For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్థిక మందగమనం భారత్‌పై ఎక్కువే: ఐఎంఎఫ్ హెచ్చరిక

|

భారతదేశం వంటి అతిపెద్ద అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ తిరోగమన ప్రభావాన్ని మరింత ఎక్కువ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMP) కొత్త చీఫ్ క్రిస్టాలినా జార్జివా అన్నారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా మందగమన ప్రభావం అధికంగా కనిపిస్తోందని, ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు మరీ అత్యల్పంగా ఉందన్నారు. దాదాపు 90 శాతం ప్రపంచ దేశాలు నత్తనడకన వృద్ధి రేటును కొనసాగిస్తున్నాయన్నారు.

నరేంద్రమోడీ హామీలో మరో అడుగు: భారత్ చేరిన స్విస్ ఖాతా వివరాలునరేంద్రమోడీ హామీలో మరో అడుగు: భారత్ చేరిన స్విస్ ఖాతా వివరాలు

2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో వృద్ధి రేటు అంతగా ఉండదని అలర్ట్ చేసారు. ఈ దశాబ్ద కాలంలోనే అతి త‌క్కువ‌ రేటుగా న‌మోదవుతుందని జోస్యం చెప్పారు. రెండు సంవత్సరాల క్రితం ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ వృద్ధి దిశ‌లో వెళ్లింద‌ని, దాదాపు 75% దేశాలు ఆ దిశ‌గా వెళ్లాయ‌ని, కానీ ప్ర‌స్తుతం ఆర్థిక మంద‌గ‌మ‌నం ఉందన్నారు. అమెరికా, జ‌ర్మ‌ని దేశాల్లో రికార్డ్ స్థాయిలో నిరుద్యోగం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Effect of global slowdown is more pronounced in India: IMF chief Kristalina

భార‌త్‌, బ్రెజిల్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ వ్య‌వ‌స్థ‌ల్లో ఆర్థిక వృద్ధి బ‌ల‌హీనంగా ఉంటుందని హెచ్చరించారు. ప్ర‌పంచ ఆర్థిక వాణిజ్యం ఓ ద‌శ‌లో నిలిచిపోతుందన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ ఇందుకు ఇంతలా మందగమనంతో కొనసాగుతుందో అంచనా వేయవలసి ఉందని, ఈ దశాబ్ద కాలంలోనే ఎందుకు ఇంత తక్కువగా ఉందో ఆర్థిక నిపుణులు గుర్తించి, సరిదిద్దాలని కోరారు.

English summary

ఆర్థిక మందగమనం భారత్‌పై ఎక్కువే: ఐఎంఎఫ్ హెచ్చరిక | Effect of global slowdown is more pronounced in India: IMF chief Kristalina

The largest emerging market economies like India are experiencing an even "more pronounced" effect of the global downturn, new IMF chief Kristalina Georgieva has said, warning that the global economy is witnessing "synchronized slowdown" which will result in slower growth for 90 per cent of the world this year.
Story first published: Wednesday, October 9, 2019, 18:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X