For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగులకు TCS సూపర్ ట్రెండ్: పరీక్షలో సత్తాచాటితే శాలరీ ప్యాకేజీ హైక్

|

సాఫ్టువేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగుల వేతనాల పెంపుకు సరికొత్త 'పరీక్ష'!. ఉద్యోగులు వారి నైపుణ్యాలని నిరూపించుకునేందుకు, తద్వారా సంస్థలో వారి పాత్రను అప్ గ్రేడ్ చేయడంతో పాటు అధిక ప్యాకేజీ ఇచ్చేందుకు టీసీఎస్ అవకాశం కల్పిస్తోంది. ఇందుకు సరికొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ప్రస్తుతం సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు తోటివారితో పోటీ పడి ప్రతిభను నిరూపించుకునే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం పరీక్షలు నిర్వహించి అందులో ప్రతిభ చూపినవారికి ప్యాకేజీలు మెరుగుపరచాలని భావిస్తోంది.

ప్లాస్టిక్ బదులు.. వెదురు నీళ్ల బాటిల్స్, ధర ఎంతో తెలుసా?ప్లాస్టిక్ బదులు.. వెదురు నీళ్ల బాటిల్స్, ధర ఎంతో తెలుసా?

ఉద్యోగులకు పరీక్షలు

ఉద్యోగులకు పరీక్షలు

టీసీఎస్ క్యాంపస్ నియామకాల కోసం ఈ విధానాన్ని అవలంభిస్తోంది. ఇప్పుడు కంపెనీకి సెలక్ట్ అయిన వారి విషయంలోను ఇలాంటి విధానాన్ని అవలంభిస్తోంది. ఇందుకోసం టీసీఎస్ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్స్ (TNQT)ని నిర్వహిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో టీసీఎస్ 14,097 మందిని కొత్తగా ఉద్యోగంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కంపెనీలోని ఉద్యోగుల ప్రతిభను వెలికితీస్తోంది.

ఉద్యోగుల ప్రతిభ వెలికితీత

ఉద్యోగుల ప్రతిభ వెలికితీత

దేశవ్యాప్తంగా టీసీఎస్ నియామకాల కోసం టీఎన్‌క్యూటీ నిర్వహిస్తున్నామని, ఇప్పుడు వీరి నుంచి మరింత ప్రతిభావంతులను వెలికితీసే విధానం ప్రారంభించామని, ఎవరైనా టీఎన్‌క్యూటీ పరీక్షలో ప్రతిభ చూపిస్తే మరో డిజిటల్ పరీక్షను నిర్వహిస్తామని తెలిపింది. దానిని కూడా పూర్తి చేస్తే వారి ప్యాకేజీ పెంచుతామని టీసీఎస్ ప్రతినిధి ఒకరు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.

పరీక్, పాసైతే ప్యాకేజీ ఎక్కువ

పరీక్, పాసైతే ప్యాకేజీ ఎక్కువ

గత ఏడాది టీసీఎస్ కొత్తగా 30వేల మందికి పైగా ఉద్యోగులను నియమించుకుంది. వారిలో దాదాపు 1300 మంది ఈ పరీక్ష పాసై తమ ప్యాకేజీని మెరుగుపరుచుకున్నారు. గత త్రైమాసికంలోను ఎంపికైన 14వేల మందికి పైగా ఉద్యోగుల్లోను ప్రతిభను వెలికితీసేందుకు పరీక్షలు నిర్వహించనున్నారు.

English summary

ఉద్యోగులకు TCS సూపర్ ట్రెండ్: పరీక్షలో సత్తాచాటితే శాలరీ ప్యాకేజీ హైక్ | TCS employees can sit for exams to be eligible for higher package

TCS is providing opportunities to employees within the system to prove their skills and upgrade their roles within the organisation, something that was earlier open only to campus recruits.
Story first published: Tuesday, October 15, 2019, 13:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X