For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియో షాకింగ్: ఎయిర్‌టెల్, ఐడియా నెట్ వర్క్‌కు కాల్ చేస్తే ఛార్జ్, టాపప్ ఓచర్లు...

|

న్యూఢిల్లీ: ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రింగ్ టోన్‌ను తగ్గించింది. దీంతో పోటీగా ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలు కూడా తమ రింగ్ టోన్‌ను తగ్గించాయి. రింగ్ టోన్ తగ్గింపు అంశంపై టెలికం ఆపరేటర్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. ఇంతలో జియో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జియో నెట్ వర్క్ నుంచి ఇతర నెట్ వర్క్‌కు చేసే కాల్స్ పైన ఛార్జీ వసూలు చేయనుంది.

SBI శుభవార్త: రుణాలు మరింత చౌక, వడ్డీ రేట్లు తగ్గింపుSBI శుభవార్త: రుణాలు మరింత చౌక, వడ్డీ రేట్లు తగ్గింపు

ఇతర ప్రొవైడర్లకు ఫోన్ చేస్తే నిమిషానికి 6 పైసలు కానీ..

ఇతర ప్రొవైడర్లకు ఫోన్ చేస్తే నిమిషానికి 6 పైసలు కానీ..

రిలయన్స్ జియో కస్టమర్లు తమ జియో ఫోన్ నుంచి ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ సహా ఇతర కంపెనీల కస్టమర్లకు ఫోన్ చేస్తే నిమిషానికి 6 పైసలు ఛార్జ్ చేయనుంది. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. ఇతర టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు కాల్ చేసినందుకు నిమిషానికి కొంత మొత్తం వసూలు చేసినప్పటికీ ఆ మొత్తానికి గాను తగిన డేటాను వినియోగదారులకు ఇవ్వనుంది. అంటే డాటా రూపంలో కస్టమర్లకు ప్రయోజనాన్ని కలిగించనుంది.

సొంత నెట్ వర్క్ కాల్స్‌కు, ఇన్‌కమింగ్‌కు నో ఛార్జ్

సొంత నెట్ వర్క్ కాల్స్‌కు, ఇన్‌కమింగ్‌కు నో ఛార్జ్

ఐయూసీ ఛార్జీల విషయంలో ట్రాయ్ నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం (అక్టోబర్ 9) కంపెనీ ఓ ప్రకటన చేసింది. అయితే జియో సొంత నెట్ వర్క్ కాల్స్‌కు మాత్రం ఎలాంటి ఛార్జీలు వసూలు చేయమని స్పష్టం చేసింది. జియో టు ల్యాండ్ లైన్ కాల్స్, వాట్సాప్ కాల్స్‌కు కూడా వర్తించదు. ఇన్‌కమింగ్ కాల్స్‌కు ఎలాంటి ఛార్జ్ ఉండదని తెలిపింది.

10వ తేదీ నుంచి అమలు

10వ తేదీ నుంచి అమలు

అక్టోబర్ 10వ తేదీ నుంచి ఈ ఛార్జీలు వర్తిస్తాయని జియో తన ప్రకటనలో తెలిపింది. అంటే ఈ తేదీ తర్వాత రీచార్జ్ చేయించే వారికి ఇది వర్తిస్తుంది. ఇప్పటి వరకు జియో యూజర్లు వాయిస్ కాల్స్‌కు ఎలాంటి ఛార్జీలు చెల్లించలేదు. కేవలం డేటాకు చెల్లిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ట్రాయ్ ఆదేశాల నేపథ్యంలో ఐయూసీ ఛార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించినట్లు కంపెనీ తన ప్రకటనలో తెలిపింది.

అందుబాటులో టాపప్ ఓచర్లు...

అందుబాటులో టాపప్ ఓచర్లు...

రిలయన్స్ జియో తమ కస్టమర్లకు అనుగుణంగా టాపప్ ఓచర్ కార్డ్స్ అందుబాటులో ఉంచింది.

- రూ.10 ICU టాపప్ ఓచర్ పైన యూజర్ 1GB ఉచిత డాటా పొందుతారు. అలాగే 124 ICU మినట్స్ వాయిస్ కాల్స్ ఉచితం.

- రూ.20 ICU టాపప్ ఓచర్ పైన యూజర్ 2GB ఉచిత డాటా పొందుతారు. అలాగే 249 ICU మినట్స్ వాయిస్ కాల్స్ ఉచితం.

- రూ.30 ICU టాపప్ ఓచర్ పైన యూజర్ 5GB ఉచిత డాటా పొందుతారు. అలాగే 656 ICU మినట్స్ వాయిస్ కాల్స్ ఉచితం.

- రూ.100 ICU టాపప్ ఓచర్ పైన యూజర్ 10GB ఉచిత డాటా పొందుతారు. అలాగే 1362 ICU మినట్స్ వాయిస్ కాల్స్ ఉచితం.

English summary

జియో షాకింగ్: ఎయిర్‌టెల్, ఐడియా నెట్ వర్క్‌కు కాల్ చేస్తే ఛార్జ్, టాపప్ ఓచర్లు... | Reliance Jio to charge users 6 p/min for calls made to Airtel, Vodafone, BSNL and others

Reliance Jio customers will now have to pay for phone calls made to other mobile phone operators but the telecom player will compensate them by giving free data of equal value.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X