For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోట్ల రద్దుపై ముందే హెచ్చరిక, రూ.2000 నోటుతో ఇల్లీగల్ ఈజీ: మోడీపై నోబెల్ విన్నర్ అభిజిత్

|

నోబెల్ బహుమతి గెలుచుకున్న ఇండియన్ అమెరికాన్ అభిజిత్ బెనర్జీ భారత ఆర్థిక వ్యవస్థ గురించి హెచ్చరికలు జారీ చేశారు. ఇండియన్ ఎకానమీ ప్రమాదపు అంచున ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ చాలా ఘోరంగా ఉందని, గృహ వినియోగం చాలా క్షీణించిందని, కుప్పకూలే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటాను పరిశీలిస్తే ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కన్పించడం లేదన్నారు. గత కొన్నాళ్లుగా కొంత వృద్ధి అయినా కన్పించిందని, ఇప్పుడా నమ్మకం కూడా లేదని అభిప్రాయపడ్డారు.

భారత సంతతి ఆర్థికవేత్తకు నోబెల్ బహుమతి, ఏం చేశారంటే?భారత సంతతి ఆర్థికవేత్తకు నోబెల్ బహుమతి, ఏం చేశారంటే?

భారత ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా...

భారత ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా...

తన అభిప్రాయం మేరకు ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉందని అభిజిత్ బెనర్జీ అన్నారు. ఇండియన్ ఎకానమీ గురించి ప్రశ్నించగా ఆయన ఈ సమాధానం చెప్పారు. నేషనల్ శాంపిల్ సర్వే డేటా (NSS) ప్రకారం అర్బన్, రూరల్ ఇండియాలో 2014-15, 2017-18 మధ్య వినియోగం పడిపోయిందని చెప్పారు. చాలా చాలా ఏళ్ల తర్వాత కన్సంప్షన్ మొదటిసారి ఘోరంగా పడిపోయిందని ఆయన చెప్పారు.

పరిస్థితిపై హెచ్చరిక

పరిస్థితిపై హెచ్చరిక

ప్రస్తుత ఆర్థిక పరిస్థితి హెచ్చరిక అని అభిజిత్ బెనర్జీ అన్నారు. చాలా వేగంగా మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థ గురించి ప్రభుత్వానికి తెలుసునని చెప్పారు. ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవడానికి భారత్ ఏం చేస్తుందని భావిస్తున్నరనే ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ఆసక్తి చూపలేదు. ప్రభుత్వం ప్రతి ఒక్కరిని సంతోష పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుందని, కానీ బడ్జెట్ లక్ష్యాలను, ద్రవ్య లక్ష్యాలను టార్గెట్‌గా పెట్టుకున్నట్లుగా వ్యవహరిస్తోందన్నారు.

ప్రస్తుతం డిమాండ్ సమస్య

ప్రస్తుతం డిమాండ్ సమస్య

ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ... మానిటరీ స్టెబిలిటీ గురించి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ అతి పెద్ద సమస్య అని అభిజీత్ బెనర్జీ అన్నారు. కోల్‌కతా నుంచి వచ్చిన వారిలో మీతో సహా పలువురు నోబెల్ బహుమతులు అందుకున్నారని, ఇందుకు ఎలా ఫీల్ అవుతున్నారని ప్రశ్నించగా, తన కంటే ముందు నోబెల్ అందుకున్న వారి మరింత విశిష్టత కలిగినవారిగా భావిస్తున్నట్లు చెప్పారు.

4

నోట్ల రద్దుకు వ్యతిరేకం

నోట్ల రద్దుకు వ్యతిరేకం

2016 నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దును ప్రకటించారు. రూ.1000, రూ.500 నోట్ల రద్దును విమర్శించిన వారిలో అభిజీత్ బెనర్జీ ఒకరు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడిన కష్టాలు ఎవరి అంచనాలకు అందవన్నారు. ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత సంక్షోభానికి మూల కారణాల్లో నోట్ల రద్దు కూడా ఉందన్నారు. అనాలోచిత విధానాలకు ప్రత్యక్ష ఉదాహరణ పెద్ద నోట్ల రద్దు అని అభిజీత్ సతీమణి డఫ్లో అన్నారు. ఆర్థిక శాస్త్రంలో సంయుక్తంగా నోబెల్ అందుకున్న వారిలో ఈమె కూడా ఉన్నారు. ప్రస్తుత ఆర్థిక మందగమనంపై నోట్ల రద్దు ప్రభావం ఉందని అభిజీత్ బెనర్జీ చెప్పారు. నోట్ల రద్దు ఆందోళన మొదట ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉందన్నారు.

నోట్ల రద్దు వల్ల...

నోట్ల రద్దు వల్ల...

నోట్ల రద్దుపై హార్వార్డ్ యూనివర్సిటీకి చెందిన నమ్రతా కాలాతో కలిసి పేర్కొన్న ఓ పేపర్‌లో అభిజీత్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో ఎక్కువ ఎకనమిక్ ట్రాన్సాక్షన్లు జరిగే చోట ద్రవ్య లోటు ఏర్పడిందని, దీంతో ట్రాన్సాక్షన్స్ పరిమాణం లేదా సంఖ్య తగ్గుతుందని, ఈ భారం అధికంగా ఇన్ఫార్మల్ సెక్టార్ పైన పడిందని అభిజీత్ అందులో అభిప్రాయపడ్డారు. ఇక్కడే 85 శాతం లేదా అంతకంటే ఎక్కువ భారత శ్రామిక శక్తి పని చేస్తోందన్నారు. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ సంప్రదాయ నగదు రూపంలో జరుగుతాయన్నారు.

ఇల్లీగల్ చెల్లింపు సులభం

ఇల్లీగల్ చెల్లింపు సులభం

నోట్ల రద్దుతో అవినీతిని తగ్గించడం అనేది ప్రభుత్వం (ప్రధాని నరేంద్ర మోడీ) ఉద్దేశ్యం అయినప్పటికీ అంతకంటే రెండింతల విలువ కలిగిన నోటును తీసుకు వచ్చారని అభిజీత్ బెనర్జీ చెప్పారు. రూ.500, రూ.1000 నోటును రద్దు చేసినా, రూ.2000 నోటును తీసుకు రావడంపై ఆయన పైవిధంగా స్పందించారు. ఇప్పుడు ఇలా కూడా ఇల్లీగల్ చెల్లింపు సులభమవుతుందన్నారు. పెద్ద నోట్లు కలిగి ఉన్న వారికి నోట్ల రద్దు జరిమానాలా కాకుండా అవినీతిని భవిష్యత్తులో ప్రోత్సహించేలా కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు.

English summary

నోట్ల రద్దుపై ముందే హెచ్చరిక, రూ.2000 నోటుతో ఇల్లీగల్ ఈజీ: మోడీపై నోబెల్ విన్నర్ అభిజిత్ | Abhijit Banerjee, the Nobel laureate who warned India of note ban pain

Indian American economist Abhijit Banerjee, one of the three recipients of this year’s Nobel Prize for Economics, is firmly rooted in Indian economic policies and research, especially in the fields of microfinance and financial inclusion.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X