For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫోర్బ్స్: నెలకు రూ.200 కోట్ల ఆదాయం.. టీమిండియా షర్ట్స్‌పై మనోడిదే హవా, చైనా కంపెనీ ఔట్

|

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసిన అత్యంత భారతీయుల జాబితాలో మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. 2018 సంవత్సరానికి గాను ఇది విడుదల చేసింది. ముఖేష్ అంబానీ వరుసగా 12వసారి ప్రథమ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 51..4 బిలియన్ డాలర్లుగా ఉంది. 2016లో వచ్చిన జియో రాకతో ఆయన సంపద ఏకంగా 4.1 బిలియన్ డాలర్లు పెరిగింది.

IRCTC అకౌంట్ ద్వారా నెలలో 12 టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా?IRCTC అకౌంట్ ద్వారా నెలలో 12 టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా?

రెండో స్థానంలో అదానీ, 17వ స్థానానికి పడిపోయిన ప్రేమ్‌జీ

రెండో స్థానంలో అదానీ, 17వ స్థానానికి పడిపోయిన ప్రేమ్‌జీ

ఈ జాబితాలో తొలిస్థానంలో ముఖేష్ అంబానీ ఉండగా, రెండో స్థానంలో అదాని పోర్ట్స్ అధినేత గౌతమ్ అదానీ ఉన్నారు. ఆయన సంపద రూ.15.7 బిలియన్ డాలర్లు. గత ఏడాది భారత సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న విప్రో ఫౌండర్ అజీమ్ ప్రేమ్ జీ ఇప్పుడు 17వ స్థానానికి పడిపోయారు. ఆయన తన సంపదలో ఎక్కువ మొత్తాన్ని స్వచ్చంధ కార్యక్రమాల కోసం విరాళం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన సంపద తగ్గింది.

తొలిసారి టాప్ 5లో ఉదయ్ కొటక్

తొలిసారి టాప్ 5లో ఉదయ్ కొటక్

టాప్ 10 జాబితా విషయానికి వస్తే ముఖేష్ అంబానీ, అదానీలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఆ తర్వాత అశోక్ లేలాండ్ యాజమానులు హిందూజా సోదరులు ($15.6 బిలియన్లు), పల్లోంజీ గ్రూప్ అధినేత పల్లోంజి మిస్త్రీ ($15 బిలియన్లు), ఉదయ్ కొటక్ ($14.8 బిలియన్లు) వరుసగా 3, 4, 5 స్థానాల్లో ఉన్నారు. ఉదయ్ కొటక్ టాప్ 5లో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి.

కొత్తగా ఫోర్బ్స్ లిస్ట్‌లో ఆరుగురు

కొత్తగా ఫోర్బ్స్ లిస్ట్‌లో ఆరుగురు

ఫోర్బ్స్ టాప్ 100 జాబితాలోకి ఈసారి కొత్తగా 6గురు వచ్చారు. సింగ్ ఫ్యామిలీ (41వ స్థానం, $3.18 బిలియన్లు), 38 ఏళ్ల బైజూస్ రవీంద్రన్ (72వ స్థానం, $1.91 బిలియన్ డాలర్లు), అరిస్ట్రో ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన మహేంద్ర ప్రసాద్ (81వ స్థానం, $1.77 బిలియన్ డాలర్లు), హల్దీరామ్ స్నాక్స్‌కు చెందిన మనోహర్ లాల్- మధుసూదన్ అగర్వాల్ (86వ స్థానం, $1.7 బిలియన్ డాలర్లు), బ్రాండ్ జాక్వార్‌కు చెందిన రాజేష్ మెహ్రా (95వ స్థానం, $1.7 బిలియన్ డాలర్లు), అస్త్రాల్ పాలీ టెక్నిక్‌కు చెందిన సందీప్ ఇంజినీర్ (98వ స్థానం, $1.45 బిలియన్ డాలర్లు) కొత్తగా జాబితాలోకి వచ్చారు.

బిలియనీర్ల వద్ద క్షీణించిన సంపద

బిలియనీర్ల వద్ద క్షీణించిన సంపద

ఫోర్బ్స్ జాబితాలోని భారత కోటీశ్వరులపై ఆర్థిక మాంద్య భయాల ప్రభావం కనిపించింది. ఈ సంపన్నుల వద్ద సంపద గతంలో కంటే 8 శాతం తగ్గి 452 బిలియన్ డాలర్లుగా ఉంది. టాప్ 100లోని దాదాపు సగం మంది బిలియనీర్ల నికర సంపద ఈ ఏడాది క్షీణించింది.

తక్కువ కాలంలో, పిన్న వయస్సులో ఫోర్బ్స్ జాబితాలో...

తక్కువ కాలంలో, పిన్న వయస్సులో ఫోర్బ్స్ జాబితాలో...

ఫోర్బ్స్ 100లో చోటు దక్కించుకున్న వారిలో బైజూస్ రవీంద్రన్ ఒకరు. 38 ఏళ్ల రవీంద్రన్ అతి తక్కువ కాలంలో, పిన్న వయస్సులో ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అతని సంపద 1.91 బిలియన్ డాలర్లు. ఎడ్యుటెక్ స్టార్టప్‌లో 21 శాతం ఇతని పేరుమీద ఉన్నాయి. 2019 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ ఏకంగా రూ.1,430 కోట్లకు పెరిగింది. ఈ ఎడ్యుటెక్ స్టార్టప్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతూ రెవెన్యూ సంపాదించి పెడుతోంది.

రూ.1430 కోట్ల రెవెన్యూ

రూ.1430 కోట్ల రెవెన్యూ

బైజూస్ రవీంద్రన్ స్కూల్ టీచర్ స్థాయి నుంచి ఇఫ్పుడు అత్యంత పిన్న వయస్సులో బిలియనీర్‌గా ఎదిగారు. తొలుత ఇతను సింగిల్ రూమ్‌లో క్లాస్‌లు చెప్పారు. ఆ తర్వాత హాల్‌లోకి, అనంతరం స్టేడియంకు మార్చారు. 2018-19లో బైజూస్ రెవెన్యూ ఏకంగా మూడు రెట్లు పెరిగి రూ.1430 కోట్లుగా ఉంది. తద్వారా భారీ లాభాల్లోకి దూసుకెళ్లింది.

చైనా కంపెనీ స్థానంలో బైజూస్...

చైనా కంపెనీ స్థానంలో బైజూస్...

బైజూస్ రెవెన్యూ నెలకు రూ.200 కోట్లు దాటింది. ఈ ఏడాది రూ.3,000 కోట్ల మార్క్ దాటుతుందని అంచనా. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి టీమిండియా కూడా బైజూస్‌కు అంబాసిడర్‌గా ఉంది. అంతకుముందు చైనీస్ మొబైల్ మేకర్ ఒప్పో ఉంది. ఒప్పో స్థానంలో బైజూస్ వచ్చి చేరింది.

English summary

ఫోర్బ్స్: నెలకు రూ.200 కోట్ల ఆదాయం.. టీమిండియా షర్ట్స్‌పై మనోడిదే హవా, చైనా కంపెనీ ఔట్ | Forbes India Rich List 2019: Byju Raveendran is the newest and youngest face on the Forbes list

Amid a challenging year for the economy, the total wealth of the tycoons on the 2019 Forbes India Rich List shrank 8 percent to USD 452 billion from a year ago.
Story first published: Friday, October 11, 2019, 15:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X