్వానికి రూ 1.45 లక్షల కోట్ల నష్టం...
కార్పొరేట్ పన్ను రేటును ప్రస్తుతమున్న 30% నుంచి 22% నికి తగ్గించటం, అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటు చేసే కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు కేవలం 15% పన్ను రేటును నిర్ణయించటంతో... ప్రభుత్వానికి రూ 1.45 లక్షల కోట్ల మేరకు పన్ను నష్టం వాటిల్లుతుంది. అయినా సరే మందగమనం లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వం భావించింది. పెట్టుబడులు పెరిగి, వినియోగం కూడా పెరుగుతుందని అంచనా వేసింది. కానీ ఆ అంచనాలు తప్పేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

షరతులతో కష్టాలు...
ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో తీసుకొనేలా విధానాలను రూపొందిస్తాయి. సరిగ్గా కార్పోరేట్ టాక్స్ తగ్గింపు విషయంలోనూ ఇదే జరిగింది. తక్కువ పన్ను రేటుకు మారాలనుకొనే కంపెనీలు ప్రస్తుతం ప్రభుత్వం నుంచి తీసుకొంటున్న అన్ని రకాల ప్రయోజనాలను వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో కంపెనీలు ఆలోచనలో పడ్డాయి. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల ప్రయోజనాలు అందిస్తాయి. ఇందులో పన్ను మినహాయింపులు, రిజిస్ట్రేషన్ చార్జీల తిరిగి చెల్లింపు, తక్కువ ధరలకే భూముల కేటాయింపు, నీటి వసతి, మౌలికసదుపాయాల కల్పన, విద్యుత్ చార్జీల్లో మినహాయింపులు, ఎగుమతి ప్రోత్సాహకాలు ఇలా అనేకం అమలు చేస్తాయి. వీటన్నిటి విలువ ప్రస్తుతం విధించే పన్ను రేటుకంటే తక్కువ ఉంటేనే కంపెనీలు కొత్త విధానం లోకి మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే, ప్రభుత్వ ప్రయోజనాల పరిమితి కాలం ముగిసిన తర్వాతే కొత్త పన్ను విధానానికి మారతాయని చెబుతున్నారు.

బదలాయించేది 10 శాతమే...
క్రిసిల్ నిర్వహించిన సర్వే లో పాల్గొన్న కంపెనీల్లో కొత్త పన్ను విధానానికి మారేందుకు మూడింట ఒకటో వంతు అసలు సుముఖంగా లేవు. మిగిలిన రెండో వంతు కంపెనీల్లో కేవలం 10% సంస్థలు మాత్రమే తాము తగ్గిన పన్ను ప్రయోజనాలను తమ వినియోగదారులకు బదిలీ చేస్తామని చెప్పాయి. డిస్కౌంట్లు, ఆఫర్ల రూపంలో తక్కువ ధరలకు ఉత్పత్తులను అందిస్తామన్నాయి. కొన్ని కంపెనీలు తమ అప్పులు తీర్చేందులు మిగులు నిధులను వినియోగించాలని భావిస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలు భవిష్యత్ లో పెట్టబోయే పెట్టుబడుల కోసం ఆ నిధులను రిజర్వు చేయాలనీ నిర్ణయించాయి. మరి కొన్ని కంపెనీలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

English summary

అనుకున్నదొక్కటి .... అయినది ఒక్కటి? తగ్గించిన పన్ను రేటు ప్రయోజనాలు బదిలీ చేసే కంపెనీలు తక్కువే! | Cos tailoring land deals, machine transfers to claim lower tax rate

Some companies are carefully structuring land deals and machinery transfers to take advantage of the recently announced low corporate tax rate for new manufacturers, and are even taking advice from experts on what could happen if the tax department questions them at a later stage.
Story first published: Wednesday, October 16, 2019, 9:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X