For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌కు షాక్, వృద్ధి రేటును 5.8 శాతానికి తగ్గించిన మూడీస్

|

మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ గురువారం భారత్ వృద్ధి రేటును 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను 5.8 శాతానికి తగ్గించింది. అంతకుముందు 6.2 శాతంగా అంచనా వేసిన ఈ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఇప్పుడు కుదించింది. పెట్టుబడుల మందగమనం, గ్రామీణ గృహాల్లో ఆర్థిక ఒత్తిడి, బలహీన ఉద్యోగ కల్పన వంటి వివిధ కారణాల వల్ల అంచనాను తగ్గించింది. ఆర్థిక మందగమన పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఈ ప్రభావం భారత్‌పై కూడా ఉంది. ఇది భారత్‌కు మరో షాక్.

విస్తారా ఎయిర్‌లైన్స్ ఫెస్టివల్ ఆఫర్, 48 గంటల సేల్విస్తారా ఎయిర్‌లైన్స్ ఫెస్టివల్ ఆఫర్, 48 గంటల సేల్

రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసిన 6.1 శాతం వృద్ధి కంటే ఇది తక్కువ కావడం గమనార్హం. పెట్టుబడులు తగ్గుముఖం పట్టడం, వినిమయం నిరాశావాదంగా ఉండటం, గ్రామీణ గృహస్తులు ఆర్థిక ఒత్తిళ్లకు లోనుకావడం, ఉద్యోగ కల్పన అంతంత మాత్రంగా ఉండటంతో వృద్ధి అంచనాల్లో కోత విధించినట్లు ఈ మేరకు తెలిపింది. దేశీయంగా, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని నివేదించింది.

Moody’s cuts India GDP growth forecast to 5.8%

దీర్ధకాల అంశాల కారణంగా ఆర్థిక వ్యవస్థలో స్పష్టమైన మాంద్యం ప్రభావంకనిపిస్తోందని పేర్కొంది. అదే సమయంలో ఇటీవల నరేంద్ర మోడీ ప్రభుత్వం పలు ఉద్దీపన చర్యలు తీసుకుంది. ఇటీవల ప్రకటించిన ద్రవ్య, ఆర్థికపరమైన మద్దతుతో వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2020-21లోవృద్ధి పుంజుకుని 6.6 శాతానికి చేరవచ్చని, మధ్యకాలిక వృద్ధి రేటు 7 శాతం ఉండే అవకాశం ఉందని తెలిపింది.

వరుసగా రెండేళ్ల పాటు 7 శాతం దిగువన కొనసాగనున్న వృద్ధి కొద్ది కాలం తర్వాత ఏడు శాతం కంటే అధిక వృద్ధిని నమోదు చేసుకుంటుందని తెలిపింది. రెండేళ్ల క్రితం ఎనిమిది శాతం వృద్ధి రేటుతో ప్రపంచంలో అత్యధిక వేగవంతమైన వృద్ధిని భారత్ సాధించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మందగమన పరిస్థితులతో పాటు మన దేశం పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. దీంతో వృద్ధి రేటు తగ్గింది.

గత నెలలో ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్‌లు ఇండియా వృద్ధి అంచనాలలో కోత విధించాయి. స్టాండర్డ్ అండ్ పూర్స్ కూడా 7.1 శాతం నుంచి 6.3 శాతానికి, ఫిచ్ 6.6 శాతానికి తగ్గించింది.

English summary

భారత్‌కు షాక్, వృద్ధి రేటును 5.8 శాతానికి తగ్గించిన మూడీస్ | Moody’s cuts India GDP growth forecast to 5.8%

Moody’s Investors Service on Thursday cut India’s gross domestic product (GDP) growth forecast for 2019-20 to 5.8% from the earlier estimate of 6.2%. It attributed the deceleration to an investment-led slowdown that has broadened into consumption, driven by financial stress among rural households and weak job creation.
Story first published: Friday, October 11, 2019, 8:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X