For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కస్టమర్లకు SBI శుభవార్త: రుణాలు మరింత చౌక, వడ్డీ రేట్లు తగ్గింపు

|

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు శుభవార్త. ఇటీవలి కాలంలో ఇప్పటికే పలుమార్లు వడ్డీ రేటు తగ్గించిన ఈ ప్రభుత్వరంగ బ్యాంకు దిగ్గజం తాజాగా మరోసారి ఎంసీఎల్ఆర్‌ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇది అన్ని కాలపరిమితులకు వర్తిస్తుంది. దీంతో వార్షిక బ్యాంకు ఎంసీఎల్ఆర్ 8.15 శాతం నుంచి 8.05 శాతానికి తగ్గింది. దీంతో రుణాలపై వడ్డీ రేటు తగ్గుతుంది.

బిగ్ షాకింగ్: బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ మూసివేతకు సిద్ధం?బిగ్ షాకింగ్: బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ మూసివేతకు సిద్ధం?

వడ్డీ రేటును ఆరోసారి తగ్గించిన ఎస్పీఐ

వడ్డీ రేటును ఆరోసారి తగ్గించిన ఎస్పీఐ

ఎంసీఎల్ఆర్‌ను మరో 10 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు తగ్గుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంసీఎల్ఆర్ తగ్గించడం ఇది ఆరోసారి. పండుగ సీజన్ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ నిర్ణయంతో ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానమైన వడ్డీ రేట్లు 10 బేసిస్ పాయింట్లు తగ్గుతాయి. ఎస్బీఐ కొత్తవారికి రెపో రేటు అనుసంధానిత గృహ రుణాలను అందిస్తోంది. దీంతో ఆర్బీఐ బెంచ్ మార్క్ రేటును సవరించిన ప్రతిసారి రుణ వడ్డీ రేటు కూడా మారుతోంది.

సవరించిన వడ్డీ రేట్లు 10 శాతం నుంచి అమల్లోకి...

సవరించిన వడ్డీ రేట్లు 10 శాతం నుంచి అమల్లోకి...

సవరించిన వడ్డీ రేట్లు అక్టోబర్ 10వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. కాగా, తాజా ఎంసీఎల్ఆర్ తగ్గింపు ప్రకారం వివిధ కాలపరిమితులపై వడ్డీ రేటు ఇలా...

- ఓవర్ నైట్ ప్రస్తుతం 7.8 శాతం ఉండగా, 7.7 శాతానికి తగ్గింది.

- వన్ మంత్ ప్రస్తుతం 7.8 శాతం ఉండగా, 7.7 శాతానికి తగ్గింది.

- త్రీ మంత్ ప్రస్తుతం 7.85 శాతం ఉండగా, 7.75 శాతానికి తగ్గింది.

- సిక్స్ మంత్ ప్రస్తుతం 8 శాతం ఉండగా, 7.9 శాతానికి తగ్గింది.

- వన్ ఇయర్ ప్రస్తుతం 8.15 శాతం ఉండగా, 8.05 శాతానికి తగ్గింది.

- టూ ఇయర్ ప్రస్తుతం 8.25 శాతం ఉండగా, 8.15 శాతానికి తగ్గింది.

- త్రీ ఇయర్ ప్రస్తుతం 8.35 శాతం ఉండగా, 8.25 శాతానికి తగ్గింది.

FDపై వడ్డీ రేట్ల సవరణ...

FDపై వడ్డీ రేట్ల సవరణ...

పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా ఎస్బీఐ వడ్డీ రేట్లను సవరించింది. రూ.1 లక్షకు పైగా పొదుపు ఖాతాలపై 3.5 శాతం నుంచి 3.25 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా రేట్లు నవంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి. అలాగే, వివిధ కాలపరిమితులకు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10 నుంచి 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. బల్క్ డిపాజిట్లపై కూడా ఈ తగ్గింపు వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటును అలాగే కొనసాగిస్తోంది. ఇక 7 నుంచి 45 రోజుల కాలపరిమితి డిపాజిట్లపై 4.5 శాతానికి, 46 నుంచి 179 రోజుల కాలపరిమితి డిపాజిట్లపై 5.50 శాతానికి, 180 నుంచి సంవత్సర కాలపరిమితి డిపాజిట్లపై 5.80 శాతానికి వడ్డీ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

English summary

కస్టమర్లకు SBI శుభవార్త: రుణాలు మరింత చౌక, వడ్డీ రేట్లు తగ్గింపు | SBI cuts lending rates, home loans to get cheaper

The country's largest lender, State Bank of India (SBI) announced early Wednesday morning that it has reduced MCLR (marginal cost of lending rate) on loans across all tenors.
Story first published: Wednesday, October 9, 2019, 16:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X