For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టయోటా కిర్లోస్కర్ వీఆర్ఎస్ స్కీం: ఉద్యోగ, పదవీ విరమణ బెనిఫిట్స్...

|

టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) సంస్థ కర్ణాటకలోని తమ ప్లాంట్ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) పథకాన్ని ప్రారంభించింది. కనీసం అయిదేళ్లు పని చేసిన గుర్తింపు కలిగిన ఉద్యోగులు, సూపర్ వైజర్ల విభాగాలకు ఈ పథకాన్ని అమలు చేస్తుంది. నవజీవన యోజన పేరిట గత నెల 22న మొదలైన ఈ వీఆర్ఎస్ పథకం ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగుతుందని టయోటా కంపెనీ తెలిపింది.

ఆటో రంగంలో నెలకొన్న మందగమనం, మార్కెట్లో పడిపోయిన వాహన విక్రయాల నేపథ్యంలో టొయో తమ ఉద్యోగులకు ఈ పథకాన్ని తీసుకు వచ్చింది. కర్ణాటకలోని బిడాది టయోటా ప్లాంట్ ఉంది. వీరికి దీనిని అమలు చేస్తున్నారు. ఇది పూర్తిగా స్వచ్చంధమని, కంపెనీ మార్కెట్ పరిస్థితులకు, దీనికి ఎలాంటి సంబంధం లేదని సంస్థ వైస్ చైర్మన్ శేఖర్ విశ్వనాథన్ చెప్పారు.

5 ఏళ్ళు బంగారం కొనుగోలు చేస్తాను, రెండింతలు కావొచ్చు: రాకేష్5 ఏళ్ళు బంగారం కొనుగోలు చేస్తాను, రెండింతలు కావొచ్చు: రాకేష్

Toyota VRS amidst the auto sector slowdown

ఉద్యోగులకు ఆర్థిక భద్రతతో పాటు భవిష్యత్తు లక్ష్యాలు చేరుకోవడానికి ఇది దోహదపడుతుందన్నారు. వీఆర్ఎస్ ఎంచుకునే ఉద్యోగులకు సాధారణ పదవీ విరమణ ప్రయోజనాలతో పాటు అదనంగా పరిహార ప్యాకేజీ లభిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా టయోటా 6500 మంది ఉద్యోగులు ఉన్నారు. ఉత్పాదకత, సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడం కోసం గత నెలలో హీరో మోటో కార్ప్ కూడా ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించింది.

బిడాదిలో టయోటాకు రెండు ప్లాంట్స్ ఉన్నాయి. 3.10 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పాదక సామర్థ్యం కలిగి ఉంది. జపాన్‌కు చెందిన టయోటా భారత్‌కు చెందిన కిర్లోస్కర్ గ్రూప్ కలిసి TKMను ఏర్పాటు చేశారు. . గత నెలలో టయోటా అమ్మకాలు 16.56% క్షీణించి 10,911 యూనిట్లకు పరిమితం అయ్యాయి.

English summary

టయోటా కిర్లోస్కర్ వీఆర్ఎస్ స్కీం: ఉద్యోగ, పదవీ విరమణ బెనిఫిట్స్... | Toyota VRS amidst the auto sector slowdown

Toyota Kirloskar Motor (TKM) has initiated a voluntary retirement scheme for the employees of its manufacturing facility in Bidadi, Karnataka. The firm has commenced the scheme for its unionised employees and supervisory category with a minimum of five years of service at the plant.
Story first published: Monday, October 7, 2019, 9:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X