For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైతు భరోసాకు రూ.1,000 పెంచారు కానీ, అందుకే ఇలా చేశారా?

|

అమరావతి: కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసా ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నిన్న మరో గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. పీఎం కిసాన్ యోజన కింద కేంద్రం రూ.6,000 ఇస్తోంది. దీనికి మరో రూ.6,500 జత చేసి మొత్తం రైతులకు రూ.12,500 పెట్టుబడి సాయం ఇవ్వాలని తొలుత భావించింది. సోమవారం మరో రూ.1,000 పెంచి, రూ.13,500 ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే, రైతు భరోసాలో కేంద్రం నుంచి దాదాపు సగం నిధులు వస్తున్నందున దీని పేరును కూడా వైయస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ స్కీంగా మార్చారు.

దీంతో 67 వేల మందికి పైగా రైతులకు ప్రయోజనం చేకూరనుంది. దీనిని ప్రతి సంవత్సరం రైతుల ఖాతాల్లోకి మూడు విడతలుగా జమ చేస్తుంది. మే నెలలో రూ.7,500, రబీలో రూ.4,000, సంక్రాంతికి రూ.2,000 ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పెట్టుబడి సాయం కింద రైతులకు ఈసారి మొత్తం అమౌంట్ రాదు. సీఎం జగన్ అక్టోబర్ 15న రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.

రూ.1,000 పెరిగిన రైతు భరోసా: ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు

రూ.50వేలు ఇస్తానని జగన్ చెప్పారు కానీ..

రూ.50వేలు ఇస్తానని జగన్ చెప్పారు కానీ..

రైతు భరోసా - పీఎం కిసాన్ స్కీం కింద రూ.13,500 మొత్తాన్ని మూడు విడతలుగా ఇవ్వాల్సి ఉండగా, ఈ ఏడాదికి గాను దీనిని ఆలస్యంగా.. ఇప్పుడు ప్రారంభిస్తున్నందున తొలి, రెండో విడత మొత్తం రూ.11,500 రైతుల అకౌంట్లలో వేయనున్నారు. మిగతా రూ.2,000ను సంక్రాంతికి అందిస్తారు. కౌలు రైతులకు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే రూ.13,500 ఇస్తుంది. రైతులకు నాలుగేళ్లలో రూ.50,000 అందిస్తామని జగన్ ప్రకటించారు. ఇప్పుడు రూ.1,000 పెంచడంతో పాటు, అయిదేళ్లకు పెంచారు. దీంతో ఇప్పుడు కేంద్రం సహకారంతో రూ.67,500 ఇస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.30,000 కాగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.37,500గా ఉంటుందని చెప్పవచ్చు.

అర్హులైన రైతు చనిపోతే...

అర్హులైన రైతు చనిపోతే...

రైతులకు రూ.13,500 మొత్తాన్ని ఒకేసారి ఇవ్వడం కంటే ఖరీఫ్, రబీ అవసరాలకు అనుగుణంగా ఇస్తే బాగుంటుందని ప్రభుత్వం భావించింది. వ్యవసాయ కుటుంబాలు సంక్రాంతి పండుగను సంతోషంగా చేసుకునేలా ఉండాలని భావించారు. అర్హులైన రైతులను, కౌలు రైతులను గుర్తించేందుకు నవంబర్ 15వ తేదీ వరకు గడువు పెంచారు. ఈ లోగా డాక్యుమెంట్స్ తప్పులు సరిదిద్దుకోవాలి. ప్రజాసాధికార సర్వే చేయించుకోవాలి, ఆధార్ వివరాలు అనుసంధానం చేసుకోవాలి. అర్హులైన రైతుల జాబితాను పంచాయతీ, ఎంపీడీవో, కలెక్టర్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచవలసి ఉంటుంది. కాగా, పథకానికి అర్హత సాధించిన రైతుల్లో ఇప్పటికే 1,37,000 మంది చనిపోయారు. వారసత్వ ధృవీకరణ పత్రం తెచ్చుకుంటే వారిని చేరుస్తారు. కోర్టు నుంచి పత్రం తెచ్చుకునేందుకు ఆలస్యమవుతుండటంతో చనిపోయిన రైతు భార్యకు ఇది అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. భార్య లేకుంటే కుమారుల్లో ఎవరినో ఒకరినో అర్హులుగా తేల్చాలి.

జగన్ అందుకే రూ.1,000 పెంచి ఇలా చేశారా?

జగన్ అందుకే రూ.1,000 పెంచి ఇలా చేశారా?

ఇదిలా ఉండగా, తొలుత రైతు భరోసా - పీఎం కిసాన్ స్కీం కింద రూ.12,500 ఇవ్వాలని నిర్ణయించారు. తాజాగా రూ.13,500కు పెంచారు. అయితే దీనిని విడతలవారీగా ఇస్తున్నారు. ఇలా రూ.1000 పెంచి, మూడు విడతల్లో చెల్లించాలని నిర్ణయించడానికి ఆర్థిక ఇబ్బందులు కారణంగా వార్తలు వస్తున్నాయి. తొలి విడత నిధులకు కూడా వేస్ అండ్ మీన్స్ (చేబదులు) వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయట. ఈ నెల ప్రారంభంలో ఉద్యోగులందరికీ వేతనాలు ఇవ్వడానికి ఇబ్బంది పడిందని, ఒకటో తేదీన చెల్లించాల్సిన వేతనాలు కొన్ని శాఖలకు ఆలస్యంగా పడిందని అంటున్నారు.

వేస్ అండ్ మీన్స్ ద్వారా..

వేస్ అండ్ మీన్స్ ద్వారా..

ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు ఆర్బీఐలో బాండ్స్ వేలం ద్వారా రూ.2,000 కోట్లు సమీకరించారని అంటున్నారు. ఖజానాలో నిధులు పెద్దగా లేవని వార్తలు వస్తున్నాయి. మంగళవారం ప్రారంభిస్తున్న రైతు భరోసా తొలి విడత పూర్తి చేయడం కోసం వేస్ అండ్ మీన్స్ సౌకర్యాన్ని వినియోగించుకునే పరిస్థితి ఉందని అంటున్నారు. దీని ద్వారా రాష్ట్రానికి రూ.1510 కోట్లు వస్తాయట.

ఒకేసారి చెల్లించడం కష్టం కాబట్టి..

ఒకేసారి చెల్లించడం కష్టం కాబట్టి..

ప్రతి మంగళవారం ఆర్బీఐ వద్ద రాష్ట్ర ప్రభుత్వాలు బాండ్స్ వేలం వేసి రూ.1,000 కోట్లు తెచ్చుకునే వెసులుబాటు ఉంది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఒకేసారి రూ.5,500 కోట్లు చెల్లించడం కష్టమని, కాబట్టి విడతల వారీగా ఇవ్వడమే మంచిదని భావించారట. అదే సమయంలో కేంద్రం ఇచ్చే రూ.6000 మూడు విడతల్లో రూ.2000గా వస్తుంది. ఇది కూడా ఓ కారణంగా చెబుతున్నారు.

English summary

Rythu Bharosa PM Kisan scheme: Behind installment credit

Rythu Bharosa is a welfare scheme under which financial assistance of Rs 13,500 will be provided to the farmers of the state.
Story first published: Tuesday, October 15, 2019, 15:39 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more