For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోడీ ప్రభుత్వం నిర్ణయం: రూ.6,250 వరకు పెరగనున్న పెన్షన్, రూ.12,500 వరకు పెరగనున్న శాలరీ

|

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) ఐదు శాతం పెంచుతూ దీపావళి పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. దీంతో ఉద్యోగుల డీఏ 12 శాతం నుంచి 17 శాతానికి పెరిగింది. ఇది ఉద్యోగులకే కాదు పెన్షనర్లకు కూడా ప్రయోజనమే. ఎందుకంటే డియర్‌నెస్ అలవెన్స్‌తో పాటు డియర్‌నెస్ రిలీఫ్ కూడా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం DA పెంపు నిర్ణయం వల్ల 62 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. దీని వల్ల వారికి పెన్షన్ మొత్తం పెరగనుంది.

మోడీ నాయకత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్, డీఏ 5 శాతం పెంపుమోడీ నాయకత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్, డీఏ 5 శాతం పెంపు

రూ.1.25 లక్షల పెన్షన్ వస్తే రూ.6,250 పెంపు

రూ.1.25 లక్షల పెన్షన్ వస్తే రూ.6,250 పెంపు

డియర్‌నెస్ రిలీఫ్ (DR) పెరగడంతో పెన్షనర్లకు వచ్చే పెన్షన్ రూ.450 మొదలు రూ.6250 వరకు పెరగనుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా DRను పెంచిందని చెబుతున్నారు. ఆలిండియా ఆడిట్ అండ్ అకౌంట్స్ అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రటరీ మాట్లాడుతూ... గత కొన్నేళ్లలో ఇదే అత్యధికం అన్నారు. డియర్‌నెస్ రిలీఫ్ పెరగడంతో రూ.9,000 పెన్షన్ తీసుకునే వారికి రూ.450 పెరుగుతుందని, రూ.1.25 లక్షల పెన్షన్ తీసుకునే వారికి రూ.6,250 పెరుగుతుందన్నారు.

పెన్షన్ పెరుగుదల

పెన్షన్ పెరుగుదల

2017 నుంచి మినిమం పెన్షన్/ఫ్యామిలీ పెన్షన్ రూ.9,000 నెలకు వస్తోంది. ఇది కాకుండా పరిహారం మొత్తాన్ని కూడా రెండింతలు చేశారు. కంపన్షేషన్ అమౌంట్ రూ.10.15 లక్షల నుంచి రూ.25.35 లక్షల వరకు పెరిగిందని చెప్పారు.

ఉద్యోగుల వేతనం రూ.12,500 వరకు పెరుగుదల

ఉద్యోగుల వేతనం రూ.12,500 వరకు పెరుగుదల

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గత మూడేళ్లలో అత్యధిక డిఏ లభించింది. ప్రస్తుతం డీఏ 12 శాతం ఉంది. గరిష్టంగా పెరుగుదల 3 శాతంగా ఉంది. ఇప్పుడు 12 శాతం నుంచి 17 శాతానికి పెంచారు. ఇది 5 శాతం. ఈ నేపథ్యంలో ప్రస్తుత డీఏ పెంపు ద్వారా ఉద్యోగుల వేతనం రూ.900 నుంచి రూ.12,500 వరకు పెరగనుంది.

English summary

మోడీ ప్రభుత్వం నిర్ణయం: రూ.6,250 వరకు పెరగనున్న పెన్షన్, రూ.12,500 వరకు పెరగనున్న శాలరీ | Pensioners to get more money, by up to Rs 6,250

The central government has given a big gift to around 62 lakh pensioners before Diwali this year. Along with Dearness Allowance, Dearness Relief or DR for pensioners has also been increased by 5% now.
Story first published: Friday, October 11, 2019, 16:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X