For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి... మరి రుణాలకు గిరాకీ పెరుగుతోందా?

|

భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వరుసగా రేపో రేటును తగ్గించడం వల్ల బ్యాంకులు కూడా తాము జారీ చేసే రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. రేపో రేటు స్థాయిలో కాకున్నా ఎంతో కొంత వడ్డీ రేటును బ్యాంకులు తగ్గిస్తున్నాయి. దీని వల్ల రుణాలు తీసుకునే వారిపై వడ్డీ భారం తగ్గుతోంది. తాజాగా దాదాపు అర డజను ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను 0.25 శాతం వరకు తగ్గించాయి. ఈ బ్యాంకుల్లో బ్యాంక్ అఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ అఫ్ కామర్స్, బ్యాంక్ అఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియాలు కూడా ఉన్నాయి. బ్యాంకులు తమ ప్రామాణిక వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల గృహ, ఆటో, ఇతర రుణాలు మరింత చవకగా మారాయి.

15 ని.ల్లో పని పూర్తి.. 3 విభాగాలుగా 500 రకాల సేవలు15 ని.ల్లో పని పూర్తి.. 3 విభాగాలుగా 500 రకాల సేవలు

రుణాల్లో 8.79 శాతమే వృద్ధి..

రుణాల్లో 8.79 శాతమే వృద్ధి..

వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి కాబట్టి రుణాల్లో జోరుగా వృద్ధి నమోదు అవుతుందని అందరు భావిస్తున్నారు. అయితే పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నట్టు తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఆర్బీఐ వెల్లడించిన గణాంకాల ప్రకారం సెప్టెంబర్ 27 తో ముగిసిన పక్షం లో రుణాల్లో వృద్ధి 8.79 శాతానికి తగ్గి రూ.97.71 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఒక అంకె స్థాయిలో రుణాల్లో వృద్ధి నమోదు కావడం ఇదే మొదటిసారి. గత ఆర్ధిక సంవత్సరం ఇదే కాలంలో బ్యాంకులు ఇచ్చిన రుణాలు 89.82 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత సెప్టెంబర్ 13 తో ముగిసిన పక్షంలో రుణాలు 10.26 శాతం వృద్ధి చెంది రూ.97.01 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీన్ని బట్టి వడ్డీ రేట్లు తగ్గినప్పటికీ ఆశించిన స్థాయిలో రుణాల్లో వృద్ధి నమోదు కావడం లేదని అర్థం అవుతోందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

డిపాజిట్లలోనూ తగ్గుతున్న వృద్ధి..

డిపాజిట్లలోనూ తగ్గుతున్న వృద్ధి..

బ్యాంకులు రుణాలపైనే కాకుండా డిపాజిట్లపైన కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. దీనివల్ల డిపాజిట్ దారుల్లో నిరాశ వ్యక్తం అవుతోంది. ఫలితంగా డిపాజిట్లు తగ్గుతున్నాయి. సమీక్ష కాలంలో డిపాజిట్లు 9.38 శాతం తగ్గి రూ.129.06 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో డిపాజిట్లు రూ.118 కోట్లుగా ఉన్నాయి. సెప్టెంబర్ 13తో ముగిసినపక్షంలో డిపాజిట్లలో వృద్ధి 10.02 శాతంగా ఉంది.

ఏ రంగ రుణాల్లో వృద్ధి ఎలా ఉందంటే...

ఏ రంగ రుణాల్లో వృద్ధి ఎలా ఉందంటే...

* ఆగస్టులో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు రుణాలు 6.8 శాతం పెరిగాయి. గత ఏడాది ఇదే కాలంలో వృద్ధి 6.6 శాతంగా ఉంది.

* సర్వీసుల రంగంలో రుణ వృద్ధి 26.7 శాతం నుంచి 13.3 శాతానికి తగ్గింది.

* వ్యక్తిగత రుణాల్లో వృద్ధి 15.6 శాతంగా ఉంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో వృద్ధి 18.2 శాతంగా నమోదయింది.

* అయితే పరిశ్రమలకు ఇచ్చే రుణాల్లో మాత్రం రెండింతలు పైగా పెరిగి 1.9 శాతం నుంచి 3.9 శాతానికి చేరుకుంది.

భవిష్యత్ పై ఆశాభావం..

భవిష్యత్ పై ఆశాభావం..

వడ్డీ రేట్లు తగ్గిస్తున్న కారణంగా రుణాలు తీసుకునే వారి సంఖ్య భవిష్యత్లో పెరుగుతుందని బ్యాంకులు భావిస్తున్నాయి. అయితే రుణాలు రుణాలు తీసుకునే వారిలో ఒక రకమైన ఆందోళన వ్యక్తం అవుతోంది. అదేమిటంటే ... ఇప్పటికైతే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పటికీ భవిష్యత్లో పెరిగే అవకాశాలు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రుణాలపై ఆచి తూచి వ్యవహరిస్తున్నారని పరిశ్రమ పరిశీలకులు చెబుతున్నారు.

English summary

వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి... మరి రుణాలకు గిరాకీ పెరుగుతోందా? | public sector banks cut lending rates

About half a dozen public sector banks, including Bank of India, Oriental Bank of Commerce and Bank of Maharashtra, have reduced lending rates by up to 25 basis points following a cut in the key policy repo rate by the RBI last month.
Story first published: Sunday, October 13, 2019, 11:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X